తెలంగాణ

పిట్ట కథలు అల్లడంలో కేసీఆర్ దిట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, నవంబర్ 18: కట్టు కథలు, పిట్ట కథలు అల్లడంలో కేసీఆర్ దిట్ట అని, ఆయన మాయ మాటలను ప్రజలు నమ్మవద్దని అందోల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే పోటీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ పేర్కొన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ టెండర్లలో వచ్చిన ముడుపులే ఈ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి జేఎసీ నాయకులు, విద్యార్థులు బాబుమోహన్‌కు ఈ ఎన్నికల్లో మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బాబుమోహన్ మాట్లాడుతూ ఎలాంటి అవినీతి రాజకీయాలకు పాల్పకుండ పని చేసిన తనను కాదని ఒక బ్లాక్‌మెయిలర్, దళారికి అందోల్ టిక్కెట్ కేటాయించడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ టెండర్లలో ఒక్కో వ్యక్తి నుండి రూ.40నుండి 50కోట్ల వరకు ముడుపులు తీసుకున్నారని, ఆ డబ్బులే ఈ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నాడని విమర్శించారు. గత 25యేళ్లుగా రూపాయి ఆశించకుండా పని చేసానని, అందోల్ ప్రజలు తనకు అండగా ఉంటారన్న నమ్మకం తనకుందన్నారు. ఈ ప్రాంతం ఎమైనా పర్వాలేదు కానీ కూతురుకు 3 టీఎంసీలు, కుమారుడు 15టీఎంసీల నీటిని సీంగూర్ ప్రాజెక్టు నుండి తరలించుకుపోయారని, ఈ విషయంలో తన నోరు మూయించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయంలో కూడా అందోల్‌కు చేసిందేమి లేదన్నారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ ఉన్న పనులన్ని తన బామ్మర్దికి అప్పగించి డబ్బులు దండుకోవడమే పాలనగా పాలించారన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు తగిన గుణపాఠం చెప్పేందుకు నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. అనంతరం కేసీఆర్ విస్మరించిన 101 అబద్ధాల కరపత్రాన్ని విడుదల చేసారు.

అందోల్‌లో బాబుమోహన్‌ను గెలిపిస్తాం : ఓయూ జేఎసీ
అందోల్ నియోజకవర్గంలో పాగా వేసి బీజేపీ అభ్యర్థి బాబుమోహన్‌ను గెలిపిస్తామని ఉస్మానియా యూనివర్శిటి జేఎసీ నాయకులు దత్తు, రాజునేతలు పేర్కొన్నారు. ఎక్కడైతే అన్యాయం, మోసం జరుగుతుందో అక్కడ ఓయూ జేఎసీ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ బంగారు తెలంగాణ దేవుడెరుగు కానీ బతకలేని తెలంగాణగా మారిందన్నారు. ఐదేళ్లు పరిపాలించాలని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కాదని నాలుగేళ్లకే పారిపోయిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. విద్యార్థి అమరుల త్యాగాలపై ఏర్పడ్డ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడని విమర్శించారు. నిరుద్యోగులను నిండా ముంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెరాస ప్రభుత్వమేనన్నారు. టీఆర్‌ఎస్‌ను గద్దె దింపాలి, రాష్ట్ర ఆకాంక్షలను కాపాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ నాయకులు నర్సింహారెడ్డి, ఉదయ్, విజయ్‌కుమార్, ఓయూ జేఎసీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.