తెలంగాణ

నమ్మించి మోసగించడంలో కేసీఆర్‌కు సాటిలేరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 8: నమ్మించి మోసగించడంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మించిన నాయకుడు మరొకరు లేరని మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకుడిగా నీ సేవలు అవసరమంటూ పార్టీలో చేర్చుకొని ఖానాపూర్ టికెట్ ఇస్తానని నమ్మబలికి తీరని ద్రోహం చేశారని విమర్శించారు. ఖానాపూర్ అసెంబ్లీ స్థానాన్ని తిరిగి రేఖానాయక్‌కు ఖరారు చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఖానాపూర్ నియోజకవర్గంతో పాటు ఉట్నూరు ఏజెన్సీ నుండి వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు ఉట్నూరుకు తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. ఈ సభలో ఉద్వేగంతో ప్రసంగించిన రమేష్ రాథోడ్ ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ, లంబాడాల మధ్య రాజకీయ లబ్ధి కోసం చిచ్చుపెట్టి పబ్బం గడుపుకున్నారన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంతో పాటు మిగితా నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్దేశించే సత్తా తనకు ఉందని, ఇతర పార్టీల నేతలు కూడా తనను సంప్రదిస్తున్నా తాను మాత్రం ప్రజాభిష్టం మేరకే నడుచుకుంటానని, రెండు రోజుల్లో రాజకీయ భవితవ్యంపై కీలక ప్రకటన చేస్తానని స్పష్టం చేశారు. ఏజెన్సీలో సాగు భూములకు పట్టాలు ఇప్పించిన ఘనత తనదేనని, నాలుగేళ్ళలో ఏజెన్సీ పల్లెలు ఏమాత్రం అభివృద్ది చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో నిలిచి తన సత్తా చాటుకుంటానని పునరుద్ఘటించారు. కాగా వచ్చే బుధవారం టీఆర్‌ఎస్ పార్టీకి సామూహికంగా రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.