తెలంగాణ

పాలకుర్తిలో గులాబీ జెండా ఎగరేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 18: ఎర్రబెల్లి దయాకర్‌రావు.... ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్దండులలో ఒకరు. పార్టీలో లభించే అవకాశాల కోసం వెంపర్లాడకుండా తన వద్దకు వచ్చేటట్టు చేసుకున్న శ్రామిక యోధుడతను. పార్టీలో తన ప్రత్యర్థులు ఎంతటి పదవిలో ఉన్నా.. తనకు ఏ పదవి రాకపోయినప్పటికీ తన స్వయం కృషితో పట్టుదలతో పత్యర్థులకు దీటుగా నిలిచిన వ్యక్తి. అనుక్షణం ప్రజలలో ఉండడం.. ప్రతి నిత్యం కార్యకర్తల వెంటే ఉండడం ఆయన స్వయంగా ఏర్పాటు చేసుకున్న కార్యచరణ, ఆ నమ్మకమే ఆయనను తిరుగులేని నాయకుడిగా నిలబెట్టింది. ప్రత్యర్థులపై పైచేయి సాధించేలా చేసింది. అందువల్లనే ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ గాలి బలంగా వీచినప్పటికీ అప్పట్లో తెలంగాణ వ్యతిరేకపార్టీగా ముద్రపడిన టీడీపీ నుండి పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా దయాకర్‌రావు గెలుపొందారు. మరో సారి ఈఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈమేరకు ఆదివారం ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి ప్రత్యక ఇంటర్వూ ఇచ్చారు. తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధికి తోడు నిత్యం ప్రజల మధ్య ఉండటం తనకు కలిసి వస్తుందని అంటున్నారు. అంతే కాకుండా కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు తన గెలుపుకు దోహదపడుతాయని ధీమాగా ఉన్నారు. ఎన్ని కూటములు కట్టిన తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.