తెలంగాణ

చరిత్రను ఇముడ్చుకుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల భూమి......
==============

సంగారెడ్డి, అక్టోబర్ 13: ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహించిన గజ్వేల్ నియోజకవర్గానికి నాటి నుంచి నేటి వరకు ఘనమైన చరిత్రను ఇముడ్చుకుంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ చాలాకాలంగా కొనసాగుతుంది. ఆ సెంటిమెంటునే గులాబీ దళపతి అస్త్రంగా చేసుకుని ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందగా టీఆర్‌ఎస్ పార్టీ జాక్‌పాట్ కొట్టి అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంతటి ఘన చరిత్ర సంతరించుకున్న గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయంగా ఎంతో మంది ఉద్దండులు రాటుదేలారు. అలాంటి నియోజకవర్గం పూర్తి వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం. 1957లో ఈ నియోజకవర్గం విస్తరించింది. 2014 సార్వత్రిక ఎన్నికల వరకు ఈ నియోజకవర్గంలో 14 సార్లు ఎన్నికలొచ్చాయి. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ 8 పర్యాయాలు గెలుపొంది తన ఆథిపత్యాన్ని చాటుకుంది. టీడీపీ ఆవిర్భావం తరువాత ఈ నియోజకవర్గంలో మూడు సార్లు ఓటర్లు ఆ పార్టీకి పట్టం కట్టారు. గీతారెడ్డి, విజయరామారావులు అత్యధిక మెజార్టీతో గెలుపొందగా మిగిలిన అభ్యర్థులు ఉత్కంఠ పోరులో స్వల్ప మెజార్టీతో గెలుపొందినట్లు రికార్డులు చెబుతున్నాయి. 1957లో సాధారణ నియోజకవర్గంగా ఉండగా 1962లో ఎస్సీ రిజర్వ్‌గా మారింది. 1957లో కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాలరావ్‌కు 24450 ఓట్లురాగా స్వతంత్ర అభ్యర్థి ఆర్.నర్సింహారెడ్డికి 22168 ఓట్లు వచ్చాయి. 2282 ఓట్ల ఆధిక్యంతో ముత్యాలరావ్ మొదటి విజయాన్ని కాంగ్రెస్‌కు అందించారు. 1962లో కాంగ్రెస్ పార్టీ జీ.వెంకటస్వామిని పోటీకి దింపగా జీ.సైదయ్య స్వతంత్రంగా బరిలోకి దిగారు. సైదయ్యకు 11653 ఓట్లురాగా వెంకటస్వామికి 10618 ఓట్లు రావడంతో 1035 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1967 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సైదయ్యను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపగా జెహెచ్.క్రిష్ణమూర్తి ఇండిపెండెంట్‌గా పోటీ చేసారు. సైదయ్యకు 21762 ఓట్లురాగా క్రిష్ణమూర్తికి 16324 ఓట్లు వచ్చాయి. సైదయ్య 5438 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సైదయ్యపై అల్లం సాయిలు స్వతంత్రంగా పోటీ చేసారు. 4923 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సైదయ్య హ్యాట్రిక్ సాధించారు. 1978లో ఇందిర కాంగ్రెస్ పక్షాన పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే సైదయ్యపై జనతా పార్టీ అభ్యర్థిగా అల్లం సాయిలు రెండవ సారి పోటీకి దిగారు. అల్లం సాయిలును సైదయ్య 8731 ఓట్ల తేడాతో ఓడించారు. 1983 ఎన్నికల్లో సైదయ్యను ఓడించడమే లక్ష్యంగా మూడవ సారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన అల్లం సాయిలు 3961 ఓట్ల మెజార్టీతో సాయిలు గెలుపొందారు. 1985 శాసన సభ మద్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి బీ.సంజీవరావు 7382 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1989 ఎన్నికల్లో మొదటి సారి రాజకీయ అరంగ్రేటం చేసిన డాక్టర్ గీతారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సంజీవరావును ఎదుర్కొనేందుకు బరిలోకి దిగారు. గీతారెడ్డి 2358 ఓట్ల ఆధిక్యంతో గీతారెడ్డి గెలుపొందారు. ఎమ్మెల్యే అయిన మొదటిసారే చెన్నారెడ్డి, కోట్ల విజయబాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి మంత్రి వర్గాల్లో గీతారెడ్డి మంత్రిగా పని చేయడం విశేషం. 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయరామారావు గీతారెడ్డిపై గెలుపొందారు. విజయరామారావుకు 52234 ఓట్లురాగా గీతారెడ్డికి 32942 ఓట్లు మాత్రమే వచ్చాయి. ముగ్గురు ముఖ్యమంత్రులు మారటం, ఎన్‌టీఆర్ ప్రభంజనంతో గజ్వేల్ నియోజకవర్గ ఓటర్ల 19292 ఓట్ల భారీ ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. 1999 ఎన్నికల్లో బీ.సంజీవరావు 2427 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో సంజీవరావు గెలుపొందారు. 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన పోటీ చేసిన గీతారెడ్డి 24260 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొంది వైఎస్ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. 2009 ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్ కోల్పోయిన ఈ నియోజకవర్గం సాధారణంగా ఏర్పడింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తూంకుంట నర్సారెడ్డి 7175 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం వెనువెంటనే వచ్చిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుండి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ పోటీ చేసారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మద్య త్రిముఖ పోటీ నెలకొనగా ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, టీడీపీల మద్యనే కొనసాగింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి కేసీఆర్‌కు 86694 ఓట్లురాగా టీడీపీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డికి 67303 ఓట్లు లభించాయి. ఏ సెంటిమెంటుతోనైతే బరిలోకి దిగాకా గులాబి దళపతి 19391 ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది కొత్త రాష్ట్రం పరిపాలన పగ్గాలు చేపట్టడం గమనార్హం. ముందస్తు ఎన్నికలకు వెళుతున్న ఈ సారి కూడా కేసీఆర్ అదే సెంటిమెంటుతో గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా మహాకూటమి నుండి ప్రతాప్‌రెడ్డి బరిలోకి దిగి కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే.