Others

నిరుద్యోగులు జాగ్రత్త పడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో రోజురోజుకి జనాభా ఏ విధంగా పెరిగిపోతున్నదో అంతే త్వరగా నిరుద్యోగం కూడా ఎక్కువవుతున్నది. కారణం నేటి సమాజ అవసరాలకు తగినట్లుగా మన దేశ యువతకు చదువులేదు. ఎన్ని చదువులు చదివినా ఎన్ని డిగ్రీలు పొందిన ఉద్యోగం చేయలేని పరిస్థితి ఏర్పడుతున్నది. మరి ఇలాంటి పరిస్థితిలో సతమతమవుతున్న సాటి నిరుద్యోగి పాలిట కొంతమంది చదువుకున్న వ్యక్తులే దోపిడి దొంగలుగా మారారు. నిరుద్యోగి జీవితాలను కొల్లగొడుతున్నారు. ఇలాంటి ముఠాలు నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ నిరుద్యోగి కార్యక్రమం మూడుపువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది. దీనికి మూల కారణం ప్రభుత్వ కొలువులపై ఆశగా కళ్ళతో వత్తులేసుకుని ఎదురుచూస్తున్న నిరుద్యోగే..
నిజానికి నిరుద్యోగి అంటే ఉద్యోగం లేనివాడు అని సాధారణ అర్థంకాని ప్రభుత్వం ఉద్యోగం లేనివాడు అని కాదు అర్థం. ప్రభుత్వ ఉద్యోగులే జీవితాలను కొనసాగించేలా చేయవు. అలా అంటే ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న ఎంతమంది స్వేచ్ఛగా ఆనందంగా ఉంటున్నారు. ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లు ఎలాంటి ఉద్యోగికి అలాంటి సమస్యలు తప్పవు. అయితే నేడు 60 శాతం మంది డిగ్రీలు పుచ్చుకున్న యువత గవర్నమెంట్ ఉద్యోగం కోసం సాధన చేస్తూ ఎలాంటి ప్రయివేటు ఉద్యోగం చేయరు. దీనివల్ల వారికి సంపాదన లేక వారి తల్లిదండ్రులే నెలనెల వీరికోసం ఇంటివద్ద నుండి డబ్బు పంపాల్సిన పరిస్థితి. దీని ద్వారా ఇలాంటి వారి కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడి అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నాయ. మరీ ఇంతటి కష్టనష్టాలకు ఓర్చి నీ తల్లిదండ్రులు డబ్బు పంపిస్తే గుర్రం కడుపులో గుడ్డులాంటి ఉద్యోగం కోసం పరితపిస్తూ సంపాదించే శక్తి ఉన్నా ఈ అనుకూలమైన వయస్సు వృధా చేసుకోవడం ఎంతవరకు సబబు? ప్రైవేటు వ్యవస్థలో ఉన్న ఉద్యోగాలకోసం ప్రకటనలు వెలువరించగానే కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు చేసుకోవడంవల్ల సంబంధిత యాజమాన్యాలు క్వాలిటీ ఎక్కువగా చూస్తూ క్వాంటిటి (జీతం) తక్కువగా కోరుకునే అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు. దీని ద్వారా అప్పటికే పనిచేస్తున్న వ్యక్తులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. తక్కువ వేతనానికి పనులు చేయవద్దనికాదు. కాని ఒక్కసారి ఆలోచించండి. మీవద్ద క్వాలిటీ ఉన్నప్పుడు మరెందుకు జీతం తక్కువకు విధులు నిర్వర్తించాలి. ఎంతకైనా చేద్దాంలే అనే భావనను విడనాడాలి. అటు యజమానులకు ఇటు మనకు ఎవ్వరికి అన్యాయం జరగకుండా న్యాయమైన దారినే ఎన్నుకొని పనిచేయాలి.
ఎవరైనా మీకు ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తాం కాని రెండు మూడు లక్షలు ఖర్చవుతుంది అని చెప్పగానే ముందు వెనక ఆలోచింకుండా ఆ విషయం చెప్పిన వ్యక్తి సరియైన వాడా లేదా అతను ఎవరు? అసలేం చేస్తాడు? అని తెలుసుకోకుండానే లక్షలు లక్షలు వాళ్ళ దోసిళ్ళలో పోసేస్తున్నారు. బస్సు ఎక్కితే కండక్టర్ చిల్లర లేదు అని రెండు రూపాయలు టికెట్ వెనకాల రాస్తేనే బస్సు దిగేటప్పుడు ముక్కుపిండి వసూలుచేస్తాం. మరి ఎవరో అనామకుడికి లక్షలకు లక్షలు ఎలా దారాదత్తం చేస్తారు? ఎందుకంటే అని మనం కష్టపడి సంపాదించినవి కాదుకదా! మన అమ్మనాన్నల కష్టం కదా అందుకే మన చేతుల నుండి ఆ డబ్బు మరొకరి చేతుల్లోకి వెళుతున్నా మనకేం అనిపించదు. కాని ఆ డబ్బులు మనం మన తల్లిదండ్రులను అడిగినప్పుడు వారు మనకిస్తున్నప్పుడు వారు ఎదుర్కొనే మానసిక వేదన వారి గుండెల్లోని తర్జన భర్జనలను ఎప్పుడైనా గమనిస్తున్నామా? ఒక ఆడపిల్లను నవమాసాలు మోసి కనిపెంచి మరో వ్యక్తి చేతుల్లో పెడుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు పడే బాధనే మనం డబ్బును మరో వ్యక్తి చేతుల్లో పెట్టేటప్పుడు బాధపడితే నేడు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం రాదు.