తెలంగాణ

అసమ్మతి నేతల తిరుగుబాటు?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 7: టీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితా ఖరారుతోనే ఆ పార్టీలో అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులు ముందస్తు వ్యూహానికి పదునుపెడుతూ ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నారు. మూడుసార్లు చెన్నూర్ నియోజకవర్గం నుండి కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలుపొంది ఈసారి టికెట్ రాక భంగపడ్డ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పార్టీ అధిష్ఠానం వైఖరిపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో తేల్చిచెప్పాలని అధిష్ఠానాన్ని ప్రశ్నించడంతో కేటీఆర్ శుక్రవారం ఓదెలును హైదరాబాద్‌కు పిలిపించుకొని బుజ్జగింపులతో ఓదార్చినట్లు తెలిసింది. ఇదే పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎంపి బాల్క సుమన్‌కు అసెంబ్లీ టికెట్‌ను సర్దుబాటు చేసేందుకే టికెట్ ఇవ్వలేకపోయామే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని సర్దిచెప్పారు. కేసీఆర్‌తో భేటీ అయ్యేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో రెండు రోజులు హైదరాబాద్‌లోనే ఉండాలని, అధినేతతో మాట్లాడి రాజకీయ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ లేదంటే కార్పోరేషన్ చైర్మెన్ కట్టబెట్టేందుకు కేటీఆర్ హామీ ఇచ్చినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ విషయమై ఓదెలును ప్రశ్నించగా తాను ప్రస్తుతం పార్టీ వీడే ప్రసక్తే లేదని, కార్యకర్తల అభిమతం మేరకే నడుచుకుంటానని ఆంధ్రభూమికి స్పష్టం చేశారు. కాగా సీనియర్ ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి సేవలందించిన ఓదెలుకు టికెట్ రాకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం మందమర్రి పట్టణంలో స్వచ్ఛందంగా బంద్ పాటించారు. స్థానిక అభ్యర్థిని కాదని బాల్క సుమన్‌కు అధిష్ఠానం టికెట్ ఖరారు చేయడాన్ని నిరసిస్తూ ఓదెలు అనుచరులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. జైపూర్ మండల కేంద్రంలో ఇద్దరు టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఓదెలుకు టికెట్ నిరాకరణపై నిరసిస్తూ టవరెక్కి రెండు గంటల పాటు అందోళన చేశారు.
ఖానాపూర్ బరిలో రాథోడ్ రమేష్ రె‘్ఢ’
ఖానాపూర్ అసెంబ్లీ స్థానాన్ని ఆశించి ఏడాది కిందట కేసీఆర్ సమక్షంలో గులాబి కండువా కప్పుకున్న మాజీ ఎంపి రాథోడ్ రమేష్ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సీట్లకు ఫ్యామిలీ ప్యాకేజీ ఒప్పందం కుదుర్చుకొని తనకు తీరని ద్రోహం చేశారని రమేష్ రాథోడ్ తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తన అనుచరులు, కార్యకర్తలు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని, శనివారం ఉట్నూరులో నిర్వహించే రాజకీయ భవిష్యత్తు సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటానని, పోటీకి మాత్రం సిద్ధమేనని రమేష్ రాథోడ్ ఆంధ్రభూమికి వివరించారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ టికెట్ దక్కని ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేష్ అధిష్ఠాన వైఖరిపై గుర్రుగా ఉన్నారు. టీఆర్‌ఎస్ టికెట్ల ఖరారు నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న క్రమంలోనే ఆ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతుండడం చర్చనీయాంశంగా మారింది.