సబ్ ఫీచర్

కర్మలు - ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూలోకం అనేది కర్మభూమి. పుణ్యభూమి. ఇక్కడికి వచ్చిన వారంతా కర్మ చేయాల్సిందే. ఆకర్మ ద్వారా పాపపుణ్యాలను మూటకట్టుకోవలసిందే. మానవుడిగా జన్మ రావాలని దేవతలు ఎదురు చూస్తుంటారట. మానవజన్మ ప్రాణికోటి జన్మల్లోకి ఉత్తమమైంది.
విచక్షణ, వివేకం రెండూ ఉన్నందువల్ల మానవుడు పుణ్యమో పాపమో తన ఇచ్ఛ వచ్చినట్టు చేస్తుంటాడు. పశువులు అయతే వాటికి కర్మను భగవంతుడు నిర్దేశించే ఉన్నాడు. వాటి ప్రకృతి ధర్మం ప్రకారం అవి నడుస్తుంటాయ. దేవతలూ అంతే వారు పుణ్యకర్మలు చేసినంత మాత్రాన వారికి పుణ్యం అంటూ ఏమీ రాదు. కానీ పాపకర్మలు ఆచరిస్తే ఆపాపం తాలూకూ ఫలితాన్ని అనుభవించాలి. ఒక్క మానవుడికే పాపం, పుణ్యమూ అనే రెండూ తన చేతిలోనే ఉన్నాయ.
తనకు పూర్వజన్మల కారణంగా ప్రారబ్ధకర్మ ప్రాప్తించినా గట్టి యత్నంతో కర్మను వదిలించుకోవచ్చు. మరు జన్మకు మంచి కర్మలు చేయనూ వచ్చు. పశ్చాత్తాపడే మానవుడికి భగవంతుడు తోడుగా ఉంటాడు. తప్పులు చేయని వారికి, ధర్మాన్ని ఆచరించేవారికి, సత్యధారణ చేసేవారికి కూడా భగవంతుడు మేలు చేయడానికి ఎదురు చూస్తుంటాడు.
భగవంతుడు సర్వవ్యాపి. ఆయన లేని సృష్టిలో చోటే లేదు. అణువణువు ఆయన నివాసస్థానమే. ఆయన అనుక్షణం అన్నింటా, అంతటా వ్యాపించి వుంటాడు. అందుకే మనిషి ఎవరినీ చూడకుండా ఈ కర్మ చేయవచ్చునులే అనుకొంటే అది పొరపాటే అద్దం ముందు నిలబడి అద్దంలో ప్రతిబింబం లేకుండా చేయగలం అనుకొంటే అది తెలివిలేని పని అవుతుంది కానీ మరోటి కాదుకదా. మనిషి త్రిగుణా లు ఉంటాయ. త్రిగుణా తీతుడు భగవంతుడు. త్రిగుణాలను తన అధీనంలో ఉంచుకుని కర్మలు చేస్తే పుణ్యకర్మ అవుతుంది. త్రిగు ణాలు అధీనంలో ఉండా లంటే ఇంద్రియాలు మన మాట వినాలి. ఇంద్రియాలను అధీనంలో ఉంచు కోవడం అంత తేలికైన విషయం కాదు.
దానికి కూడా భగవంతుడు ఒక మార్గం చూపాడు. ఇంద్రియాలు, గుణాలు ఇవి అన్నీ అధీనంలో ఉంచుకోవడానికి సమయాన్ని వృథా చేయక తన్ను నమ్ముకుని సర్వానికి కర్త కర్మక్రియ భగవం తుడే అని నమ్మితే చాలు ఏ కర్మ ఫలితం అంటుకోదు. కర్మలు ఫలితాలు లేకుంటే జన్మలే రావు. మహావిష్ణువు సాయు జ్యం లభ్యమవుతుంది. ఈ మాటనే శ్రీకృష్ణుడు భగవద్గీ తలో కర్తవ్యాన్ని నిర్వర్తించు నీ యోగక్షేమాలను నేను చూసు కొంటాను అని చెప్పాడు. ఈ మాత్రం చేస్తే చాలు భగవంతుడు అన్నింటికీ దారి చూపిస్తాడు.
మురికి దుమ్ము పట్టిన అద్దంలో ప్రతిబింబం ఎలా కనిపించదో, అలాగే మురికికూపంలో చిక్కుకున్న వారికి గంధం యొక్క సుగంధం తెలీదు. ప్రేమకు, నిర్మలత్వానికి, శాంతికి, అహింసకు, పవిత్రతకు, పరిశుభ్రతకు మారుపేరు భగవంతుడు. ఇవన్నీ ఎక్కడ వుంటే భగవంతుడు అక్కడ తప్పక నివసిస్తాడు. మానవుడు మనసా వాచా కర్మణా పరిశుభ్రంగా ఉండాలి. చెడు ఆలోచన్లు చేస్తూ పట్టు వస్త్రాలు ధరించినంత మాత్రాన భగవంతుని ఆశీస్సు లభించదు.
కనుమరుగులో సాటి మనిషిని మోసం చేసి, వాని ధనాన్ని దోచేసుకొంటూ అందరికీ తెలిసేట్టుగా దానాలు చేస్తూ వేదికలెక్కి ధర్మప్రబోధాలు చేస్తే భగవంతుడు మెచ్చడు. మనిషి మనసులోనే భగవంతుడు కూర్చుని ఉంటాడు. ఏ మనిషి కూడా మనసుకు తెలియకుండా ఏ పని చేయలేడు. కనుక మన ఎదురుగా భగవంతుడు ప్రతినిముషం కూర్చుని ఉన్నాడనుకొంటూ కర్మలు ఆచరిస్తే పాపపుణ్యాల బెడదు ఉండదు. అంతటా భగవంతుడు ఉన్నాడనుకొంటూ భగవంతుడే నా చేత చేయస్తున్నాడనుకొంటే మరింత మంచి కార్యాలు జరుగుతాయ.

--వెంకట్రావు