తెలంగాణ

60కి చేరిన కొండగట్టు మృతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల/మల్యాల, సెప్టెంబర్ 12: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్ బోల్తాపడి సంఘటనలో 57మంది దుర్మరణం చెందిన సంఘటన తెలంగాణ రాష్ట్రానే్న కుదిపేయగా బుధవారం మరో ముగ్గురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 60కి చేరింది. ఇప్పటికే ఈ ప్రమాదంలో 57 మంది మృతి చెందగా భూపాల్‌పల్లికి చెందిన పసులేటి లక్ష్మి (55),పెద్దపల్లి జిల్లా రాఘాపూర్‌కు చెందిన చీకుర్ల రజిత (40), సిరిసిల్ల జిల్లాకు చెందిన సుమలత బుధవారం మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో 41మందిలో మరి కొందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు బాధితుల బంధువులు తెలిపారు. కాగా, ఘటన స్థలిని సందర్శించి,మృతుల కుటుంబాలను పరామర్శించిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హన్మంతరావు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానందస్వామి, బీజేపీ నాయకులు బండి సంజయ్‌లతోపాటు తదితరులు ఇంత పెద్ద సంఘటన జరిగి 60మంది దుర్మరణం పాలైనా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సంఘటన స్థలాన్ని సందర్శించి మృతుల కుటుంబాలను ఓదార్చి భరోసా కల్పించేందుకు రాకపోవడం పట్ల ప్రతి పక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. భారత ప్రధాని నరేంద్రమోడీ, రాష్టప్రతి రాంనాథ్‌కోవింద్, తెలంగాణ, మహారాష్ట్ర గవర్నర్లు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా స్పందించిన సంతాపం ప్రకటిస్తే రాష్ట్రాన్ని ఏలుతున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానే్న కుదిపేసిన విషాదకరమైన సంఘటన స్థలానికి రాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరికృష్ణ మృతికి ప్రభుత్వ లాంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు అధికారంలోకి రావడానికి అండగా నిలిచిన వారు ప్రమాదానికి గురైనా పట్టించుకునే క్షణం తీరికలేని తీరుపై మండిపడుతుండడం గమనార్హం.