తెలంగాణ

అట్టడుగు వర్గాలను మోసగించిన కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: అట్టడుగు వర్గాలను కేసీఆర్ మోసగించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ బడుగు బలహీన వర్గాల వారికి వ్యతిరేకి అన్నారు. దళితులు , బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా వ్యతిరేక దృష్టితో చూస్తున్నారని ఆరోపించారు. ఇందుకు ఫలితాన్ని రాబోయే ఎన్నికల్లో ఫలితాల్లో అనుభవిస్తారని చెప్పారు. కుల సంఘాలను కూడా కేసీఆర్ మోసం చేశారని, దేవాలయ భూములు , అధికార పార్టీ నేతలే అన్యాక్రాంతం చేశారని, ఉద్యోగులను కూడా ఈ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. జర్నలిస్టులను టీఆర్‌ఎస్ మోసం చేసిందని అన్నారు. తన మాటల గారడీతో ఓట్లు రావని, దాని ప్రభావం ఉండబోదని జనం కర్రు కాల్చి వాత పెట్టే రోజు దగ్గరపడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బెయిల్‌పై ఉందని, వారు ఓట్లు అడిగితే వేసేది ఎవరని అన్నారు. మిగిలింది కూడా దోచుకోవడానికి కాంగ్రెస్ సిద్ధం అవుతోందని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇళ్ల బాగోతం జనం మరిచిపోలేదని, మరి జైలుకు పంపిస్తా అని చెప్పిన కేసీఆర్ తర్వాత కాంగ్రెస్‌తో ఎందుకు లాలూచీ పడ్డారని నిలదీశారు. చంద్రబాబు చేతిలో కాంగ్రెస్ ఉందని, చంద్రబాబు చెప్పినట్టు కాంగ్రెస్‌లో అభ్యర్ధులు ఖరారయ్యారని, కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినా వారు తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరుతారని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా కలవని ఏకైక సీఎం కేసీఆర్ అని , సచివాలయానికి రాకుండా పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. జాతీయ పార్టీ ద్వారానే దళితుల అభ్యున్నతి అని బొడిగ శోభ బీజేపీలో చేరానని చెప్పారు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ రెబల్ బాలూ నాయక్ కూడా బీజేపీలో చేరారు.