తెలంగాణ

ప్రజా మేనిఫెస్టో రూపకల్పన చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 20: ప్రజల కోరిక మేరకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన చేస్తామని టీ.కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ వైస్ చైర్మన్, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను రాహుల్‌గాంధీ మేనిఫెస్టో కమిటీ వైస్ చైర్మన్‌గా, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా నియమించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, మహిళా సంఘాలతో సమాజంలోని వివిధ వర్గాల ప్రజలతో భేటీలు నిర్వహించి వారు కోరిన వాటిని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి ప్రజా మేనిఫెస్టో రూపొందిస్తామన్నారు. కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాల అమలును తప్పలేదన్నారు. అందుకు విరుద్ధంగా సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో వంద హామీలిచ్చి 99హామీలను విస్మరించి ప్రజలనుమోసం చేసిందన్నారు. మొదటి హామీ దళిత సీఎం నుండి డబుల్ బెడ్‌రూమ్‌లు, దళితులకు మూడెకరాల భూమి, ఎస్టీ, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు మొదలుకుని ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. నల్లగొండ జిల్లా నుండే కేసీఆర్ ప్రభుత్వ పతనం మొదలవుతుందని ఈ జిల్లాని పనె్నండు సీట్లతో పాటు రాష్ట్రంలో 60నుండి 70స్థానాల వరకు కాంగ్రెస్ సింగిల్‌గా గెలుస్తుందన్నారు. గెలిచే స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందన్నారు. మిత్రపక్షాలు బలంగా ఉన్న చోట మహాకూటమిలో భాగంగా సీట్లు కేటాయిస్తారన్నారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటమి ఖాయమని, స్వయం పరిపాలన, ఆత్మగౌరవ పరిరక్షణకు, నీళ్లు, నిధులు, ఉద్యోగాల నినాదాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు దక్కని నిరుద్యోగులు టీఆర్‌ఎస్‌ను ఓడిస్తారన్నారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం కమిషన్లు దండుకుని కొత్తగా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికే పరిమితమైందన్నారు. గొర్రెలు, చేపలు, బర్రెల, పండుగ పబ్బాల కోసం బట్టలు, బిర్యానీల కోసం తెలంగాణ యువత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోట్లాడలేదని, ఆత్మగౌరవంతో స్వయం పాలనలో మన ఉద్యోగాలు మనకొస్తాయన్న ఆశతో పోరాటం చేశారన్నారు. వచ్చిన తెలంగాణలో నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం రాకపోగా కేసీఆర్ కుటుంబంలో ఐదుగురికి మాత్రం పదవులొచ్చాయన్నారు. తాను గతంలో పీసీసీ అధ్యక్ష పదవి కోరుకున్నానని, పార్టీ అధిష్టానం పార్టీ మేనిఫెస్టో కమిటీ పదవి ఇచ్చారని, అయినా పార్టీ గెలుపు కోసం పనిచేస్తానన్నారు. ఎన్నికల పిదప వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక భూమిక వహిస్తానన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనూ ఎమ్మెల్యేగా జిల్లాకు 2వేల కోట్ల ఎస్‌ఎల్‌బీసీ, ఉదయ సముద్రంతో పాటు వందల కోట్ల అభివృద్ధి పనులు జరిపించానన్నారు. ముందస్తు ఎన్నికలతో తప్పు చేసిన కేసీఆర్ కబ్జాకోరులు, హత్యారాజకీయాలు, దౌర్జన్యాలు సాగించే వారికి టికెట్లు ఇచ్చి టీఆర్‌ఎస్ ఓటమిని ఖాయం చేశారన్నారు. ముందస్తు ఎన్నికల్లో అప్రజాస్వామిక, నియంతృత్వ కేసీఆర్ ప్రభుత్వానికి ఓటమి తథ్యమన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి తదితరులు ఉన్నారు.