తెలంగాణ

రాజీ అన్నదే ఎరుగని కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతిగా ఉన్న కే చంద్రశేఖరరావు (కేసీఆర్) అనుకున్నదాన్ని సాధించడంతో ఏనాడూ రాజీపడలేదు. పదవులకు రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపనకు పలువురితో కలిసి శ్రీకారం చుట్టిన నాటి నుంచి ఆయనది అదే ధోరణి. మూడు భాషల్లో అనర్ఘళంగా, అలవోక, సమయానుకూలంగా ప్రసంగించే మాటల మాంత్రికుడు. ఉద్యమ ప్రారంభంలో వెన్నుదన్నుగా ఉన్న ఎందరో ఆయనకు దూరమైనా పట్టించుకోని మొండి వైఖరి ఆయనది. ఉద్యమం ఊపిరిగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా, రాజకీయపరంగా ముందుకు వెళ్ళడానికి, ఎవరినైనా కలుపుకోవడానికి, ఎంతవారినైనా దూరం వెళ్లడానికి వెనకాడలేదు. ఉద్యమ కాలంలో ఎవరు రాదలుచుకున్నా, స్వాగతించి, అక్కున చేర్చుకుని, భాగస్వామ్యానికి సుముఖత వ్యక్తం చేసిన కేసిఆర్, ఎన్నికల విషయంలో, ఇతర విధాన నిర్ణాయక విషయాలలో నామమాత్రంగా చర్చలు, సంప్రదింపులు చేశారే తప్ప నిర్ణయాధికారం ఆసాంతం ఆయన సొంతమేనన్నది తెలంగాణ జనమెరిగిన సత్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములై, మంత్రి పదవులు చేపట్టడం సైతం ఎవరి ప్రమేయమూ లేని కేసిఆర్ సొంత నిర్ణయమే. సెంటిమెంట్‌ను ఓట్లుగా మలుచుకుని, సాధించిన శాసనసభ సీట్ల కన్నా, ఉప ఎన్నికలలో సీట్లు తగ్గినా, తాను స్వయంగా పోటీ స్థానాలు మార్చుకున్నా, విచారం వ్యక్తపరచడమో, అంతర్మథనం చేసుకోవడమో, తప్పిదాన్ని దిద్దుకుంటామనో కనీసం నమ్మకస్తులతోనైనా మాటవరుసకైనా వ్యక్తపరచలేదు. తమకు ఇష్టం లేకున్నా, టీం లీడర్‌కు ఇష్టం లేక పోయినా, జట్టులో చోటు లేదని దూరం కావడం తప్ప గత్యంతరం లేని స్థితి చాలామందికి తప్పింది కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనకై భావసారూప్యం కలిగిన ప్రొఫెసర్ కోదండరాం, ఆలె నరేంద్ర, సినీనటి విజయశాంతి, విజయ రామారావు, కపిలవాయి దిలీప్ కుమార్, కటుకం మృత్యుంజయం, సురభి భూంరావు...ఇలా ఒక్కరేమిటి, పార్టీ బాధ్యులే కాక, కవులు, కళాకారులు, వివిధ రూపాల ఉద్యమ సహాయకులు ఎవరు దూరమైనా, ఎంతమాత్రం కలత చెందిన దాఖలాలులేవు. ఎవర్నీ బుజ్జగించే ప్రయత్నాలూ చేయక మొండిగా వ్యవహరించడం ఆయనకే చెల్లింది. ఆయన వ్యవహార శైలితో రాజీ పడని వారిని పొమ్మనలేక పొగ పెట్టి వెళ్ళగొట్టిన సందర్భాలూ ఉన్నాయ. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన, కేసిఆర్‌ను, ఆయన కుటుంబాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించిన వారిని దరి చేర్చుకుని అందలం ఎక్కించిన ఘనత ఆయనదే. ఇక ఎన్నికలలో ఒకసారి తెలుగుదేశం, మరోసారి కాంగ్రెస్‌లతో జత కట్టడం, కావలసిన మెజార్టీ సాధించి స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నా, ఇతర పార్టీలను బలహీన పరిచేందుకు ఆయా పార్టీల గుర్తులతో, కారు గుర్తును ఓడించిన వారిని సైతం, చేరిన మరుక్షణమే ప్రభుత్వంలో చేర్చుకోవడం, ఆశించిన పదవులు ఇవ్వడం కేసిఆర్ ఏకపక్ష నిర్ణయాలేనన్నది కాదనలేని వాస్తవం. ముందస్తు ఎన్నికలకు శాసనసభ రద్దు గురించి, చాలామంది శాసనసభ్యులకు ఇష్టం లేకున్నా, అధినేత మనస్తత్వం తెలిసి మిన్నకుండాల్సి వచ్చింది.