తెలంగాణ

నేడు కరీంనగర్ - ముంబయి రైలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 25: కరీంనగర్ నుంచి నిజామాబాద్ మీదుగా ముంబయికు వెళ్లే రైలు బుధవారం నుంచి అందుబాటులోకి రానుంది. కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తదితరులు మధ్యాహ్నం 2:45 నిమిషాలకు కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో ముంబయి రైలుకు పచ్చ జెండా ఊపనున్నారు. ఇందుకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా వెళ్లే లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలును వయా కరీంనగర్‌కు వారానికి ఒకరోజు నడుపాలని నిర్ణయించగా, ఈ రైలు ప్రతీ ఆదివారం ఒక ట్రిప్పు చొప్పున కరీంనగర్ నుంచి జగిత్యాల, నిజామాబాద్ మీదుగా ముంబాయి వరకు నడవనుంది. ఈ ముంబయి రైలు అందుబాటులో వస్తుండటంతో కరీంనగర్ నగరానికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించే అవకాశం ఉండగా, ఇక్కడి నుంచి ముంబాయి, బీవండికి నిత్యం వందల సంఖ్యలో రాకపోకలు సాగించే నేత కార్మికులు, ఇతర ఉపాధి అవకాశాల కోసం వెళ్లే వారికి, అక్కడ స్థిరపడిన వారికి ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.