సబ్ ఫీచర్

పాపపుణ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండలు, నదులు ఈ భూమోకంలో ఉన్నంతవరకు రామాయణ కథ లోకములో ప్రచారమును పొందగలదు అని రామాయణ కావ్యాన్ని అందించిన వాల్మీకి ఆదికవిగా ప్రసిద్ధి నొందాడు. మొట్టమొదటి కాలంలో వాల్మీకి కిరాతక జాతికి చెందిన ఋక్షుడు. కుటుంబ పోషణ భారంగా మారడంతో అరణ్యంలో తిరుగుతూ దారిదోపిడీలు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు అడవి మార్గంలో సప్త ఋషులు వెళ్తున్నారు. వారిని ఈ బోయవాడు అడ్డగించాడు. ధనం ఇవ్వమని పీడించసాగాడు.
ఆ ఋషుల్లో అత్రిమహర్షి బోయ వానిపై సానుభూతి వ్యక్తం చేశాడు. బోయవాడా! మా దగ్గర నీవు ఆశించనదేమీ లేదు. వృథాగా మమ్ములను చంపితే ఆ పాపం నీకు అంటుకుంటుంది. నువ్వు రోజు దారిదోపిడీలు చేసి తెచ్చిన సొమ్మును నీ కుటుంబీకులకు ఇస్తున్నావు కదా. మరి ఈరోజు నీకు ప్రాప్తించే పాపాభారాన్ని వాళ్లు కూడా పంచుకుంటారా అని అడిగాడు. వెళ్లు నీ భార్యాబిడ్డలని అడిగి రమ్ము. వారు పంచుకుంటానంటే తర్వాత ఆలోచిద్దాం. వెళ్లు నీవు వచ్చేవరకు మేము ఇక్కడే వేచి ఉంటాము అని చెప్పారు. వారి మాటలను విని బోయవాడు ఆలోచనా తరంగుడయ్యాడు.
వారు చెప్పినవిధంగానే ఇంటికి వెళ్లాడు. తన భార్యాబిడ్డలతో విషయాన్ని చెప్పాడు. వారు నీవు కుటుంబ పెద్దవు. కనుక నీవు సంపాదించి మమ్ములను పోషించాలి కనుక పోషిస్తున్నావుకానీ మేము నీ పాపాన్ని ఎందుకు తీసుకొంటాము. మాకు నీ పాపపుణ్యాలతో పనిలేదు. కేవలం నీ ఆర్జననే మేము తీసుకొనేది అని చెప్పారు.
అప్పటిదాకా మమతానురాగాలపై వ్యామోహం తో ఎన్నో చెడుపనులు చేసి దుర్మార్గాలను చేసిన బోయవానికి వైరాగ్యం ఆవరించింది. తిరిగి ఆ ఋషుల దగ్గరకు వచ్చాడు. వారికి జరిగింది చెప్పాడు. వారు అతనిపై జాలి తలిచారు. ఎలా నేను ఈ పాపం నుంచి బయటపడేది నాకు మార్గం చూపించండి అని వారినే బోయవాడు వేడుకున్నాడు. లోకోపకారులైన వారు బోయవానికి ‘రామ’అనే శబ్దాన్నిచ్చారు. వారు ఈ రామ అనే శబ్దాన్ని నిరంతరం జపించుము. నిన్ను ఆ భగవానుడు రక్షిస్తాడు అని చెప్పి వెళ్లిపోయారు.
అంతే అక్కడే కూర్చుని రామనామామృతాన్ని గ్రోలసాగాడు. ఎన్నో యేండ్లు గడిచాయి.బోయవాడు బాహ్యస్మృతి కోల్పోయాడు. సమాధి నిష్ఠుడయ్యాడు. అక్కడే ఆయనకు జ్ఞానం లభించింది. కొన్నాళ్లకు వల్మీకం నుంచి బయటకు వచ్చాడు. అందుకే వాల్మీకి అని సంబోధించారు. ఆయనే పరమ పావనమయమైన రామాయణాన్ని రచించాడు. ఆదికవిగా స్తుతులందాడు. ఆ రామాయణమే నేటి తరానికి మార్గదర్శిగా రూపుదిద్దుకుంది. ఆబాలగోపాలానికి రామాయణం దిక్సూచి అయింది. అంతటి రామాయణానికి కర్త అయిన వాల్మీకి జన్మదినంగా ఈరోజును సంభావిస్తూ వాల్మీకి స్మరిద్దాం.

- వేదుల జనార్థన రావు సెల్. 9502469464