సబ్ ఫీచర్

విశ్వాసానికి ప్రతీక శిరిడీ సాయిబాబా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక అంచనాప్రకారం దేశంలో అత్యంత భక్తాదరణ కలిగిన పుణ్యక్షేత్రాలలో కలియుగ వైకుంఠం తిరుపతి తరువాత శిరిడీదే ప్రథమస్థానం. సాయినాథుడు ఈ యుగావతారం. ఈ యుగంలో మనిషి ఎదుర్కొంటున్న సకల సమస్యలకు శిరిడీలో పరిష్కారం లభిస్తుంది. ‘నేను సమాధి చెందిన తరువాత నా భక్తులు శిరిడీలో చీమల బారుల్లా మూగుతారు’అని సాయినాథుడు పలికిన మాటలు నేటికీ రుజువవుతూనే ఉన్నాయి. బాబా పిచ్చుక కాళ్లకు దారంకట్టి లాగినట్టు తన భక్తులను శిరిడీకి లాక్కుంటారు.
శిరిడీలో చూడదగిన ప్రదేశాలు- విశేషాలు
బాబా సమాధి మందిరం
ఇది ప్రధాన మందిరం. మందిర భవనాన్ని నాగపూర్‌కి చెందిన గొప్ప సాయిభక్తుడు శ్రీ గోపాలరావు ముకుంద్ బూటీ బాబా ఆశీస్సులతో నిర్మించారు. అందుకే ఇది బూటీ వాడా అనే పేరుతో గుర్తించబడింది. 1918 అక్టోబర్ 15వ తేదీ విజయదశమి రోజున బాబా తన ఐహిక జీవితానికి సీమోల్లంఘనం చేశారు. బాబా ఆదేశానుసారం బాబా దేహాన్ని ఈ వాడాలో సమాధి చేశారు. ఇదే ప్రస్తుతం సమాధి మందిరంగా పిలువబడుతోంది. ఇక్కడ శ్రీసాయిబాబా పవిత్ర సమాధి, సచ్చిదానంద స్వరూపుడైన సాయినాథుని విగ్రహమూ ఉన్నాయి. భయం, కష్టం, నష్టం, చింత, ఒత్తిళ్లు...సమస్య ఏదైనా దానిని సాయి ఎదుట నిల్చుని భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో మొరపెట్టుకుంటే సమాధి సమాధానమిస్తుంది. ఇక, సమాధి పైనే ఉన్న సాయినాథుని పాలరాతి విగ్రహం కళ చిందిస్తుంటుంది. సాయి తనను దర్శించవచ్చిన భక్తులను కళ్లతోనే ‘రా..రమ్మని’ పిలుస్తున్నట్టు ఉంటారు. విగ్రహాన్ని చూస్తే సజీవంగా ఉన్న బాబాను చూస్తున్నట్టే ఉంటుంది. 1954లో బొంబాయికి చెందిన బాలాజీ వసంతరావు తాలీము ఈ దివ్య మంగళ విగ్రహాన్ని రూపొందించారు. సమాధి మందిరంలో రోజూ నిత్యపూజ, అభిషేకం, నాలుగు హారతులు జరుగుతాయి. సమాధికి దక్షిణంవైపున బాబా పాదుకలు ఉంటాయి. సమాధి మందిరంలో ఉత్తరంవైపు క్యూలోవెళ్తే బాబావారి పాదుకల దర్శనం లభించదు. దక్షిణంవైపు రెండు క్యూలు ఉంటాయి. వీటిలో దక్షిణంవైపు క్యూలో వెళ్తేనే బాబా పాదుకలను దర్శించుకునే అదృష్టం లభిస్తుంది. బాబా భౌతికదేహంతో ఉన్న కాలంలో వాడిన వస్తువులు దగ్గరలోని మ్యూజియంలో భద్రపర్చబడి ఉన్నాయి. అలాగే సాయికి సమకాలికులైన ప్రధాన శిష్యులు, ప్రధాన భక్తులు, మహాదాతలు తదితర ప్రముఖుల ఛాయాచిత్రాలు కూడా మందిరంలో ఉన్నాయి. సమాధి మందిరం చాలా విశాలంగా ఉంటుంది. సాయి సమాధి మందిరం నిరంతరం సాయి నామస్మరణతో అలరారుతుంది.
*
సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1,
కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566