తెలంగాణ

మహాకూటమి జయకేతనం తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండూర్, అక్టోబర్ 5: వచ్చే ఎన్నికల్లో మహాకూటమి అత్యధిక స్థానాలు గెలిచి తెలంగాణ అసెంబ్లీపై మహాకూటమి జెండా ఎగురేస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా చండూర్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన దివంగత ఎన్‌టీఆర్ విగ్రహావిష్కరణ చేసిన అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలు ఐదేళ్ల కాలానికి అధికారమిస్తే రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి తొమ్మిది నెలల ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్నారు. అసెంబ్లీ రద్ధుకు కేసీఆర్ నేటికి సరైన కారణాలు చెప్పడం లేదన్నారు. మిగులు రాష్ట్రం తెలంగాణను నాలుగేళ్లలో లక్షన్నర కోట్ల అప్పుల పాలు చేశాడన్నారు. ప్రాజెక్టుల పేరుతో, మిషన్ భగిరథ పేరుతో వేల కోట్ల కమీషన్లు దండుకున్నారన్నారు. రాజకీయంగా ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఎదుర్కోలేక అధికార దుర్వినియోగంతో అక్రమ దాడులు, కేసులకు కేసీఆర్ ప్రభుత్వం పాల్పడుతుందన్నారు. కేసీఆర్ నల్లగొండ సభలో చేసిన ప్రసంగం చూస్తే ఆయనకు ఓటమి భయం పట్టుకున్నట్లుగా తేలిపోయిందన్నారు. రాష్ట్రంలో గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అముల చేయకుండా అన్నివర్గాల ప్రజలనుమోసం చేశారన్నారు. సూర్యచంద్రులున్నంత వరకు ప్రజల గుండెల్లో ఎన్‌టిఆర్ ఉంటారన్నారు. టీడీపీ కార్యకర్తలను చూస్తే కేసీఆర్ ఒంట్లో వణుకు పుడుతుందని, చంద్రబాబును విమర్శించకపోతే రాజకీయంగా తెలంగాణలో కేసీఆర్‌కు పబ్బం గడువడం లేదన్నారు. తెలుగు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకు కూటమిపై, చంద్రబాబుపై లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. నాలుగేళ పాలనలో చేసింది చెప్పుకోలేక మహాకూటమి పొత్తులపై అవాకులు చేవాకులు పేలుతున్నాడన్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధపడి రైతుబంధు చెక్కులు, బతుకమ్మ చీరలను సిద్ధం చేసి ఎన్నికల కోడ్‌తో తప్పించుకునే ప్రయత్నం చేసిన కేసీఆర్ ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటే నిందలను ప్రతిపక్షాలపై మోపుతున్నాడన్నారు. జిల్లాకు సాగుతాగునీరు అందిస్తున్న ఏఏమ్మార్పీ, డిండి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలేదన్నారు. గతంలో ఏఏమ్మార్పీ ఎత్తిపోతల ద్వారా జిల్లాకు టీడీపీ తాగునీరు సాగునీరు అందించిందన్నారు. మహాకూటమిలా భాగంగా సీట్లు, టికెట్లు ఎవరికి వచ్చినా సరే ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలన్నారు. కూటమి అధికారంలోకి వస్తే గట్టుప్పల్ మండలాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాల్వాయి రజనికుమారి తదితరులు పాల్గొన్నారు.