తెలంగాణ

పేద దళిత కుటుంబాలకు డైరీఫాంలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, సెప్టెంబర్ 5: నిరుపేద దళిత కుటుంబాలకు ఆర్ధిక చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై డైరీఫాంలను ఏర్పాటుచేయనుందని, ఇందుకు సూర్యాపేట నియోజకవర్గాన్ని ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం జరిగిందని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. జిల్లాకేంద్రంలో రూ.3.80కోట్ల వ్యయంతో నిర్మించే అంబేద్కర్ వికాస కేంద్రం నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రకటించారు. దళిత కుటుంబాలను ఆర్దికంగా బలోపేతం చేసే లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లోని దళితులకు రూ.4లక్షల విలువైన డైరీ ఫాంను మంజూరీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద ఎంపిక చేయబడిన కుటుంబాలకు నాలుగు గెదేలను అందిస్తామని, ఇందుకోసం యూనిట్ ధరను 4లక్షలుగా నిర్ణయించి అందులో రూ.2.40లక్షలను ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందని, మిగిలిన 1.60లక్షలను బ్యాంకుల ద్వారా రుణాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట నియోజకవర్గాన్ని ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని, ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా 1,578 కుటుంబాలను ఎంపిక చేసి వారికి 4లక్షల చొప్పున రూ.37.87కోట్ల నిథులను మంజూరీ చేసినట్లు ప్రకటించారు. ఇప్పటికే దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తుందని, ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేద దళిత కుటుంబాలకు ఆర్ధిక భరోసా కల్పించడం జరుగుతుందన్నారు. త్వరలోనే లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేస్తామని, ఈ పథకాన్ని సమర్ధవంతంగా అమలుచేసి ఆతర్వాత రాష్టవ్య్రాప్తంగా వర్తింపజేస్తామన్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, జిల్లా గ్రంథాలయసంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.