సబ్ ఫీచర్

చేతల కన్నా ఆచరణే మిన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిరిడీలో రోహిలా ఉండేవాడు. భారీ ఆకారుడైన అతను గట్టిగా మాట్లాడితే ఆంబోతు రంకె వేసినట్టుండేది. అతనికి అల్లా అంటే మహాభక్తి. కానీ, ఏం లాభం?. భగవంతునిపై దృష్టి పెడదామంటే క్షణమైనా ఏకాగ్ర కుదిరేది కాదు. బుద్ధి వక్రించి దెయ్యాల వంటి చెడు తలంపులు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసేవి. మనసును భగవంతునిపై నిరంతరం లగ్నం చేయటానికి మసీదులో కూర్చుని ఖురాన్‌లోని కల్మానును గట్టిగా చదివేవాడు. అలా చేయటం ద్వారా చెడు తలంపులు మనసులోకి రాకుండా ఉంటాయనేది అతని నమ్మకం.
అయితే, అతని ఖురాన్ పఠనం శిరిడీవాసులకు మాత్రం కంపరం కలిగించేది. పగలంతా కాయకష్టం చేసి రాత్రికి కంటినిండా నిద్రపోయే ఆ కష్టజీవులు రోహిలా అరుపులతో బెంబేలెత్తేవారు. ఒకసారి వారంతా సాయిబాబావద్దకు వెళ్లి రోహిలా గురించి ఫిర్యాదుచేశారు. విచిత్రంగా బాబావారిపైనే కేకలు వేశారు. బాబా వారితో ఇలా చెప్పారు. రోహిలాకు ఒక దౌర్భాగ్యపు భార్య ఉంది. అది అతనిని కుదురుగా ఉండనివ్వటం లేదు. దాని బారినుంచి తప్పించుకునేందుకు రోహిలా అలా గట్టిగా అరుస్తూ కల్మానును చదువుతున్నాడు. మంచికోసం తన ప్రయత్నం ఏదో తాను చేస్తున్నాడు. సహకరించాలి కానీ, అతనిపైనే ఫిర్యాదు చేస్తారా?’ అంటూ బాబా వారికి నచ్చజెప్పాడు. నిజానికి రోహిలాకు వివాహం కాలేదు. బాబా అతని భార్య అన్నది అతనిలోని దుర్బుద్ధిని ఉద్దేశించి. దుర్బుద్ధులు, చెడు ఆలోచనలు మనసును కుదురుగా ఉండనివ్వవు.
అటువంటి ఆలోచనలు కలిగినపుడు దైవ నామస్మరణ వైపు మనసును మరలించాలి. మనసును ఏకాగ్రం చేసుకోవటంకోసం చేసే ప్రయత్నాలకు భగవంతుడు సహకరిస్తాడనేందుకు పై ఉదాహరణ నిదర్శనం.
మన జీవితంలో ఎప్పుడేది జరగాలో, ఎప్పుడేం చేయాలో అన్నీ ముందుగానే నిర్ణయిమైపోయి ఉంటాయి. ఆ ప్రకారమే ఆయా పనులు జరుగుతాయి. ఆ ప్రకారమే మన ప్రవర్తన ఉంటుంది. మనం కొన్ని పనుల్ని కొన్ని సమయాల్లో చెయ్యవచ్చు. కొన్ని పనుల్ని అనువుకాని సమయంలో అసలు చెయ్యకూడదు. అలాగే ఒక పనిని మాత్రం ఏ సమయంలోనూ చేయనే చెయ్యకూడదు. ఇంతకీ ఆ పనేమిటి? అదే పాపకర్మ.
ఇతరుల్ని శారీరకంగా, మానసికంగా హింసించటం, సాధించటం, అనవసరంగా ఆడిపోసుకోవటం, నోరుపారేసుకోవటం, చాడీలు చెప్పటం... ఇటువంటివన్నీ పాపకర్మలే. ఈ పనులు చేస్తే మనం స్వయంగా చేజేతులా పాపాన్ని కొని తెచ్చుకున్నట్టే. మన ప్రవర్తనతో, తీరుతో ఎదుటివారి మనసు నొప్పించినా, మనం మోపిన నిందల కారణంగా ఎదుటివారు బాధపడినా ఆ పాపం మనల్నే చుట్టుకుంటుంది. కొన్ని సందర్భాల్లో మనం చేసే పనులవల్ల ఎదుటివారి జీవితాలు దుర్భరమైపోతాయి. కాబట్టి పాపపు పనుల్ని ఏ సమంలోనూ చేయకూడదు.
పాపాలు మూడు రకాలు. అవి- మానసికం, వాచికం, కాయకం. ఎదుటివారి గురించి మనం చెడుగా తలుచుకున్నా, వారి ఎదుగుదలను ఓర్వలేక అసూయ, ద్వేషాలను పెంచుకోవటం వంటివన్నీ మానసిక పాపాల కిందకు వస్తాయి. వాచిక పాపాలంటే మాటల ద్వారా చేసేవి. తిట్టటం, పరనిందకు పాల్పడటం, లేనిపోని నిందలు వేయటం వంటివన్నీ వాచిక పాపాలు. అంటే ఇటువంటి పాపాల్ని నోటి ద్వారా చేస్తుంటాం. శారీరక బలాన్ని ఉపయోగించి చేసేవి కాయక పాపాలు. అంటే ఎదుటి వారిని దండించటం, దౌర్జన్యాలకు పాల్పడటం, దాడి చేయటం, చేయి చేసుకోవటం వంటివన్నీ ఈ పాపాల కిందకు వస్తాయి. పాపం ఏ రకమైనదైనా పాపమే. నిప్పును ముట్టుకుంటే కాలకుండా ఉండదు. అలాగే పాపం చేస్తే దాని ఫలితం అనుభవించకుండా తప్పించుకోలేం. దానికి నిష్కృతి లేదు.
మనం చేయదగ్గ పనుల్లో ఏదైనా ఉత్తమోత్తమైనది ఉందీ అంటే అది ఎలాంటి దైన్యం లేకుండా ఉండటమే. దైన్యమంటే నిరంతరం అసంతృప్తితో జీవితాన్ని గడపటం. ఏదో బాధ, ఇదీ అని చెప్పలేని అసంతృప్తి దీనుడి ముఖంలో ఎప్పుడూ దోబూచులాడుతుంటాయి. ఎప్పుడూ ఉసూరుమంటూ ఉండే ఇటువంటి వారు జీవితాన్ని చేజేతులా నిస్సారం చేసుకుంటారు. ఇటువంటి దైన్యాన్ని జీవితంలోకి ప్రవేశించనివ్వకుండా చేసే ప్రయత్నం కూడా సత్కర్మ అనిపించుకుంటుంది. ఎటువంటి దైన్యం లేకుండా గడిపే జీవితమే దివ్యమైన జీవితం. మనిషి తన జీవితంలో కోరుకోవాల్సినవి సిరిసంపదలు కావు. అంతకంటే ముఖ్యమైనవి రెండు ఉన్నాయి. ఒకటి- అనాయాస మరణం. రెండు దైన్యం లేని జీవితం గడపటం. ఈ రెండే జీవితాన్ని ధన్యం చేసే, సుఖప్రదం చేసే సాధనాలు.
అలాగే ఏ సమయంలోనూ పాపాలు ఎలా చేయకూడదో సర్వకాల సర్వావస్థల్లోనూ చేయదగిన పనులు మూడు ఉన్నాయి. అవి ఒకటి- స్నేహం. ఇది ద్వేషాన్ని పోగొడుతుంది.

--------------------------------------------------------------------------------------------------------------
సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566