తెలంగాణ

వీఆర్వో రిక్రూట్‌మెంట్‌కు భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: వీఆర్వోల రాత పరీక్షను ఈ నెల 16వ తేదీన నిర్వహిస్తున్నామని, అందుకోసం భారీ ఏర్పాట్లు చేశామని టీఎస్‌పిఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. 700 పోస్టులకు 10,58,868 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేశారని అన్నారు. ఇంత వరకూ 7.80 లక్షల మంది తమ హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని అన్నారు. 16వ తేదీ ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందని, మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకూ జరుగుతుందని చెప్పారు. ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ఇతర విలువైన సమాగ్రీని పరీక్ష హాలులోకి అనుమతించబోమని అన్నారు. ఉదయం 10.45 గంటలకే పరీక్ష కేంద్రాలకు అభ్యర్ధులు చేరుకోవాలని, వీలైతే ముందు రోజే వారు పరీక్ష కేంద్రాలను చూసుకోవాలని అన్నారు. అభ్యర్ధుల సందేహాలను నివృత్తి చేసేందుకు జిల్లాకో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2945 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు.
ఉపాధ్యాయుల పదోన్నతులకు షెడ్యూలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఉమ్మడి సర్వీసు నిబంధనలపై రాష్ట్ర హైకోర్టు తీర్పు నేపథ్యంలో యాజమాన్యాల వారీ పదోన్నతుల షెడ్యూలు ప్రకటించి ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయాలని పోరాటకమిటీ నేతలు చావా రవి, బి కొండల్‌రెడ్డి, ఎం రఘుశంకర్ రెడ్డి, టి లింగారెడ్డి, కొమ్ము రమేష్, ఎస్ హరికిషన్, కే మహిపాల్‌రెడ్డి, మసూద్ అహ్మద్, శాగ కైలాసం తదితరులు కోరారు. మే 16న ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఇచ్చిన హామీలపై ఉత్తర్వులు ఇవ్వకుండానే అసెంబ్లీని రద్దు చేయడం సరైన నిర్ణయం కాదని వారు పేర్కొన్నారు.