సబ్ ఫీచర్

ద్వంద్వ మనస్తత్వమే సమస్య ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వేచ్ఛ నాకు మంచి మిత్రుడు.. ఇవన్నీ కలలు, కోరికలే. కచ్చితత్వమే మీ పంజరం. అదే దానికి రక్షణ. కానీ, ఆడంబరాల తళుకు బెళుకులతో నిండిన మది గదిని తుడిచే హృదయం నాకు లేదు.. ఇవన్నీ మీ మనసులోని అందమైన భావాలే.
దుప్పటిలా నన్ను ఆవరించి వున్న మృత్యుధూళి అంటే నాకు అసహ్యం. అయినా నేను దానిని ప్రేమతో కౌగిలించుకుంటాను.. మీ శరీరం మరణిస్తుందని మీకు తెలుసు. నిజానికి, మీ శరీరం మరణించే పదార్థంతో చేయబడినదే. ఏదో జీవం అందులో వున్నందువల్ల అది బతికి ఉన్నట్లు కనిపిస్తోంది కానీ, అది ఎప్పుడో మరణించింది. మీ శరీరంలో ఎవడో అతిథి ఉన్నాడు. అందుకే అది వెచ్చదనాన్ని ప్రసరించే జీవంతో నిండి ఉంది. అతడు మీ శరీరం నుంచి వెళ్లిపోగానే, శరీరం వాస్తవ రూపం మీకు తెలుస్తుంది.
మృత్యుధూళితో మన శరీరాలు తయారయ్యాయని, అందుకే అదంటే అసహ్యమని, అయినా దానిని ప్రేమతో కౌగిలించుకుంటానని.. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు. కానీ, మీరు ప్రేమలో పడతారు. ఆ ప్రేమ కలాపాలలోని కౌగిలింతలు చర్మ, మాంసాలతో కప్పబడి ఉన్న రెండు అస్థిపంజరాల కౌగిలింతలే కదా! ఆ సంగతి మీకూ తెలుసు. మీరిరువురూ దిగంబరంగా అంటే దుస్తులు లేకుండా మాత్రమే కాదు, చర్మ, మాంసాలు లేకుండా- ఎందుకంటే, అవే అస్థిపంజరానికి అసలైన దుస్తులు. చూసుకుంటే, ఆ రూపాలకు భయపడి ఇద్దరూ పారిపోతారు. మీరు మళ్లీ ఎప్పుడూ కలుసుకోరు. ‘‘జీవితాంతం నీతోనే కలిసి ఉంటాను. మనది జన్మజన్మల శాశ్వత బంధం’’ అని చెప్పుకున్న కబుర్లన్నీ ఏమైపోతాయో ఎవరికీ తెలియదు.
ఒక జరిగిన కథ
షాజహాన్ చక్రవర్తి ఒక స్ర్తిని ప్రేమించాడు. కానీ, ఆమెకు షాజహాన్‌పై ఇష్టం లేదు. అందుకే పెళ్లి చేసుకుంటానని షాజహాన్ ఎంత నచ్చచెప్పినా అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఎందుకంటే, ఆమె షాజహాన్ రక్షభటులలో ఒకడిని ప్రేమించింది. ఆ విషయం తెలిసిన షాజహాన్ వెంటనే అతనిని ఉరి తియ్యమని ఆజ్ఞాపించాడు. వెంటనే ఎంతో అనుభవమున్న ప్రధానమంత్రి షాజహాన్‌తో ‘‘ఈ శిక్ష అతనికి సరిపోదు. ఇంతకన్నా ఘోరమైన శిక్ష నేను విధిస్తాను’’ అన్నాడు. ఆయన మాటను గౌరవించిన షాజహాన్ అందుకు ఒప్పుకున్నాడు. వెంటనే ప్రధానమంత్రి ‘‘ఆ ప్రేమికులిద్దరూ ఏ మాత్రం కదలలేనంత దగ్గరగా నగ్నంగా కౌగిలించుకునేలా చేసి, వెంటనే వారిని తాళ్ళతో బంధించి స్తంభానికి కట్టేయండి’’ అని ఆజ్ఞాపించాడు. అది విన్న అందరూ ‘‘ఆ ప్రేమికులకు కూడా అదే కావాలి కదా! అది వారికి శిక్ష ఎలా అవుతుంది?’’ అని ఆశ్చర్యపోయారు.
వెంటనే శిక్ష అమలైంది. ప్రేమికులిద్దరూ తెగ సంబరపడుతూ నగ్నంగా, ఇద్దరిమధ్య ఏ మాత్రం ఖాళీ లేనంత దగ్గరగా కౌగిలించుకున్నారు. వెంటనే వారిని తాళ్ళతో బంధించి స్తంభానికి కట్టేశారు. అలా ప్రధానమంత్రి వారికి చాలా తెలివైన శిక్ష విధించాడు. ఎందుకంటే, ఆ ప్రేమికులిద్దరూ అలా ఎంతసేపు ఉండగలరు? అయిదు నిముషాలు, పది నిముషాలు, గంట, రెండు గంటలు...? ఇద్దరికీ బాగా చెమట పట్టడంతో వారు ఆ వాసనను భరించలేకపోతున్నారు. కానీ వారిది ఎటూ కదలలేని స్థితి. అలా ఒక రోజు గడిచింది. మరునాడు ప్రధానమంత్రి వారిని విడిపించి దుస్తులు ఇప్పించాడు. వెంటనే వారు ఆ దుస్తులు ధరించి ఒకరినొకరు విసుక్కుంటూ విడివిడిగా వెళ్లిపోయారు. మళ్లీ వారు ఎప్పుడూ కలుసుకోలేదు. ఎందుకంటే, ఆ అవసరం మళ్లీ రానంతగా వారు ఆ శిక్షలో కలుసుకున్నారు.
దుప్పటిలా నన్ను ఆవరించి వున్న మృత్యుధూళి అంటే నాకు అసహ్యం. అయినా నేను దానిని ప్రేమతో కౌగిలించుకుంటాను.. ద్వంద్వ మనస్తత్వమే మనిషికున్న మానసిక రోగం. అందుకే మనిషికి ఎక్కడా శాంతి లభించదు.
నాకు చాలా ఋణాలున్నాయి. నా వైఫల్యాలన్నీ అద్భుతమైనవే. అయినా నాకు మంచి జరగాలని కోరేందుకు నీ దగ్గరకు వచ్చినపుడల్లా, నా ప్రార్థన ఫలించదేమో అనే సందేహంతో భయపడి వణికిపోతున్నాను.
గీతాంజలిలోని మరొక గీతంలోని భావాన్ని నేను మీకు వివరించినప్పుడే పై పంక్తులలోని అర్థం మీకు తెలుస్తుంది. ఆ భావాన్ని మీకు వివరంగా చెప్తాను వినండి..
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.