సబ్ ఫీచర్

చైతన్యానికి కారణం చేతలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాని, మీరు ఎప్పుడూ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు. అందుకే మీరు ఎప్పుడూ బానిసగానే ఉంటున్నారు.
ఎలాంటి బాధ్యతలు లేకపోతే, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పుడూ హాయిగా, స్వేచ్ఛగా ఉంటుందని మీరనుకుంటున్నారా? అలా ఎప్పుడూ జరగదు. అది మిమ్మల్ని ఒక బానిసగా, నీచ మానవునిగా చేసి మీ పరువురు నాశనం చేస్తుంది. దానితో కుంగిపోయిన మీరు నిటారుగా నిలబడలేరు. మీ తెలివితేటలు ఎదగవు. ఎందుకంటే, మీరు సవాలును స్వీకరించకుండా దేవుడు, అదృష్టం, విధి లీలల గురించి నిరీక్షిస్తూ ‘‘కాలం అనుకూలించి, ఆ దేవుడు కరుణిస్తే నేను కూడా పరమానందంగా ఉంటాను’’ అని భావిస్తూ ఉంటారు. కానీ, మీ పరమానందాన్ని నిర్ణయించగల దేవుడు ఎక్కడా లేడు.
ఈ అస్తిత్వంలో మీరు ఎప్పుడూ ఒంటరివారే. ఎందుకంటే, మీరు ఈ అస్తిత్వంలోకి ఒంటరిగానే వచ్చారు. అలాగే మీరు ఈ అస్తిత్వంలో ఒంటరిగానే మరణిస్తారు. ఈ జనన మరణాల మధ్య మీకు అందరూ- తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, స్నేహితులు- ఉన్నారుకుంటారు. అదంతా వట్టి భ్రమ. ఒంటరిగా వచ్చిన మీరు ఒంటరిగానే పోతారు. కాబట్టి, జనన మరణాల మధ్య మీరెప్పుడూ ఒంటరివారే.
మీరు ప్రేమించలేరని నేను చెప్పట్లేదు. నిజానికి, ఏ విషయంలోనూ ఎవరిపై ఆధారపడకుండా, పూర్తి బాధ్యతను స్వీకరించగల స్వేచ్ఛాయుతమైన ఇద్దరు వ్యక్తులు ప్రేమతో కలుసుకుంటే ఎంతో అందంగా ఉంటుంది. అలా మీరు కలుసుకున్నపుడు మీలో ఎవరూ ఎవరికీ బరువుకారు. ఎందుకంటే, మీరు మీ బరువును ఎప్పుడూ ఎదుటివారిపై వెయ్యరు. అసలు అలాంటి ఆలోచన మీకు ఎప్పుడూ రాదు. మీరు కలిసే ఉంటారు.
అయినా, మీ ఏకాంతానికి ఎప్పుడూ భంగం వాటిల్లదు. అది ఎప్పుడూ స్వేచ్ఛగానే ఉంటుంది. ఎందుకంటే, మీరు మీ పరిధులను ఎప్పుడూ అతిక్రమించరు. అందుకే మీరు పరస్పరం హాయిగా ఆనందించగలుగుతారు. ఎందుకంటే, మీరు ఎప్పుడూ ఎవరికి వారు స్వేచ్ఛగా ఏకాంతంలో విడివిడిగా, కాస్త ఎడఎడంగా ఉంటారు. ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక చోటుచేసుకుంటుంది. అలా మీరు చాలా తొందరగా దగ్గరవుతారు. ఎందుకంటే, రెండు భిన్న ధృవాల ఏకాంతాలు అద్భుతంగా ఒకటయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
దేవుడు, విధి, అదృష్టం లాంటి పదాలను మరచిపోండి. మీ భవిష్యత్తును చెప్తామని మోసం చేసే జ్యోతిష్కులు, హస్తసాముద్రికవేత్తలు, సోది చెప్పేవారిని ఎప్పుడూ మీ దగ్గరకు రానివ్వకండి. మీరు సృష్టించని భవిష్యత్తుకు భవిష్యత్తే లేదు. రేపు జరగబోయే ప్రతిదీ మీరు సృష్టించేదే. కాబట్టి, ఈ పని ఈ రోజు ఇపుడే చెయ్యాలి. ఎందుకంటే, ‘ఈ రోజు’ నుంచే ‘రేపు’ ఉదయిస్తుంది.
మీరు మీ బాధ్యతను పూర్తిగా స్వీకరించండి. అదే నేను మీకిచ్చే సందేశం. నేనెప్పుడూ మీ మనసులో దేవుడనేవాడు లేకుండా చేసేందుకే ప్రయత్నిస్తుంటాను. నేను దేవుడిని వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే, దేవుడే లేనప్పుడు నేనెలా ఆయనను వ్యతిరేకించగలను? లేని దానితో పోరాడుతూ కాలాన్ని వృధా చేస్తున్నానని మీరనుకుంటున్నారా? లేదు. మీలోని నిబద్ధీరణలతో నేనెప్పుడూ పోరాడుతూనే ఉన్నాను. దేవుడులేడు. కానీ, ‘దేవుడున్నాడు’ అనే భావన మీలో ఉంది. అందుకే ఆ భావనతో నేను పోరాడుతూ ‘మీలో వున్న దేవుణ్ణి వదిలించుకుని, మిమ్మల్ని మీ జీవితం పట్ల పూర్తి బాధ్యతను స్వీకరించమంటున్నాను’’.
అందరికీ స్వేచ్ఛ కావాలి. కానీ బాధ్యతను స్వీకరించాలని ఎవరూ కోరుకోరు. అందుకే మీరెప్పుడూ బానిసగానే ఉంటారు తప్ప మీకు ఎప్పటికీ స్వేచ్ఛ లభించదు. గుర్తుంచుకోండి. బానిసగా ఉండడం పట్ల కూడా మీదే బాధ్యత. ఎందుకంటే, దానిని మీరే ఎంచుకున్నారు. అంతేకానీ, బానిసగా ఉండమని ఎవరూ మిమ్మల్ని బలవంతపెట్టలేదు.
అరిస్టాటిల్ సమకాలీనుడైన గ్రీకు తత్వవేత్త ‘డయోజినెస్’ చాలా అరుదైన గొప్ప మార్మికుడు. ఆయన నాలాగే అరిస్టాటిల్‌ను వ్యతిరేకించేవాడు. అందుకే మా ఇద్దరిమధ్య చక్కని స్నేహం కుదిరింది.
దిగంబరంగా పుట్టిన మనిషి దుస్తుల రక్షణ వల్ల బలహీనుడయ్యాడన్నాడు ‘డయోజినెస్’. అందుకే ఆయన దిగంబరంగా జీవించేవాడు. నగ్నంగా ఉండే కుక్కలు క్రైస్తవ మతానికి చెందవు. అందుకే ఇంగ్లాండ్‌లోని కొన్ని కుక్కలకు తప్ప ఈ ప్రపంచంలో ఏ జంతువుకు దుస్తులుండవు. విక్టోరియా రాణి హయాంలో కుర్చీ కాళ్ళకు కూడా దుస్తులుండేవని తెలుస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే, అవి కాళ్ళు కదా! వాటికి దుస్తులు లేకపోతే అవి దర్జాగా కనిపించవు కదా!
ప్రజలను ఎత్తుకుపోయి నిర్బంధించి, వారిని వేలంలో బానిసలుగా అమ్మే నలుగురు వ్యక్తుల దృష్టిలో పడ్డాడు చాలా బలశాలి అయిన డయోజినెస్. ‘‘గతంలో మనం చాలామందిని వేలంలో బానిసలుగా అమ్మేం. కానీ, ఇంత చక్కని మనిషిని మనము ఎప్పుడూ అమ్మలేదు. వేలంలో అతనిని చాలా ఎక్కువ ధరకు అమ్మొచ్చు. కానీ, అతనిని బంధించేందుకు ప్రయత్నిస్తే మనందరినీ అతను చంపేస్తాడు అనుకుంటున్నారు ఆ నలుగురు దొంగలు.

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.