సబ్ ఫీచర్

పరమ పవిత్రం గురుస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబా పదహారేళ్ల వయసులో ఉన్నపుడు ప్రథమంగా కనిపించిన సమాధి మందిరం వెనుక స్థలానే్న గురుస్థానమని అంటారు. బాబా ఈ ప్రదేశం తన గురువుగారిదని చెప్పేవారు. శ్రీ సాయి సచ్చరిత్రలో రాయబడిన ప్రసిద్ధ నింబ వృక్షం (వేపచెట్టు) ఇక్కడే ఉంది. ఇక్కడ గురు, శుక్రవారాల్లో సాంబ్రాణి ధూపం ప్రజ్వలిస్తే భక్తుల దుఃఖం పరిహరించబడుతుందని శ్రీ సాయి సచ్చరిత్రలో ఉదాహరణలతో చెప్పారు. అదే ఇప్పుడు అందరి అనుభవం కూడా.
శ్రీ సాయి పనె్నండు సంవత్సరాలపాటు తపస్సుచేసుకున్న భూగృహం కూడా ఇక్కడి వేపచెట్టు కిందనే ఉంది. ఇది బాబాగారి గురుస్థానం. కాబట్టే దీనిని గురుస్థానంగా వ్యవహరిస్తారు. ఇది ఈ వేపచెట్టు కింద ఉంది. ఇది మహత్తర మహిమగల వేపచెట్టు. దత్తావతారములు ఏ కొమ్మ కింద కూర్చున్నారో ఆ కొమ్మ ఆకులు చేదుగా ఉండవు. ఈ వేప చెట్టు కింద ఉన్న గృహం మసీదులోని ధుని వరకు ఉన్నట్టు ఒక సందర్భంలో బాబాయే చెప్పారు.
ఈ గురుస్థానంలో కనిపించే శివలింగం బాబా ప్రతిష్ఠించినదే. ఆ లింగం వెనుక ఉన్న బాబా చిత్రపటాన్ని ఆనాటి సాయిభక్తులు ఏర్పాటుచేసినదే. గురుస్థానం చుట్టూ ప్రదక్షిణలుచేస్తే సకల కోరికలు తీరుతాయి.
ద్వారకామాయి (మసీదు)
బాబా శిరిడీ వచ్చినప్పటినుంచి సమాధి చెందేవరకు అరవై సంవత్సరాలపాటు ఈ మసీదులో నివసించారు. అసంఖ్యాక భక్తులకు ఇక్కడే బాబా తన అనుగ్రహాన్ని ప్రసాదించారు. బాబా కూచున్న రాయి ఇక్కడే ఉంది. అంతేకాదు బాబా ప్రజ్వలించిన ధుని ఇక్కడే అఖండంగా వెలుగుతోంది. భక్తుల కోర్కెలను తీర్చటంకోసం బాబా అప్పట్లో ఈ ధుని నుంచే వారికి ఊదీనిచ్చేవారు. ఇప్పుడు కూడా భక్తులకు ఇచ్చే ఊదీ ఈ ధునినుంచే లభిస్తోంది. బాబా ఇక్కడ అన్నం వండి భక్తులకు అన్నదానం చేసేవారు.
ఇక్కడ ధుని నుంచి లభించే విభూది (ఊదీ) సర్వార్థసాధకమైనది. సంస్థానంవారు ఇక్కడే సాయి పాదుకలను ఏర్పాటుచేశారు. ప్రపంచంలో ఎక్కడా లభించని ప్రశాంతత ద్వారకామాయిలో లభిస్తుంది. సమాధి మందిరానికి పక్కనే ద్వారకామాయి ఉంది. ద్వారకామాయిలో చూడాల్సినవి చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి...
1. బాబా కూర్చున్న రాయి, 2. బాబా ఉపయోగించిన పొయ్యి (దీనిపైనే బాబా స్వయంగా వంట చేసి అన్నదానం చేసేవారు), 3. పల్లకి, 4. ధాన్యం సంచి, 5. ధుని, 6. తిరుగలి, 7. నింబారు (గూడు), 8. నింబారువద్ద గల అయిదు దీపాలు, 9. మంచినీటి కుండ, 10. మట్టి మూకుడు (దీనినే కొళంబా అని కూడా అంటారు. ఇందులోనే బాబా శిరిడీ వీధుల్లో భిక్షగా సేకరించి తెచ్చిన ఆహార పదార్థాలను ఉంచేవారు), 11. తులసి మొక్క, 12. బాబా స్నానానికి ఉపయోగించిన రాయి, 13. బాబా కూర్చోవటానికి ఉపయోగించిన రాయి, 14. ధునికి సమీపంలో బాబావారి పాదుకలు, 15. ధునికి ఎదురుగా బాబా ఉపయోగించిన పెద్ద పాదుకలు (ఈ పాదుకల స్థానంలోనే గంగ, యమునలు ఉద్భవించాయని ప్రతీతి). వీటిని చూసినంతనే సాయి రూపం మనసులో లీలగా మెదులుతుంది. ద్వారకామాయిలోని ప్రతిచోటా సాయి రూపమే సాక్షాత్కరిస్తుంది.
చావడి
రోజువిడిచి రోజు బాబా ద్వారకామాయి నుంచి ఇక్కడకు ఊరేగింపుతో వచ్చి నిద్రించేవారు. సమాధి మందిర పరిసరాల్లో తూర్పువైపున చావడి ఉంది. ప్రతి గురువారం రాత్రి 9.15నుంచి పది గంటల వరకు ద్వారకామాయి నుంచి చావడి వరకు ఊరేగింపు జరుగుతుంది.
ఈ పల్లకీలో బాబా చిత్రపటం, సట్కా, పాదుకలు పెడతారు. పల్లకీని మేళ తాళాలతో, భజనలతో ద్వారకామాయి నుంచి చావడికి ఊరేగింపుగా తీసుకువస్తారు. చావడి ఎదుట రంగవల్లులను తీర్చిదిద్ది ఆ పల్లకీని అక్కడ దింపి కార్యక్రమం జరుపుతారు. పల్లకీ ఉత్సవాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అదొక అపూర్వ అనుభూతి. సాయి భక్తులు తప్పక చూడాల్సిన ఉత్సవమది.చావడికి తూర్పుభాగంలో ఉత్తరంవైపున శ్రీ సాయి నిద్రించేవారు. కాబట్టి ఆ భాగంవైపు స్ర్తిలకు ప్రవేశము నిషిద్ధం. స్ర్తిలు అటు దిక్కుగా పోరాదు. ఇక రెండో భాగమైన పడమరవైపు బాబాకు భక్తులు సమర్పించిన బల్ల, కుర్చీ ఉన్నాయి. ఆ రెండింటినీ బాబా తాకి పవిత్రం చేశారు. అయితే, వాటిని బాబా ఉపయోగించలేదు. బాబా మహాసమాధి చెందాక బాబా దేహాన్ని ఈ బల్లపైనే ఉంచి స్నానం చేయించారు. పల్లకీ ఉత్సవం జరిగేటపుడు ఆ బల్లపైనే పల్లకీని ఉంచుతారు. అపుడు అందరూ ఆ బల్లకు నమస్కరిస్తారు. ఎందరో భక్తులు చావడిలో కూర్చుని సాయి సచ్చరిత్రను పారాయణం చేసి పునీతులవుతుంటారు.
- ఇంకావుంది...

సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566