సబ్ ఫీచర్

భక్తి మార్గమే ముక్తికి మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిరిడీలో జరిగే ముఖ్య ఉత్సవాలు
శ్రీ సాయిబాబా సంస్థానం జరిపించే కార్యక్రమాల్లో శ్రీరామనవమి, గురుపూర్ణిమ, విజయదశమి(బాబావారి పుణ్యతిథి)... ఈ మూడూ ముఖ్యమైన ఉత్సవాలు. ఈ ఉత్సవాల్లో ముఖ్యమైనరోజున సమాధి మందిరాన్ని రాత్రంతా భక్తుల దర్శనార్థం తెరిచే ఉంచుతారు. ఉత్సవ కాలంలో కీర్తన, భజన, ప్రవచనం మొదలైన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. శ్రీరామనవమి ఉత్సవం చైత్రశుద్ధ అష్టమినాడు ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ నవమి ఈ ఉత్సవంలో ముఖ్యమైన రోజు. చైత్రశుద్ధ దశమి ఈ ఉత్సవానికి ముగింపురోజు. గురుపూర్ణిమ ఉత్సవం ఆషాఢ శుద్ధ చతుర్థినాడు ప్రారంభమవుతుంది. ఈ ఉత్సవం కూడా మూడురోజులపాటు జరుగుతుంది. విజయదశమి అంటే బాబావారి పుణ్యతిథి ఉత్సవం. 1.అష్టమి, నవమి లేదా నవమితోపాటు దశమివస్తే అష్టమి ప్రారంభ దినం, నవమితోపాటు దశమి ముఖ్యమైన రోజుగాను, ముగింపురోజు ఏకాదశి వస్తే అప్పుడు ద్వాదశిని ముగింపు రోజుగానూ చేస్తారు. 2. ఇతర రోజుల్లో (సందర్భవశాన) నవమి ప్రారంభ దినంగా వస్తే దశమి ముఖ్యమైన రోజు అవుతుంది.
గోధుమలు విసురుటలోని వేదాంత తత్వం
సాయితత్వం తెలుసుకోవాలంటే అసలు సాయి ఎవరు? అనేది తెలుసుకోవాలి? సాయి శిరిడీలో తాను నడయాడిన అరవై సంవత్సరాలు ఏం చేశారో తెలుసుకోవాలి. బాబాగారి వింత లీలలు, చర్యలు చదివిన వారి మనసునకు ఆనందాన్ని కలిగిస్తాయి. బాబా బోధనలు భక్తుల ఆధ్యాత్మిక సాధనకు ఉపకరిస్తాయి. అవి పాపాలను పోగొడతాయి. సాయిబాబా దర్శనంవల్ల కానీ, సచ్చరిత్ర పారాయణంవల్ల కానీ కలిగే చిత్రమేమంటే, మనసులో ఉన్న ఆలోచనలు మారిపోతాయి. వెనుకటి కర్మల బలం తగ్గిపోతుంది. క్రమంగా ప్రపంచమందు విరక్తి కలుగుతుంది. మన పూర్వజన్మ సుకృతంవల్లే సాయి దర్శనం లభిస్తుంది. సాయిబాబాను చూసినంత మాత్రానే ఈ ప్రపంచమంతా సాయిబాబా రూపం వహిస్తుంది. భక్తి, జ్ఞానం, నిర్వ్యామోహం, ఆత్మశరణాగతి, ఆత్మసాక్షాత్కారం మొదలగు విషయాల సమ్మిళితమే శ్రీసాయి తత్వం. శ్రీ సాయి శిరిడీలో నడయాడిన అరవై సంవత్సరాలలో తిరుగలి విసురుతూనే ఉన్నారు. శిరిడీవాసులు బాబా తిరుగలి చూసి అదో కాలక్షేపం కార్యక్రమం అనుకునేవారు. హేమాడ్‌పంతు బాబాను చూడటంకోసం తొలిసారిగా శిరిడీ వెళ్లినపుడు కూడా బాబా తిరుగలి విసరటాన్ని చూసి అలాగే అనుకున్నాడు.
శ్రీ సాయి సచ్చరిత్రలో
మొదటి కథ-
బాబా తిరుగలి విసరిన ఉదంతమే. బాబా మొదట ఒక గోనె పట్టాను నేలపై పరిచేవారు. తిరుగలిలో గోధుమలువేసి వాటిని పిండి చేసేవారు. ఆ పనిని బాబా ఎంతో శ్రద్ధగా చేసేవారు. ఒకనాడు బాబా గోధుమలు విసురుతుండగా నలుగురు మహిళలు వచ్చి బాబాను పక్కకునెట్టి, వారే గోధుములను విసరటం, పిండిని నాలుగు భాగాలు చేసుకుని నలుగురూ పంచుకోవటం, బాబావారి దుశ్చర్యను గ్రహించి వారిపై కేకలువేసి ఆ పిండిని శిరిడీ గ్రామం నాలుగు మూలలా చల్లి రమ్మనిన లీల గురించి అందరికీ తెలిసిందే. ఇదంతా చూసిన హేమాడ్‌పంతు బాబా గోధుమలను విసరటంలోని రహస్యం ఏమిటని అడుగుతాడు. శిరిడీలో వ్యాపించిన కలరా వ్యాధిని రూపుమాపేందుకే బాబా గ్రామ పొలిమేరల్లో గోధుమల పిండిని చల్లించారని వారు చెబుతారు.
బాబా తిరుగలి విసరటం గురించి శిరిడి ప్రజలు భావిస్తున్నట్టేకాక దానిలో ఇంకో వేదాంతభావం కూడా ఉంది. సాయిబాబా శిరిడీలో సుమారు అరవై ఏళ్లు నడయాడారు.
ఆ కాలమంతా బాబా తిరుగలి విసురుతూనే ఉన్నారు. అయితే, నిత్యం మసీదులో కూర్చుని బాబా విసిరినవి గోధుమలు కావు. భక్తుల పాపాలు, మనోవిచారాల్ని. వాటిని బాబా పిండి చేసి కర్మధ్వంసం చేశారన్న మాట. ఇందులో ఇమిడి ఉన్న ఇంకో వేదాంత రహస్యం ఏమిటంటే- తిరుగలి కింది రాయి కర్మ, పై రాయి భక్తి, చేతితో పట్టుకునే పిడి జ్ఞానం. జ్ఞానోదయం కలగాలన్నా, ఆత్మసాక్షాత్కారం పొందాలన్నా మొట్టమొదట పాపాలను, కోరికలను తుడిచివేయాలి. అటుపై త్రిగుణ రాహిత్యం పొందాలి. అహంకారాన్ని చంపుకోవాలి. బాబా గోధుమలు విసరటంలోని వేదాంత రహస్యం అదే!
ఈ ఉదంతం చదవగానే కబీరు కథ జ్ఞప్తికి వస్తుంది. ఒకనాడు స్ర్తి ఒకామె తిరుగలిలో ధాన్యం వేసి విసురుతోంది. దానిని చూసి కబీరు ఏడవసాగాడు. నిపతి నిరంజనుడను ఒక సాధుపుంగవుడు అది చూసి ఎందుకు ఏడుస్తున్నావని కబీరును కారణం అడిగాడు. అపుడు కబీరు ఇలా చెప్పాడు. ‘‘నేను కూడా ఆ ధాన్యం మాదిరిగా ప్రపంచమనే తిరుగలిలో విసురబడెదను కదా?’’ అని చింతించాడు. దానికి నిపతి నిరంజనుడిలా బదులిచ్చి కబీరుకు ధైర్యం చెప్పాడు.
‘‘్భయం లేదు! తిరుగలి పిడిని గట్టిగా పట్టుకో. అనగా జ్ఞానాన్ని విడువకు. నేను ఎలా గట్టిగా పట్టుకున్నానో నువ్వు కూడా అలాగే చెయ్యి. మనసును కేంద్రీకరించు. దానిని చలించనివ్వకు. అంతరాత్మను చూడాలంటే దృష్టిని అంతర్ముఖం కానివ్వు. నువ్వు తప్పక రక్షిపబడతావు.’’
ఇంకావుంది...
================================================================
సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566