సబ్ ఫీచర్

మంచి ఆలోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ భూమి మీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెట మరియు తుప్పును తినివేయును. దొంగలు కన్నమువేసి దొంగిలించుదురు. పరలోకమునందు ధనమును మీకొరకు కూర్చుకొనుడు. అచ్చట మీ ధనమును చిమ్మెటయు, తుప్పును ఏమీ చేయజాలవు.దొంగలు కూడా దొంగిలించజాలరు.
ఎక్కడ మీ ధనము ఉండునో అచ్చట మీ హృదయముండును. దేహమునకు దీపమే కన్ను గనుక మీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగు మయమై యుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి మయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటియైయుందిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి యొకరిని ప్రేమించును లేదా యొకని పక్షముగా నుండి యొకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. అందువలన నేను మీతో చెప్పునది ఏమనగా ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అది మీ ప్రాణము గూర్చియైనను ఏమి ధరించుకొందుమో అది మీ దేహము గూర్చియైనను చింతింపకుడి. ఆహారము కంటె ప్రాణమును వస్తమ్రు కంటె దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు కోయవు. కొట్లల్లో కూర్చుకొనవు.అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటె బహు శ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తనయెత్తును మూరెడు ఎక్కువ చేసుకొనగలడా? వస్తమ్రులను గూర్చి మీరు చింతింపనేల? అడవి పువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు. ఒడకవు. అయినను అవి సమస్త వైభవములతో కూడిన సాలమోను సహితము వీటిలో ఒకదాని వలెను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా!మరి మీకు నిశ్చయముగా వస్తమ్రులు ధరింపచేయును కదా.
కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో ఏమి ధరించుదుమో అని చింతింపకుడీ. అల్ప విశ్వాసము గలవారు వీటికై యోచింతురు. ఇవన్నీయు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతుకుడు. అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహించబడును. రేపటి గూర్చి చింతింపకుడి. రేపటి దినము రేపటి సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. మీరు తీర్పు తీర్చకుడి. అప్పుడు మీకును తీర్చబడదు. మీరు తీర్చిన తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును.
మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలత కొలచబడును. మీ కంటిలో నున్న దూలమును గూర్చి ఎంచక మీ సోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయేల? నీ కంటిలో నున్న దూలమును తీసివేయకుండా మీ సహోదరుని కంటిలో నున్న నలుసును తీసివేయమని చెప్పుట ఎందుకు?
వేషధారి! మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసికొనుము. అప్పుడు నీ సహోదరుని కంటిలో నున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. ముత్యములను పందుల యెదుట వేయకుడి. వేసిన యెడల అవి యొకవేళ కాళ్లతో తొక్కి మీ మీదపడి మిమ్ములను చీల్చి వేయును. మత్తయి: 6:19-7:6
డబ్బు మంచి దాసుడు చెడ్డ యజమానుడు. డబ్బు మంచిగా వాడుకుంటే మంచిదాసుడు అవుతాడు.చెడుగా వాడుకుంటే డబ్బు చెడ్డ యజమానిగా మారుతాడు. మనిషి డబ్బును వాడుకోవాలి. కాని డబ్బు మనిషిని వాడుకోకూడదు. దేవుడు మనిషిని సృష్టించుకున్నాడు. మనిషి డబ్బును సృష్టించుకున్నాడు. మనిషి దేవుణ్ణి సేవించాలి. డబ్బు మనిషిని సేవించాలి. తప్ప డబ్బుకు మనిషి దాసుడు కాకూడదు. డబ్బుతో మంచాన్ని కొనగలవు. కాని నిద్రను కొనలేవు. మందులు కొనగలవు. కానీ ఆరోగ్యమును కొనలేవు. అన్నింటికీ డబ్బు మూలం అనుకుంటున్నాడు మనిషి. మనిషికి మూలం దేవుడు. చితి చనిపోయిన మనిషిని కాల్చితే చింత బ్రతికిన మనిషిని కాల్చుతుంది గదా. గనుక దేవుని ప్రమేయంతో మనుగడ కొనసాగించాలి. మనిషి తన మనుగడలో దేవుని ఉద్దేశము వెదికితే అవసరతలు మనిషి వెదుకుతూ వస్తవి. పరిశుద్ధమైనవి కుక్కలకు పెట్టకుడి అంటే మనిషిని అపవిత్రపరిచే ఆలోచనలకు అవసరతలకు స్పందించకూడదు.

-దైవజనులు సుదర్శన్ వగ్గు