తెలంగాణ

అదృష్ట పరీక్షకు నేడు చివరి రోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం సోమవారంతో ముగియనుంది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంది. ఈనెల 12న ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన విషయం అందరికీ తెలిసిందే. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరణ ఆరంభమైన సంగతి తెలిసిందే. కాగా గత ఆరు రోజుల్లో 1497 నామనేషన్లు దాఖలయ్యాయి. సోమవారం మరో వెయ్యి దాకా నామినేషన్లు దాఖలు కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. నామినేషన్ల గడువు ముగిసిన అనంతరం సక్రమంగా ఉన్న నామినేషన్లపై, సక్రమంగా లేని నామినేషన్లపై ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన చేస్తుంది. ఈమేరకు ఈనెల 20న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నవంబర్ 22 వరకు నామినేషన్ల ఉపసంసహరణకు గడువు ఉంది. పోటీలో ఎంతమంది అభ్యర్థులు మిగిలారో, ఏ పార్టీ తరఫున అభ్యర్థి ఎవరో అదే రోజు ప్రకటిస్తారు. ఆ తర్వాత ప్రచారం ప్రారంభమవుతుంది. 2019 డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 7 గంటల వరకూ ప్రచారం చేసుకునేందుకు వీలుంది. డిసెంబర్ 7న ఉదయం ఏడుగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపునిర్వహించి అదే రోజున ఫలితాలు కూడా వెల్లడిస్తారు.

222 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు తాజాగా అనుమతి
కొత్తగా 222 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీఐ) అనుమతించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ రజత్ కుమార్ తెలిపారు. ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశారు. రాష్ట్రంలో 32,574 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఈసీఐ గతంలో అనుమతించింది. ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో, దూరంగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లో కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అనుమతించారు. దాంతో మొత్తం పోలింగ్ కేంద్రాల సఖ్య 32,796కు చేరింది. మేడ్చెల్-మల్కాజిగిరి జిల్లాలో 65 పోలింగ్ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇచ్చారు.
హైదరాబాద్‌లో 40, నిజామామాద్ జిల్లాలో 31, వరంగల్ (పట్టణ)లో 19, రంగారెడ్డిలో 17, సంగారెడ్డిలో 12, కరీంనగర్‌లో 9, నిర్మల్‌లో 8, సిరిసిల్లా-రాజన్న జిల్లాలో 4, ఆదిలాబాద్, వనపర్తి, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాచలం, ఖమ్మం జిల్లాలలో రెండేసి కేంద్రాలు అదనంగా ఏర్పాటు చేసేందుకు అనుమతించారు. అలాగే పెద్దపల్లి, జోగులాంబ-గద్వాల్, జనగాం, నల్లగొండ, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కొక్క పోలింగ్ కేంద్రం అదనంగా ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఆయా జిల్లా కలెక్టర్లయిన జిల్లా ఎన్నికల అధికారులు చేసిన సిఫార్సు మేరకు అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.