తెలంగాణ

వృత్తుల శిక్షణకు ముందుకొచ్చిన నాస్కామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: సంప్రదాయంగా వస్తున్న ఐటీ వృత్తులు కనుమరుగవుతున్నాయి. కంపెనీలు అభివృద్ధిని సాధించడం కోసం ఏఐ, ఇతర లోతైన సాంకేతికతల వైపు చూస్తున్నాయి.
ఐడీసీ నివేదిక ప్రకారం 2021 నాటికి దాదాపు 75 శాతం ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ కృత్రిమ మేధనే ఉపయోగించనున్నాయి. ఐటీ నిపుణులలో కేవలం ఒక్క శాతం మంది మాత్రమే ఏఐలో ప్రస్తుతం నైపుణ్యం కలిగి ఉన్నట్లు అర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పరిశోధనా కేంద్రమైన టాలెంట్ స్ప్రింట్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో టాలెంట్ స్ప్రింట్ సహకారంతో ఐఐఐటీ (హైదరాబాద్) అందిస్తున్న ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌లో శిక్షణ కోసం బెంగలూరులోని నాస్కామ్ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. ఐఐఐటి, టాలెంట్ స్ప్రింట్ అందిస్తున్న ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ను మొదటి 8 నెలల్లోనే వెయ్యి మందికి పైగా ఐటీ నిపుణులు శిక్షణ పూర్తి చేసినట్లు వివరించింది. నాస్కామ్ సీఈవో-డీఎస్‌ఏఐ, సీఈవో సంజీవ్ మల్హోత్ర, ఐఐఐటీ (హైదరాబాద్)కు చెందిన ప్రొఫెసర్ రమేశ్ లోగనాథమ్, టాలెంట్ స్ప్రింట్ ఎండీ, సీఈవో శంతన్ పాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘మ్యూబ్లా’ను ప్రారంభించిన శిల్పారెడ్డి
అద్భుతమైన డిజైన్‌లతో, అన్నిరకాల శ్రేణులకు చెందిన గృహాలంకరణలకు సాటిలేని ఫర్నిచర్ భాండాగారంగా బంజారాహిల్స్ రోడ్డు నెం.12లో ఏర్పాటు చేసిన ‘మ్యూబ్లా’ను ప్రముఖ మోడల్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. సురానా గ్రూపు కంపెనీల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినీత సురానా, బిఎన్‌ఐ (హైదరాబాద్) ఇడి సంజనా షా, మ్యూబ్లా అధిపతులు ఆదిత్య శర్ధ, శిరీష్ దయత, శృతి మశ్రూ పాల్గొన్నారు.