తెలంగాణ

కుర్చీ కోసం విపక్షాల ఆరాటం: ఈటల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాపూర్, సెప్టెంబర్ 5: కుర్చీకోసం ప్రతిపక్షాలు ఆరాట పడుతున్నాయని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రజా సంక్షేమం, బంగారు తెలంగాణ దిశగా ఆరాటపడుతుందని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఈనెల 7న హుస్నాబాద్‌లో జరిగే సీఎం కేసీఆర్ నిర్వహించే బహిరంగ సభకు ముందస్తుగా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, రైతు సమన్వయ సమితి గ్రామ కమిటీ కన్వీనర్ దొనికెల రాజయ్య గౌడ్ మృతికి రెండు నిమిషాలు వౌనం పాటించారు. భారతదేశంలోనే తెలంగాణ కీర్తిప్రతిష్టను సీఎం కేసీఆర్ నిలబెట్టారని, ఎన్నికలకు ముందు హామీలివ్వని పథకాలను అమలు చేసి ప్రతి ఒక్కరికీ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథక సహాయం అందిందన్నారు. కాంగ్రెస్, ప్రతిపక్షాలు సీఎం కేసీఆర్ చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేకనే నిందలు వేస్తున్నారని, నాలుగు సంవత్సరాల మూడు నెలల కాలంలో చేసిన అభివృద్ధి ప్రజల ముందుందన్నారు. కరీంనగర్ జిల్లాలోనే హుస్నాబాద్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ చేపట్టే కార్యక్రమాన్ని కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. తెలంగాణకు కరీంనగర్ గుండెకాయని సీఎం కేసీఆర్ ప్రతీ సమావేశంలో గుర్తు చేస్తున్నారని, కరీంనగర్ సత్తాతో ప్రతిపక్షాలు బెంబేలు పెట్టాలన్నారు. పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ ముందుకెళ్లాలని కోరారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలని, పార్టీ ప్రతిష్టతతో పాటు ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసకొచ్చే దిశగా ముందుకెళ్లాలని సూచించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక కార్యకర్త బాధ్యతగా పనిచేస్తూ ప్రభుత్వాన్ని నిలబెట్టే దిశగా ముందుకెళ్లాలని జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ అన్నారు. తెలంగాణ టీఆర్‌ఎస్ నేతలకు ఉద్యమంతో పాటు ప్రభుత్వాన్ని నిలబెట్టే ధమ్ముందని తుల ఉమ అన్నారు.
అలాగే, పెర్కపల్లి మాజీ సర్పంచ్ భిక్షపతి నాయక్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు, వావిలాల ఖాదీబోర్డు డైరెక్టర్ పేరాల గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
రాజయ్య మృతి పార్టీకి తీరని లోటు
కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన కార్యక్రమానికి వెళ్లి ట్రాక్టర్ నుంచి కిందికి దిగుతూ ప్రమాదవశాత్తు కిందపడి తలకు తీవ్ర గాయమైన సోమారం మాజీ సర్పంచ్, టీఆర్‌ఎస్ సీనియర్ నేత దొనికెల రాజయ్య హైదరాబాద్ చికిత్స పొందుతూ మృతి చెందడం పార్టీకి తీరని లోటని మంత్రి ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాజయ్య అంత్యక్రియల్లో మంత్రి పాల్గొని నివాళులర్పించారు. రాజయ్య కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఓదార్చారు.