తెలంగాణ

తెరాసతో ప్రజలు విసిగిపోయారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 5: టీఆర్‌ఎస్ నిర్ణయాలతో ప్రజలు విసిగిపోయారని, ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. మంచిర్యాల మందమర్రి టీఆర్‌ఎస్ నేతలు బీజేపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇదే కార్యక్రమంలో సినీనటి సత్య చౌదరి కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ గల్లీకి పరిమితమైన ఎంఐఎంను టీఆర్‌ఎస్ ఢిల్లీకి తీసుకుపోయిందని ఆరోపించారు. ముందస్తుకు ఎందుకు పోతున్నారో కేసీఆర్ ప్రజలకు చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ నిర్ణయాలు రాచరిక పాలనను చూపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సైతం ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర కమిటీకి సూచించారని అన్నారు. ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక బహిరంగ నిర్వహిస్తామని, అందులో జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొంటారని చెప్పారు. ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం కేసీఆర్‌కు ఉంటుందని, తర్వాత రాష్టప్రతి పాలన అనేది రాజ్యాంగం ప్రకారం ఉంటుందని అన్నారు. తెలంగాణలో బీజేపీ పాగా వేయడం ఖాయమని పేర్కొన్నారు.
అనంతగిరిలో ‘అరకు ఫ్లేవర్స్’
ప్రభుత్వ కాఫీ ల్యాబ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
విజయవాడ, సెప్టెంబర్ 5: రాష్ట్రంలో మరో పర్యాటక ఆకర్షణను ఏర్పాటు చేసేందుకు ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రంగం సిద్ధం చేస్తోంది. అనంతగిరిలో అరకు ఫ్లేవర్స్ పేరుతో ప్రభుత్వ కాఫీ ల్యాబ్‌ను ప్రారంభించనుంది.
ఇందుకు అవసరమైన నిధులు 87 లక్షల రూపాయలకు పాలనా ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో భవనం, కాఫీ తయారీకి సంబంధించి వివిధ దశల్లో వాడే యంత్ర పరికరాల ప్రదర్శన, కాఫీ సెరిమనీ నిర్వహణకు వీలుగా వేదిక ఏర్పాటు తదితర నిర్మాణాలను పర్యాటక శాఖ చేపట్టనుంది.