తెలంగాణ

కంటి ఆపరేషన్లు వికటించినా పట్టించుకోని ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: రాష్ట్రంలో కంటి ఆపరేషన్లు వికటించినా ప్రభుత్వానికి పట్టింపు లేదని టీటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ్రు శోభారాణి విమర్శించారు. సీఎం మాత్రం తన కంటికి ఢిల్లీలో ఆపరేషన్ చేయించుకుంటారని, తెంలగాణ ప్రజలకేమో నాసిరకం ఆపరేషన్లు చేయించారని ఆమె విమర్శించారు. వరంగల్ జయ ఆస్పత్రిలో నాసిరకంగా కంటి ఆపరేషన్లు చేయడం వల్ల అది వికటించి కొంత మందికి చూపు పోయిందని, 18 మందికి కంటి చూపు వికటించినా, ఏ ఒక్క ప్రజాప్రతినిధి వారిని పరామర్శించకపోవడం బాధాకరమని అన్నారు. ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రభుత్వం సక్రమంగా ఆపరేషన్లను నిర్వహించడంలో మాత్రం విఫలమైందని పేర్కొన్నారు. 8 మందికి కళ్లు రావని ఎల్వీప్రసాద్ ఆస్పత్రి నిర్ధారించి వారిని గుట్టుచప్పుడు కాకుండా వరంగల్‌లో దించేశారని, ప్రభుత్వానికి ఏ మాత్రం మానవత్వం లేదని అన్నారు. దేవరకొండ , వేముల కొండలలో ట్రాక్టర్ బోల్తాపడి మృతి చెందినా, వరంగల్‌లో టపాసులు పేలి మరణించినా, కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది మృతి చెందినా , కంటి వెలుగు కార్యక్రమంలో 8 మంది చూపుకోల్పోయినా ఏ ఒక్క సందర్భంలోనూ కేసీఆర్ బాధితుల8ను పరామర్శించలేదని అన్నారు.