తెలంగాణ

ప్రజలకు భయపడే ‘ముందస్తు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లాదుర్గం, సెప్టెంబర్ 20: తెలంగాణ ప్రజలకు భయపడే ముందస్తు ఎన్నికలు తెచ్చారని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం మండల కేంద్రమైన అల్లాదుర్గంలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో అల్లాదుర్గం జడ్పీటీసీ మమత బ్రహ్మం కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ తన కొడుకును ముఖ్యమంత్రి చేసేందుకే తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. కుటుంబంపై ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజలపై లేదన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందకున్నా కుటుంబాన్ని అభివృద్ది చేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ దొరలను తరిమికొట్టి కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం అని గద్దెనెక్కిన కేసీఆర్ అధికారంలోకి రాగానే తన కుటుంభానికే నాలుగు ఉద్యోగాలు ఇచ్చుకున్నారన్నారు. నిరుద్యోగుల కల సాకారం కాలేదని తెరాస ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆనాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంతమవుతుందన్నా లెక్క చేయకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ విడిపోయే సమయానికి 60 వేల కోట్ల అప్పు ఉండేదని నేడు తెరాస పాలనలో రెండు లక్షల 35 వేల కోట్లు అప్పుగా మిగిల్చి ప్రజలపై భారం పెట్టిందన్నారు. తెరాస పార్టీ అధికారంలోకి వచ్చి డబుల్ బెడ్‌రూమ్‌లు ఇస్తామని, దళితులకు మూడు ఎకరాల భూమి, అల్లాదుర్గం ప్రజలకు భూమి, డబుల్ బెడ్‌రూమ్‌లు ఎక్కడైనా ఇచ్చరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయంలో ప్రతి గ్రామంల్లో ఇండ్లు మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వ భూమిని పేదలకు పంచిపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. 58 సంవత్సరాలు ఉంటేనే వృద్దులకు పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. గత కాంగ్రెస్, యూపీఎ సర్కార్ హయంలో వృద్దాప్య పింఛన్లు 60 సంవత్సరాలు ఉన్నవారికి ఇవ్వడం జరిగిందని, రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. తెరాస ప్రభుత్వం 65 సంవత్సరాలు ఉన్నవారికి పింఛన్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అన్నారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు లక్ష రుపాయల రుణమాఫీ చేయడం జరిగిందని, నేడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని తెలిపారు. నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మోగా డీఎస్సీ ప్రకటించి అమలు చేసే సత్తా తమ పార్టీకి ఉందన్నారు. కేసీఆర్ అందోల్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు సిద్దిపేటలాగా అందోల్‌ను అభివృద్ధి చేస్తానని మాట తప్పారన్నారు. సింగూర్ జలాలను తరలించుకుపోయినా నియోజకవర్గంలోని నాయకులు దానిపై మాట్లాడలేదన్నారు. డిగ్రీ విద్యార్థులకు మూడు వేల నిరుద్యోగ భృతి ఇవ్వనుందన్నారు. అందోల్ నియోజకవర్గం తనకు అన్నం పెట్టిందని, ఈ ప్రాంతానికి సింగూర్ నీరు తీసుకువచ్చి రైతులకు అందిస్తానన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. గడిపెద్దాపూర్ నుండి అల్లాదుర్గం వరకు వేల మందితో సైకిళు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి పద్మిని దామోదర్ పాల్గొన్నారు.