తెలంగాణ

ఉద్యోగుల వ్యతిరేకత తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయకుండానే ఎన్నికలకు వెళ్తున్న టీఆర్‌ఎస్‌కు ఉద్యోగుల వ్యతిరేకత తప్పదని తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ హెచ్చరించారు. ఉద్యోగుల పక్షపాతి అని చెప్పుకునే ప్రభుత్వం అదే ఉద్యోగుల వృద్ధాప్యంలో ఆదుకునే పాత పెన్షన్ విధానం అమలు పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించిందని ఆయన విమర్శించారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చే పార్టీలకు ఉద్యోగుల కుటుంబాలు ఓట్లు వేస్తారన్నారు. సీపీఎస్ రద్దు ఉద్యమం శాసనసభ రద్దుతోనో, ఎన్నికలతోతో ఆగేది కాదన్నారు. సీపీఎస్ రద్దుపై పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని, ఎన్నికల మేనిఫెస్టోలో పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని హామీ ఇవ్వాలని స్థితప్రజ్ఞ డిమాండ్ చేసారు. సీపీఎస్‌పై రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని కోరుతూ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతలు బుధవారం వివిధ రాజకీయ పక్షాల నేతలను కలిసి వినతి పత్రం సమర్పించినట్టు స్థితప్రజ్ఞ తెలిపారు. సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వనున్నట్టు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ హామీ ఇచ్చారని తెలిపారు. టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కేశవరావును కలువగా, ఈ అంశాన్ని అధ్యయనం చేయడానికి కమిటీ వేయాలని పార్టీకి సిఫారసు చేస్తానని చెప్పారన్నారు. సీపీఎస్ రద్దు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదని వాదించే వారితో బహిరంగ చర్చకు సిద్ధమని స్థితప్రజ్ఞ సవాల్ విసిరారు. ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్‌పై చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని రాజ్యాంగంలో ఉందని గుర్తు చేసారు. సీపీఎస్ రద్దుకు రాజకీయ నిర్ణయం జరగాలని కోరుతూ ఈ నెల 16న ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసామన్నారు. దీనికి ప్రాంతీయ, జాతీయ పార్టీల తరఫున ప్రతినిధులు హాజరవుతారన్నారు.