తెలంగాణ

ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తే గజ్వేల్ నుంచి పోటీ: గద్దర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, అక్టోబర్ 5: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తే ఇక్కడి నుండి బరిలో నిలువనున్నట్లు ప్రజాయుద్ధ నౌక గద్దర్ స్పష్టం చేశారు. శుక్రవారం గజ్వేల్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం బెజుగామలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గద్దర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని, అణగారిన వర్గాలు సంఘటితమై హక్కుల సాదన కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా బీసీలు, అభవృద్ధికి దూరంగా నిలిచిన ప్రజలు కోరుకుంటే తప్పనిసరిగా గజ్వేల్ నుంచి పోటీ చేసి కేసీఆర్‌కు సత్తా చూపుతామని తెలిపారు. సమానత్వం కోసం అంబేద్కర్ త్యాగ పురుషుడిగా నిలవగా, తెలంగాణాను భూస్వామ్య, ఆధిపత్య భావజాలం వైపు కేసీఆర్ నడిపిస్తున్నట్లు చెప్పారు. అన్ని కులాల సమానత్వం కోసం అంబేద్కర్ పోరాడగా, పాలకులు ఇచ్చిన హామీలు కేజీటూపీజీ విద్య రాలేదని, దళితులకు మూడెకరాల భూపంపిణీ జరగలేదని అన్నారు. ఓట్ల విప్లవం రావాలని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ మోసం చేయగా, 70 యేళ్ల తర్వాత ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. అంబేద్కర్ అందరివాడని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, ఉద్యోగాల సాధనలో యువత ఆశలు నిర్వీర్యమైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు.