సబ్ ఫీచర్

సూర్యారాధన కనీస కర్తవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
H.No. 7-8-51 Plot No.18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500 079

==========================================

వ్యక్తి శరీరమునందు వివిధ రూపములతో వైవిధ్యములతో కూడిన, రక్త, మాంస, అస్థి, నాడీ కణములు, జీవ రసాయన కణములు కోటానుకోట్లు గలవు. ఐనను దేని పని దానిదే. మనము భుజించిన ఆహారము నుండి, రసమును గ్రహించి, శరీర పోషణకవసరమగు పోషకములను గుర్తించి, అవసరమగు మేరకు గ్రహించి వివిధ ధాతువులకందించు శక్తి ప్రేగులలోని కణజాలములకున్నది. అదే విధముగా, రక్తములోని కణములు, మనము పీల్చేగాలిలోని ప్రాణవాయువును గ్రహించి, బొగ్గు పులుసు వాయువు (కార్బన్‌డయాక్సైడ్) ను నిశ్వాస ద్వారా బయటకు పంపును.
వృక్షములు రుూ బొగ్గు పులుసు వాయువును నీరు మరియు సూర్యకిరణముల శక్తిచే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా స్వీకరించి, ప్రాణవాయువును (ఆక్సిజన్) అందించును. వివిధ విసర్జకావయవములు, విసర్జక క్రియలను నిర్వహించుట, మెదడునందలి కణములు, వెన్నుపూస (మేరుదండము) నందలి కణములు, విచక్షణ ఆలోచన మొదలగు క్రియలతోపాటు చలి, వేడి, నొప్పి మొదలగు స్పర్శాది గుణముల ద్వారా శరీరమును ఆపదల నుండి రక్షించును. ఈ విధముగ వ్యక్తియందు వివిధ కణములు వివిధ క్రియలు నిర్వహించుచున్నను, క్రియాత్మకముగ సహకరించుకొనుట చేతనే మన శరీరము ఒకే వ్యక్తిగా వ్యవహరించబడుచున్నది. ఇట్టి యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వాన్ని లోపల బయట కూడా గమనించవచ్చును.
నిజానికి మనిషికి తన శరీరమొక పెద్ద కానుక మాత్రమే కాదు, అత్యంతాంతరంగికమైనది ప్రేమాస్పదమైనది కూడా. శుభాశుభకర్మలన్నిటికి సాధనము శరీరమే. మన శరీరంలోని అనేక జీవక్రియలన్నీ మన ప్రయత్న ప్రమేయములు లేకుండానే జరుగుతుంటాయి. గుండె కొట్టుకోవడానికి, శ్వాస తీసుకోవటానికి విడిచిపెట్టడానికి, కాలేయం నిర్వహించే సంక్షిప్త, రసాయన క్రియలను మనం పనికట్టుకుని చేయనక్కరలేదు. శరీర నిర్మాణం ఆ విధంగా రూపొందించబడింది. శరీరం స్వీయ నియంత్రణ కలిగిన వొక అద్భుత యంత్రము. భౌతిక అస్థిత్వానికి కావలసిన క్రియలన్నీ వాటంతటవే అసంకల్పితంగా జరుగుతున్నాయి. మన ఊహకు ఆలోచనకు అందని అత్యుత్తమ యంత్రగతి శాస్తమ్రు (మెకానిక్స్) అత్యుత్తమ విద్యుత్, సంధాయకత (ఎలక్ట్రికల్ కనెక్టివిటీ) అట్లాగే మనం కనిపెట్టలేనంత అత్యుత్తమ స్థాయి గణనా సామర్థ్యము (కంప్యూర్టింగ్) కలిగి వుంది మన శరీరం. తాను తీసుకున్న ఆహారం కొంతసేపటికి తానే అవుతోంది. ఇదేమంత చిన్నపాటి విన్యాసం కాదు. అంటే రుూ సృష్టి మూలమే మనలో పనిచేస్తోందని అర్థవౌతుంది. మన తార్కిక దృష్టికి మేధస్సుకి అందని ప్రజ్ఞ సామర్థ్యం నిర్దిష్ట స్థాయిలో మనలో వున్నాయి. శరీరమనే ఈ అద్భుతమైన యంత్రానికి గల పరిమితుల్ని తెలుసుకోవడానికి మనిషికి కొంత ఎరుక (జ్ఞానం) తెలివి తేటలు కావాలి. ఈ యంత్రం బాగానే వున్నప్పటికి అది తనంతట తాను మనిషి నెక్కడికి తీసుకుపోలేదు కదా! ప్రకృతిలోని సృష్టి మూలమంతా వొకటే అయినప్పటికి, మనిషిలోని సృష్టి మూలానికి, మిగతా జంతుజాల సృష్టి మూలానికి ప్రామఖ్యతలో తేడా వుంది. అందువల్లనే వొకానొక స్థాయి దాటిన తరువాత భౌతికతకు, ఆధ్యాత్మికతను చెందిన కొన్ని కొన్ని విషయాలు కాని పెద్ద విషయాలు కాని, కొందరికి అప్రస్తుతమనిపిస్తాయి. జీవం వొక్కటైతే, జీవితమూలం యింకొకటి.
అందువల్లనే మనిషి భౌతికతకు- అభౌతికతకు మధ్య నిత్యం పోరాడుతున్నట్లనిపిస్తుంది. కానీ భౌతికతకు పరిమితం కాని వొక గొప్ప చైతన్యం మనిషిలో వుంది. మనలో రెండు శక్తులను పరిమితం కాని వొక గొప్ప చైతన్యం మనిషిలో వుంది. మనలో రెండు శక్తులను విరుద్ధమైనవిగా చూస్తాము. ఒకటి ఆత్మ సంరక్షణ స్వభావం (గిరిగీసకుని పరిమిత విధించుకుని కూచోడం), రెండవది నిరంతర విస్తరణ (వ్యాపకత) స్వభావం. రెండూ విభిన్న అంశాలకు చెందనవి. నేను భౌతికవాదిగా వుండాలా, ఆధ్యాత్మికవాదిగా వుండాలా అనే అజ్ఞానం నుంచే మానవుడి పోరాటం మొదలౌతుంది. పాణశబ్దము ‘‘ప్ర+అణ్’’ అనే అక్షరసంధి వలన ఏర్పడినది. అనగా చలనము (కదలిక) ‘ప్ర’ అనగా స్థిరముగా (్ళ్యశఒఆ్ఘశఆ) అని అర్థము. కావున ‘ప్రాణ’ అనగా నిరంతరము స్థిరముగా ప్రవహించే జీవశక్తి అని అర్థము. దీనిని ‘ఓజస్సు’ అని కూడా అనవచ్చును. ప్రశ్నోపనిషత్తులో ప్రాణోత్పత్తిని గురించి ఇలా చెప్పబడింది.
శ్లో॥ ఆత్మ న ఏషప్రాణో జాయతే,
యైథేషా పురషేచ్ఛాయే తస్మినే్నత
దాతతం మనోకృతే నా యాత్మస్మి ఙ్చరీరే॥
అనగా ఆత్మనుండి ప్రాణం జనిస్తుంది. ఇది మనిషి శరీరంపైన వలయం లాగ, ఆత్మపైన విస్తరించి వుంది. మనసు యొక్క చేష్టల ద్వారా యిది శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రాణశక్తి మనం పీల్చే ప్రాణవాయువు అనే వాహకం ద్వారా, శరీరమంతటా వ్యాపించి ఉంటుంది. ఈ ప్రాణవాయువు ఐదు రకాలుగా, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువుల రూపంలో మన శరీరంలో సంచరిస్తూ ఉంటుంది. ఈ ప్రాణశక్తిని ముఖ్యముగా సూర్యుని నుండి మనిషితో సహా సమస్త జీవులు పొందుతున్నాయి. సౌరశక్తి, వృక్షకణ జాలమును, జంతుకణ జాలమును మరియు మానవ శరీర కణజాలమును తాకి జీవశక్తిగా మారుతున్నది. అనగా సూర్యకిరణ శక్తి వేరొక శక్తిగా మారి, రసాయనశక్తిగా రూపాంతరము చెంది, కణజాలము విస్తరించుటకు ముఖ్యకారణమగుచున్నది. ఆ విధముగా పెరుగుదల సాధ్యపడుతోంది. వృక్షములు ఎండపడేవైపునకే ఎక్కువగా పెరుగుతాయి. నీడ ఉన్నవైపు పెరగక పోవడం, పుష్పించి ఫలించకపోవటం మనం చూస్తున్నాము కదా! ఏ జీవి ఐనా తన ఆహారం వైపునకు వెతుకులాడుతూ పయనిస్తుంది. వృక్షజాతి నీటిని మరియు కార్బన్‌డయాక్సైడ్ వాయువును, ఆక్సిజన్, హైడ్రోజన్, స్టార్చ్ మరియు షుగర్ లాంటి ముఖ్యమైన పదార్థములుగా మార్చే పోషక ప్రక్రియను నిర్వహించటానికి కావలసిన శక్తిని, సౌరశక్తి నుండియే గ్రహిస్తున్నాయి. ఈ కణజాలపు ప్రక్రియనే మనం ఫొటోసింథసిస్ లేక, కిరణజన్య సంయోగ క్రియ అని పిలుస్తున్నాము. ఆ విధంగా సర్వప్రాణికోటికి, ఆనందాన్ని, ఆహారాన్ని, తేజస్సుని, ఓజస్సుని, ప్రాణశక్తిని, ప్రసాదించే వాడు, సవితృ మండలాంతర్వర్తియైన, పరమాత్మయే. సకల సుఖాలకు సూర్యుడే మూలమని స్కందపురాణం, ‘‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’’ అని మత్స్య పురాణం చెబుతున్నాయి. అపాల, మయూర మహాకవిలాంటి వారెందరో సూర్యోపాసనవల్ల ఆరోగ్యాన్ని పొందారు. సాంబుడు తన కుష్ఠువ్యాధిని పోగొట్టుకున్నాడు. శ్రీమద్రామాయణంలో, రావణ సంహారానికి ముందు అగస్త్యమహర్షి శ్రీరామునికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు. వేదములు అనేక శ్లోకముల ద్వారా, సూర్యుడిని, అంతులేని శక్తిని, తేజస్సుకి నిర్వచనముగా పేర్కొన్నాయి. అందుకే సూర్యారాధన చెయ్యాలి. సూర్యారాధన చేయటం ప్రతి జీవికి కనీస కర్తవ్యం. చేయకపోవడం కర్తవ్య విముఖుడు అగుటయే.
..........................ఇంకావుంది

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590