సబ్ ఫీచర్

విలువైన ఆస్తి.. స్వేచ్ఛ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎగిరేందుకు భయం:
రవీంద్రనాథ్ ఠాగూర్ తన గీతాంజలిలో...
‘‘నాకు స్వేచ్ఛ కావాలి.
కానీ, అది కావాలనుకున్నప్పుడల్లా నాకు సిగ్గుగా ఉంది.
ఎందుకంటే, వీడని బంధాలను తెంచుకోవాలని ప్రయత్నించినప్పుడల్లా నా హృదయం బాధపడుతోంది.
అందుకే నా సిగ్గును ఎవరికీ తెలియనివ్వను.
ఒకవేళ తెలిస్తే దానిని ఎవరూ భరించలేరు.
నా మిత్రుడైన స్వేచ్ఛ
ఎంతో అమూల్యమైన, ఎంతో కళాత్మకమైన ఆస్తి అని నాకు తెలుసు.
కానీ, ఆడంబరాల తళుకుబెళుకులతో నిండిన మది గదిని తుడిచే హృదయం నాకు లేదు.
దుప్పటిలా నన్ను ఆవరించి ఉన్న మృత్యుధూళి అంటే నాకు అసహ్యం. అయినా నేను దానిని ప్రేమతో కౌగిలించుకుంటాను.
నాకు చాలా ఋణాలున్నాయి.
నా వైఫల్యాలన్నీ అద్భుతమైనవే.
అయినా నాకు మంచి జరగాలని కోరేందుకు నీ దగ్గరకు వచ్చినప్పుడల్లా, నా ప్రార్థన ఫలించదేమో అనే సందేహంతో భయపడి వణికిపోతున్నాను.’’
అతి ప్రాచీన, సమకాలీన భావాల కలబోత అయిన రబీంద్రనాథ్ ఠాగూర్ రచనలు పురాతన, ఆధునిక మనస్తత్వాల మధ్య వారధిగా నిలుస్తాను. ప్రత్యేకించి ఆయన రచించిన ‘గీతాంజలి’పుస్తకం మానవ చైతన్య పరిణామానికి ఆయన అందించిన గొప్ప బహుమతి. ఇరవైయ్యవ శతాబ్దపు అత్యంత విలువైన అరుదైన పుస్తకాలలో అది ఒకటి.
చిన్నప్పటినుంచే సనాతన సంప్రదాయాలకు వ్యతిరేకి ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ చూసేందుకు ధార్మికుడుగా కనిపించకపోయినా చాలా ఉన్నతంగా ఆలోచించే భావుకుడు. ఆయన తత్వం పసితనపు అమాయకత్వం. అదే ఆయన గొప్పతనం. అందుకే ఆయన విశ్వ చైతన్య వాహకమయ్యాడు. ఆయన అత్యుత్తమ కవి, మార్మికుడు. గతంలోని ఖలీల్‌జిబ్రాన్, నీషేలు ఈయన లాంటివారే. సుదీర్ఘ మానవ చరిత్రలో అసామాన్యులైన ఈ ముగ్గురితో ఒక అధ్యాయం ముగిసింది. గతంలో గొప్ప కవులు ఉన్నప్పటికీ వారిలో మార్మికత చాలా తక్కువగా ఉండేది. అలాగే గతంలోని మహా మార్మికులలో కవితాత్మకత ఉన్నప్పటికీ, అది అంత అద్భుతంగా ఉండేది కాదు.
ఈ కథ వింటే రవీంద్రనాథ్ ఠాగూర్ గొప్పతనం మీకే తెలుస్తుంది.
ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు ఒకడు ఉండేవాడు. వాడు రోజూ వారితో వేగలేకపోయేవాడు. వాస్తవానికి ఒక్క భార్యతోనే వేగలేం. ఇక ఇద్దరుంటే చెప్పేదేముంది. ఒక రోజు ఆ ఇద్దరు భార్యలు తమ భర్త తమలో ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలనుకుని, భర్తను తీసుకుని బోటులో షికారుకెళ్ళారు. సరోవరం మధ్యకు చేరుకోగానే బోటు ఆగింది. విషయం తెలియని భర్త వారితో ‘బోటును ఇక్కడెందుకు ఆపారు?’ అన్నాడు. ‘మాలో నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో ఇప్పుడే చెప్పాలి. నువ్వు ఏది చెప్పినా ఇద్దరం సహిస్తాం, భరిస్తాం. సర్దుకుపోతాం. కానీ, అది తెలిసేవరకు మాకు సుఖం లేదు’’అన్నారు. వెంటనే ఏం చెప్పాలో తెలియని భర్త కాస్సేపు వౌనం వహించి ‘‘నేను మీ ఇద్దరినీ ఒకరిని మించి ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాను’’అన్నాడు తెలివిగా. వెంటనే ఇద్దరు భార్యలు సంతోషపడ్డారు. ఎందుకంటే, వారికి కావలసింది కూడా అదే.
రవీంద్రనాథ్ ఠాగూర్ ఇరవైయ్యవ శతాబ్దపు అత్యుత్తమ కవి అనో లేక మహా మార్మికుడనో విడిగా చెప్పడం కుదరదు. ఎందుకంటే, ఆ రెండు అంశాలు ఒకదానిని మించి మరొకటి ఆయనలో ఉన్నాయి. రవీంద్రుడు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైనవాడు కాడు. విదేశాలలో చదువుకున్న ఆయన నిరంతర ప్రపంచ యాత్రికుడు. ఆయనకు అలా తిరగడం చాలా ఇష్టం. ఆయన విశ్వ పౌరుడు. అయినా ఆయన మూలాలు భారతావనిలో పాతుకుపోయాయి. ఆయన ఎంత విశ్వవిహారి అయినా, ఆ ప్రయాణంలో తనపై ఎంత చెత్త పేరుకున్నా, తిరిగి తన గూటికే చేరుకుని తననుతాను శుభ్రపరచుకుని అద్దంలా మెరిసేవాడు. ఆయన ఎప్పుడూ భారతీయ ఆధ్యాత్మిక వారసత్వ మార్గాన్ని వీడలేదు.
‘నేనొక కోకిలనై శుభోదయ రాగాలాపనతో నీకోసం ఒక ప్రార్థనాగీతం పాడగలను తప్ప, అంతకంటే నీకేమీ ఇవ్వలేను’’అంటూ విశ్వ నివేదనకు చేసిన అనురాగ మాలికలే రవీంద్రుని ‘గీతాంజలి’లోని భావగీతికలు.

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.