తెలంగాణ

విభజన హామీలపై అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో కేం ద్రం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో అన్యాయం చేసిందని, కేంద్రం తీరుపై టీడీపీ ధర్మపోరాటం చేస్తోందని ఆంధ్రా టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. బుధవారం నాడు ఆయన ఇక్కడ పాత్రికేయులతో మాట్లాడుతూ రాజనాధ్ సింగ్ తుఫాను బాధితులను పరామర్శించకపోవడం దారుణం అని అన్నారు. ఉత్తరాంధ్ర తుఫాను బాధితుల ఇబ్బందులపై జగన్, పవన్ కళ్యాణ్‌లు పసలేని విమర్శలు చేస్తున్నారని కనీసం కేంద్ర మంత్రిని కలిసి తక్షణ సాయం కింద నిధులు కూడా అడగలేదని అన్నారు. చట్టంలోని విభజన హామీలు అమలుచేయాల్సిన బాధ్యత, పర్యవేక్షించాల్సిన బాధ్యత కేంద్ర హోం మంత్రిత్వశాఖదేనని, ఈ విషయంలో రాజ్‌నాధ్ సింగ్ విఫలమయ్యారని అన్నారు. రాష్ట్రానికి వచ్చి రాజకీయ విమర్శలకే పరిమితం అయ్యారని, ఉద్యోగుల విభజన గురించి మాట్లాడలేదని అన్నారు. ఉన్నత విద్యామండలి ఆస్తుల విభజనపై సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు బుట్టదాఖలు చేసిందని ప్రశ్నించారు. షెడ్యూలు 13 సంస్థల ఏర్పాటు నిధుల విడుదలలో కేంద్రం నిర్లిప్తత, వౌలిక సదుపాయాలు పరిశ్రమల ఏర్పాటులో కేంద్రం అలసత్వం, రాజధాని నిర్మాణం కోసం రాష్ట్రానికి రావల్సిన నిధులు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి ప్యాకేజీ ఎక్కడ అంటే ఉలుకూ పలుకూ లేదని ఆరోపించారు. కేంద్రం, పవన్, జగన్‌ల బాధ్యతారాహిత్యంపై ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.