తెలంగాణ

కాంగ్రెస్ ఆశావహుల్లో ఎడతెగని ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 7: ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టిని కేంద్రీకరించడం అనివార్యంగా మారింది. ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్టీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సిట్టింగ్‌లకే టిక్కెట్లను ఖరారు చేయగా, కాంగ్రెస్ పార్టీలో మాత్రం అభ్యర్థిత్వాల విషయంలో ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మూడు స్థానాలు మినహా, మరో ఆరు చోట్ల స్పష్టత రావాల్సి ఉంది. ఆ మూడు స్థానాల విషయంలోనూ అధికారికంగా ఇంకనూ ప్రకటన వెలువడనప్పటికీ, ఎలాగూ తమకే టిక్కెట్లు ఖరారవుతాయనే ధీమాతో ఆశావహులు ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. బోధన్‌లో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ఆర్మూర్‌లో ఎమ్మెల్సీ ఆకుల లలిత, కామారెడ్డిలో మండలి విపక్ష నేత మహ్మద్ షబ్బీర్‌అలీలు ఇప్పటికే ప్రచార పర్వంలో నిమగ్నమయ్యారు. మిగతా సెగ్మెంట్లలో మాత్రం అభ్యర్థిత్వాల కోసం పోటీ నెలకొని ఉండడంతో ఎవరికివారు తమవంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వీరిలో ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయి, ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపిస్తుందన్నది ఇంకనూ ఇతమిద్ధంగా తేలడం లేదు. ఈసారి కాంగ్రెస్ కూటమితో జతకట్టడం ఆ పార్టీ ఆశావహులను మరింత ఉత్కంఠతకు లోనుచేస్తోంది. కూటమిలో భాగస్వామ్యం అవుతున్న తెలుగుదేశం పార్టీకి బాల్కొండ సెగ్మెంట్ కేటాయించాలని కాంగ్రెస్ నాయకత్వం తలపోస్తుండగా, ఇక్కడి నుండి ఇదివరకు ప్రాతినిథ్యం వహించిన ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్ ఎన్నికల బరిలో దిగేందుకు ప్రచార రథాన్ని సైతం సిద్ధం చేసుకుని ఆతృతతో అభ్యర్థిత్వం కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ బాల్కొండతో పాటు మరో స్థానాన్ని సైతం ఆశిస్తోందని తెలుస్తోంది. నిజామాబాద్ రూరల్, బాన్సువాడ, బోధన్ సెగ్మెంట్‌లలో ఏదైనా స్థానాన్ని కేటాయించాలని తెలుగు తమ్ముళ్లు అభిలషిస్తున్నారు. అంతేకాకుండా కూటమిలోని మరో మిత్రపక్షంగా ఉన్న కోదండరాం నేతృత్వంలో టీజేఎస్ కూడా నిజామాబాద్ అర్బన్, రూరల్ స్థానాలను కోరుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమకు అభ్యర్థిత్వాలు దక్కుతాయో లేదోనని కాంగ్రెస్ ఆశావహులు ఒకింత హైరానా పడుతున్నారు. నిజామాబాద్ అర్బన్ నుండి మహేష్‌కుమార్‌గౌడ్, రత్నాకర్, తాహెర్‌బిన్ హందాన్, కేశవేణులు టిక్కెట్ రేసులో పోటీ పడుతుండగా, ఈ నెల 11వ తేదీన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న డీఎస్ కూడా తన అనుయాయులను అధిష్టానానికి టిక్కెట్ కోసం సిఫార్సు చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్‌లో టిక్కెట్‌ను ఆశిస్తూ మాజీ ఎమ్మెల్సీ అర్కల నర్సారెడ్డి కాంగ్రెస్‌లో చేరగా, టీ.పీసీసి కార్యదర్శి సందంగిరి భూంరెడ్డి కూడా ఇక్కడి నుండి అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెరాస అసమ్మతి నేతగా ముద్రపడిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరడంతో రూరల్ టిక్కెట్ దాదాపుగా ఆయనకు ఖరారైనట్టు చెబుతున్నారు. అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యేలు సౌదాగర్ గంగారాం, అరుణతాలు, బాన్సువాడ నుండి కాసుల బాల్‌రాజ్, మల్యాద్రిరెడ్డి, ఎల్లారెడ్డి నుండి నల్లమడుగు సురేందర్, జమునా రాథోడ్, వడ్డెపల్లి సుభాష్‌రెడ్డిలు పోటీ పడుతుండగా, తాజాగా షబ్బీర్‌అలీ ప్రోద్బలంతో ఇక్కడి నుండి బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మదన్‌మోహన్‌రావు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరికి అవకాశం కల్పిస్తుంది, ఎవరికి మొండిచేయి చూపుతుందనే దానిపై పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ కొనసాగుతోంది.