తెలంగాణ

ఎంపీ, ఎమ్మెల్సీల ఘెరావ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 22: టీఆర్‌ఎస్ భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, స్థానిక భువనగిరి టీఆర్‌ఎస్ అభ్యర్ధి పైళ్ల శేఖర్‌రెడ్డిలకు శనివారం ప్రతిపక్షాలు అడ్డుకుని నిరసన తెలిపాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెంలో సీసీ రోడ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు వచ్చిన వారిని ప్రతిపక్షాల ఆధ్వర్యంలో గ్రామస్తులు అడ్డుకున్నారు. శివారెడ్డి గూడెం గ్రామం నుండి దంతూరు గ్రామానికి రోడ్డు నిర్మించాలని అర్హులైన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తు కాంగ్రెస్, బిజెపి, వామపక్షల నాయకులు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్, ప్రతిపక్ష నాయకుల మధ్య తోపులాట, వాగ్వివాదం చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీఆర్‌ఎస్ జడ్పీటీసి మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి స్థానిక గ్రామస్తుడు ఎరబోని శ్రీనివాస్‌పై చేయి చేసుకోవడంతో ఆగ్రహించిన ప్రతిపక్ష నాయకులు తిరుగబడటంతో ఇరువర్గాల మధ్య తోపులాట నెలకొంది.
అలాగే ఇతర ప్రాంతాల నుండి వచ్చిన టీఆర్‌ఎస్ నాయకులు సైతం స్థానిక ప్రతిపక్షా కార్యకర్తలపై దాడికి పూనుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టి ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రేవణ్‌పల్లి గ్రామంలో ఎంపి, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు వెళ్లగా అక్కడ కూడా ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు సుర్కంటి వెంకట్‌రెడ్డికి, టీఆర్‌ఎస్ నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీసులు బందోబస్తు మధ్య ఎంపి, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు తమ కార్యక్రమాలు కొనసాగించి తిరిగి వెళ్లారు. ఊహించని ఈ పరిణామాలతో అధికార టీఆర్‌ఎస్ పార్టీ నాయకుల ఖంగుతిన్నారు.