సబ్ ఫీచర్

విశేష ఫలదాయని కార్తికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక దీపావళి అమావాస్య దాటగానే కార్తికం వస్తుంది. కార్తికం శివునికి పరమ ప్రియమైంది. ‘కార్తిక దామోదర ప్రీత్యర్థం’ అంటూ కార్తికంలో ఏకార్యం చేసినా ఆ కార్యఫలితం పరమోన్నతమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. కార్తికం వనభోజనాలకు, దీపతోరణాలకు ప్రసిద్ధి. ఉసిరిక ఫలం పైన ఆవునేతిదీపం వెలిగించి పెట్టి దానం చేస్తే ఎంతో పుణ్యదాయకం. సూర్యోదయానికి ముందుగానే నక్షత్రాలు ఉన్నపుడే తులసి, మారేడు, ఉసిరిక చెట్ల దగ్గర దీపాలను పెట్టడం ఈ మాస విశేషం. నెలంతా ఏకభుక్తం చేస్తారు. నేల, లేదా చాపమీద శయనిస్తారు. సాత్వికాహారాన్ని తీసుకుంటారు. ఈ కార్తికం మహా విష్ణుమూర్తికీ అత్యంత ప్రీతికర మాసం. ఈ మాసంలోనే ఏకాదశినాడు మహావిష్ణువు మేల్కాంచుతాడు. ద్వాదశినాడు తులసివనంలోని తన దేవేరిని చూడడానికి వేంచేస్తాడు. అందుకని సమస్త దేవగణమంతా తులసివనంలో ద్వాదశినాడు మహావిష్ణువు దర్శనార్థం వస్తారు. మహావిష్ణువుప్రీతికోసం ద్వాదశీ వ్రతాన్ని ఆచరించి పాలకడలిలో నిద్రించే విష్ణుమూర్తికి పాలాభిషేకాలు చేస్తారు.క్షీరాబ్దిద్వాదశీ వ్రతం అని ద్వాదశినాడుతులసీ వివాహ మహోత్సవాన్ని జరుపుతారు.
శ్లో ఓమ్ విష్ణుప్రియే మహామాయే కాలజాల విధారిణీ!
తులసీమాం సదా రక్షమా..... ఈ మంత్రాన్ని ఉచ్చరించుచూ తులసీ వ్రతాలు ఆచరిస్తారు.
ఈ మాసంలో శివుని మారేడు దళాలతో- జిల్లేడు పూలతోనూ పూజించాలి. శ్రీ మహావిష్ణువును తులసీ, జాజి పూవులతో పూజించాలి. ఇలా పూజించిన వారికిశివ విష్ణుసాయుజ్యం లభ్యమవుతుంది.
అన్ని దేవాలయాల్లో రుద్రాభిషేకాలు, విశేష అర్చనలు, నమకచమకాలతో శివపూజలు చేస్తుంటారు. కార్తికంలో నదులూ చెరువులు- బావుల నీరు తేటపడి సూర్యరశ్మి ప్రసారంవలన తేజస్సునూ, బలాన్ని సంతరించుకొని ఉంటాయ. అంతేకాక ఈ నీటిని హంసోదకం అంటారు. కృష్ణ యజుర్వేదం ప్రకారం నదీ ప్రవాహంలో ఓషధుల సారం ఉంటుందని వీటిలో స్నానం చేసిన వారు మానసిక రుగ్మతలు పైత్య ప్రకోపాలు దూరం అవుతాయని కృష్ణ యజుర్వేదం తెలుపుతుంది.
ఈ హంసోదకం స్నానపానాదులకు అమృత తుల్యమని మహర్షి చరకుడు చెప్పాడు. నదులు ప్రవహించే వేళ ఆ నీటిలో తెలియకుండా విద్యుత్ శక్తి ఉంది. అది శరీరానికి శక్తినిస్తుంది. మూడు దోసిళ్ల నీరు తీసికొని తీరానికి చల్లి, తరవాత బట్టలను పిండుకోవాలి. దీనినే ‘యక్షతర్పణం’ అంటారు. పొడి వస్త్రాలు ధరించి సంధ్యావందనం చేస్తారు. అగస్త్య నక్షత్రం ఉదయించడంవలన ఈ తులామాసంలో గోష్పాదమంత జల ప్రదేశంలో అనంత శయనుడైన విష్ణువు నివసించి ఉంటాడని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయ. అందుకే సూర్యోదయంకాకముందే నదీ స్నానం చేయాలి అంటారు. వీలు లేనివారు కూడా ఎక్కడైనా సరే సూర్యోదయానికి పూర్వమే స్నాన సంధ్యలు చేయాలి.
‘‘సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖావహం’’... అంటూ చేసే దీపప్రజలనం సర్వశుభాలను ఇస్తుంది. దీపదానం చాలా శ్రేష్టం. ఈ మాసంతో వెండితోకాని, బంగారం తోకాని, చివరకు మట్టి ప్రమిదల్లో కాని దీపం దానం చేయాలి. ఉసిరిక ఫలాలపై నేతిదీపాలను వెలిగించి సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఏ దానం ఇచ్చినా ఈ మాసంలో శివుడు అధికమైన ఫలాలను ప్రసాదిస్తాడు. చెరువుల్లో, నదుల్లో, ఆఖరికి కుంటల్లోను కూడా దీపాలను వదులుతారు. సూర్యో దయానికి పూర్వం, సూర్యాస్తమయ సందర్భంలోనూ ఆకాశదీపాలు వెలిగించటం కార్తిక విశేషాల్లో మరొకటి. శివాలయంకాని, విష్ణవాలయం కాని లేని ఊరులో తులసికోట వద్ద కర్రపాతి ఆకాశదీపం పెట్టినా సర్వశుభాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు. కార్తిక సోమవారంనాడు గోధుమపిండితోగాని, వరిపిండితో గాని ప్రమిదను చేసి ఆవునేతితో దీపారాధన చేసి దానిని దక్షిణతాంబూలాలతో సత్ఫురుషునకు దానంచేస్తే శివలోకప్రాప్తి కలుగుతుందని శివపురాణం చెబుతుంది.
కార్తిక సోమవారం లేదా ఒక్కరోజైనా ఉపవాసం ఉండి దీపారాధన చేస్తే కైలాసం లభిస్తుందని కార్తీక పురాణవచనం. కృష్ణ పక్ష త్రయోదశినాడు నవగ్రహారాధన చేయడం వల్ల గ్రహదోషాలు తొలగుతాయి. ఈ మాస శివరాత్రి నాడు చేసే ఈశ్వరార్చన, అభిషేకాలు, అపమృత్యు దోషాలను, గ్రహభాధలను తొలగిస్తాయి. ఈ మాసంలో ప్రతిరోజూ పుణ్యప్రదమైనదే. కార్తిక శుద్ధ పాడ్యమి నుండి బహుళ అమావాస్య వరకు చేసిన దీపారాధన వల్ల అనంతమైన సౌఖ్యాలు లభిస్తాయని కార్త్తిక పురాణం చెబుతుంది. సోమవారాలు ఏకాదశి, ద్వాదశి పౌర్ణమి అత్యంత పుణ్యసమయాలు. ఈరోజుల్లో చేసిన ఏ దానమైనా విశేషపుణ్యాన్ని దరిచేరుస్తుంది.

- జంగం శ్రీనివాసులు