తెలంగాణ

మెదక్ జడ్పీని కుదిపేసిన సింగూర్ జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, అక్టోబర్ 5: దిగువన ఉన్న ప్రాజెక్టులు, ఆయకట్టు పరిరక్షణ కోసం సింగూర్ నుంచి వదిలిన నీరు అధికార టీఆర్‌ఎస్ పార్టీకి గుదిబండలా మారుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్తు సర్వసభ్య సాదారణ సమావేశాన్ని సైతం సింగూర్ నీటి విడుదల కుదిపేసిందంటే నీటి కటకట తీవ్రత ఏమిటో స్పష్టమవుతోంది. శుక్రవారం జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ రాజమణి మురళీధర్ యాదవ్ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో కాంగ్రెస్, టీడీపీ సభ్యులు గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. ఎవరిని అడిగి సింగూర్ నీటిని అక్రమంగా తరలించారంటూ కాంగ్రెస్ సభ్యులు ప్రభాకర్‌గౌడ్, శ్రీనివాస్, సంజీవ్‌రెడ్డి, అంజయ్య, సునితా పాటిల్, టీడీపీ సభ్యుడు శ్రీకాంత్‌గౌడ్‌లు ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగారు. సమావేశం వేదికముందుకు వచ్చి బైఠాయించి నిరసన తెలిపారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా స్పందించిన చైర్ పర్సన్ రాజమణి ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేసారు. ప్రభుత్వానికి అన్ని ప్రాంతాలు సమానమేనని, ఎక్కడకు నీరు అవసరం ఉంటే అక్కడికి తరలిస్తారని సమాధానం చెప్పడంతో సభ్యులు మండిపడ్డారు. ఈ ప్రాంత రైతులు సాగు, త్రాగునీరు కోసం ఇబ్బందులు పడుతుంటే దిగువకు తరలించడం ఏమిటని నిలదీసారు. ప్రతిపక్ష సభ్యులు మూకుమ్మడిగా ప్రశ్నల వర్షం కురిపించడంతో చైర్ పర్సన్ ఉక్కిరిబిక్కిరయ్యారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతకాకపోతే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుండగా ఆత్మరక్షణలో పడిన చైర్ పర్సన్ తన కుర్చీలో నుండి లేచి చాంబర్‌కు వెళ్లిపోయారు. ప్రతిపక్ష సభ్యులు గలాట సృష్టిస్తుంటే వారిని ఎదుర్కొనేందుకు అధికార పార్టీ సభ్యులు లేకపోవడం కూడా కొట్టొచ్చింది. జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశానికి హాజరై సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఉన్న మూడు జిల్లాల కలెక్టర్లు రాకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికార పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు కూడా మొహం చాటేయడం ఏమిటని ప్రశ్నించారు. సింగూర్ నీటి విడుదలపై సభలో ప్రశ్నిస్తారన్న భయంతోనే ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరు కాలేదని, వారి వద్ద సమాధానం లేదని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. సీఎం ఎన్నికల ప్రచారానికి వెళుతున్నాడని, నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతోనే రాత్రికి రాత్రిని సింగూర్ నుండి నీటిని వదిలిపెట్టారని ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని టీఆర్‌ఎస్ పార్టీ ఓట్ల రాజకీయానికి పాల్పడుతుందని ఆరోపించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదని, సింగూర్ ప్రాజెక్టుపై అధర్మ ముఖ్యమంత్రిగా మారాడని ప్రతిపక్ష సభ్యులు దుయ్యబట్టారు. ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని పూర్తిగా రద్దు చేసి రాష్టప్రతి పాలన విధించాలని డిమాండ్ చేసారు. సమావేశంలో ప్రతిపక్ష సభ్యుల నిరసన కొనసాగుతుండగానే అధికారులు కూడా ఒక్కొక్కరుగా వెళ్లిపోవడంతో అధికారుల తీరును సభ్యులు తప్పుపట్టారు.