తెలంగాణ

అది మాయల మహా కూటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 18: దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవాలని.. అప్పుడే దేశానికి పట్టిన శని వదులుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయినిపల్లి తదితర గ్రామాల్లో మంత్రి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నక్కలబడ్డ గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు శనిలా పట్టుకుందని.. ఆ పార్టీ నాయకుల నిర్వాకం వల్లే తెలంగాణలో 60 ఏళ్ల పాటు ఆకలిచావులు, రైతుల ఆత్మహత్యలు జరిగాయని విమర్శించారు. ఎన్నో పోరాటాలు, ఎందరో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే చంద్రబాబునాయుడు కళ్లు మండుతున్నాయని తెలిపారు. అందుకే ఎలాగై తెలంగాణ ప్రజలను మళ్లీ బానిసలుగా చేసుకోవాలని బాగుపడుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎలాగైనా చెడగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. అందుకే మహాకూటమి పేరిట ఓ మాయల కూటమిగా ఏర్పడ్డారని కాంగ్రెస్, టీడీపీలు బద్ద శత్రువులని కాంగ్రెస్‌ను ఖతం చేయడానికే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని కానీ చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ ఆశయాలను తుంగలో తొక్కి కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవడం సిగ్గుచేటన్నారు.
ఎవరు ఎవరితో పొత్తుపెట్టుకున్నా మాకేమీ ఇబ్బంది లేదని.. టీఆర్‌ఎస్ అడ్డుకునే దమ్ముధైర్యం తెలంగాణలో ఏ పార్టీ నాయకుడికి లేదన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు మహాకూటమి ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. మహాకూటమికి ఓట్లు వేస్తే మళ్లీ తెలంగాణ ప్రజలు బానీసలుగా మారేప్రమాదం ఉంటుందని అన్నారు. తమిళనాడు తరహాలో పట్టిన గతే తెలంగాణలో సైతం కాంగ్రెస్ చవిచూడాలి ప్రజలు మహాకూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు చేసిన ఆడగాలను పాలమూరు ప్రజలు మరవరని అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులను ప్రజలు ఓడించి పాలమూరు పౌరుషాన్ని చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం వ్యవసాయానికి పెద్దపీట వేసిందని ఇది తాము చెబుతున్న విషయం కాదని ఐక్య రాజ్యసమితి తేల్చి చెప్పిందన్నారు. రైతుబంధు, రైతుభీమా పథకాలు అమలుపై ప్రపంచ దేశాలే కేసీఆర్‌కు కితాబు ఇస్తున్నాయని తెలిపారు.