సబ్ ఫీచర్

ప్రశాంతి నిలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి పట్టణంలో సత్యసాయి ఏర్పాటు చేసిన ఆశ్రమం పేరే ప్రశాంతి నిలయం. సత్యసాయి ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క కులానికో ప్రాధాన్యత ఇవ్వలేదు. అన్ని కులాలు, అన్ని మతాలు సమానమేనని ప్రకటించారు. సత్యం, ధర్మం, శాంతి, పేమ, అహింస అనే మానవతా విలువల ఆధారంగా అందరి మధ్య సత్సంబంధాలు నెలకొనేలా చేశారు.
ప్రశాంతి నిలయం నిజంగానే ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతోంది. ఆశ్రమంలో ప్రధానంగా ఉన్న వాటిలో యజుర్ మందిరం, ప్రశాంతి మందిరం. సాయి కుల్వంత్ హాలు తదితరాలను చెప్పుకోవాలి. ప్రశాంతి నిలయంలో సత్యసాయి నివాసం ఉండే భవనానికి ‘యజుర్ మందిరం’ అని పేరు. ‘యజుర్ మందిరం’లో భగవాన్ సత్యసాయి ఎవరినైనా ప్రత్యేకంగా కలిసేందుకు అవకాశం ఇచ్చేవారు. సత్యసాయి శివైక్యం చెందిన తర్వాత కూడా ఈ భవనాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. సాయి ఇక్కడే ఉన్నారన్న భావన భక్తుల్లో కనిపిస్తోంది.
యజుర్ మందిరం పక్కనే ప్రశాంతి మందిరం ఉంది. ప్రశాంతి మందిరంలోనే సత్యసాయి ప్రవచనాలు మొదట్లో జరిగేవి. దీన్ని 1950లో నిర్మించారు. తర్వాత దీనిని ఆధునీకరించారు. ఇది పరమపవిత్రమైన స్థలంగా భావిస్తారు. రోజూ భక్తులను ఈ హాల్‌లోకి అనుమతిస్తారు. ప్రశాంతి మందిరాన్ని ఆనుకునే సాయి కుల్వంత్ హాల్ నిర్మించారు. ఇది అత్యంత అద్భుతమైన కట్టడం. దాదాపు 20 వేల మంది కూర్చోవడానికి వీలుగా ఉంది. సత్యసాయి ఉన్నంత కాలం సాయికుల్వంత్ హాల్‌లో భక్తులకు దర్శనం ఇచ్చేవారు. హాల్‌లో కూచుని ఉండే భక్తుల మధ్యకు నేరుగా వచ్చి ఆప్యాయంగా, ప్రేమతో పలకరించేవారు. ప్రస్తుతం ఈ హాల్ పవిత్రత అలాగే సాగుతోంది. రోజూ వేదపఠనం, భజనలు సాగుతున్నాయి. సత్యసాయి జీవించి ఉండగా కూర్చుని ఉండే ప్రాంతంలోనే ఆయన సమాధి పాలరాతితో నిర్మించారు. ఈ సమాధి పరమపవిత్రమైన ప్రాంతంగా అంతా భావిస్తున్నారు. సాయి కుల్వంత్ హాల్‌కు ఉత్తర భాగంలో ఉన్న గేట్ వద్ద హనుమత్‌సమేత సీతారామ లక్ష్మణుల తెల్లని చలువరాతి విగ్రహాలను సత్యసాయి 1999 సెప్టెంబర్ 30 న ప్రతిష్టించారు.
ప్రశాంతి నిలయంలో ప్రధాన ఆడిటోరియం పేరే ‘పూర్ణచంద్ర సభా మండపం’. 1972 లో దీన్ని నిర్మించారు. 15 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఉంది. ఈ సభా మండపం పైకప్పులో భగవంతుడి వివిధ అవతారాలను, పావన పురుషులు, మహర్షుల వర్ణ చిత్రాలతో అలంకరించారు. వివిధ మతాలకు చెందిన ప్రవక్తల శిల్పాలు, కుడ్య చిత్రాలు ఈ మండపంలో ఉన్నాయి. సభలు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం దీన్ని వాడతారు.
పూర్ణచంద్ర ఆడిటోరియానికి దక్షిణం వైపు ‘సర్వధర్మస్తూపం’ 1975 లో నిర్మించారు. 50 అడుగుల ఎత్తులో ఉన్న ఈ స్థూపం సర్వమతాల తత్త్వాలను చాటుతోంది. సత్యసాయి సేవాసంస్థల రెండో ప్రపంచ సమ్మేళనాల సందర్భంగా ఈ స్తూపాన్ని ఆవిష్కరించారు. అన్ని మతాలు సమానమేనని చెప్పేందుకే స్వామి దీన్ని నిర్మించారు.
ప్రశాంతి నిలయంలో గణేశమందిరం, సుబ్రహ్మణ్య మందిరం, గాయత్రి మందిరం, వరలక్ష్మీ మందిరం ఉన్నాయి. భక్తులు రోజూ ఈ మందిరాల్లో పూజలు నిర్వహిస్తుంటారు.
ప్రశాంతి నిలయంలోకి వెళ్లేందుకు ప్రధానంగారెండు గేట్లు ఉన్నాయి. ప్రశాంతి నిలయానికి వచ్చే భక్తులు ఉండేందుకు గెస్ట్‌హౌజ్‌లు, కుటీరాలు, హాళ్లు ఉన్నాయి. వీటిని భక్తులకు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కౌంటర్లలో భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే భోజనాలకోసం సౌత్ ఇండియన్ క్యాంటీన్, నార్త్ ఇండియన్ క్యాంటీన్, విదేశీభక్తులకు ప్రత్యేకంగా వెస్టర్న్ క్యాంటీన్ ఉన్నాయి. తాగునీరు, మరుగుదొడ్లు తదితర వౌలిక వసతులు అడుగడుగునా ఏర్పాటు చేశారు. భక్తులు రోజువారీగా ఉపయోగించుకునే వస్తువులను విక్రయించేందుకు భారీ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. దీన్ని భారీ సూపర్‌మార్కెట్‌గా పిలవవచ్చు. ప్రశాంతి నిలయంలో బేకరీలు, టీస్టాళ్లు ఉన్నాయి.
సత్యసాయిసమాధి దర్శనానినికి రోజూ వచ్చే భక్తులకు ఉచితంగా భోజన సౌకర్యం కల్పించారు. మధ్యాహ్నం, రాత్రి కూడా ఉచిత భోజనం లభిస్తోంది. దర్శనానికి వెళ్లని వారికి తక్కువ ధరలకే ఆహారం అందిస్తున్నారు. కేవలం ఆరు రూపాయలకే టీ, కాఫీ, టిఫిన్లు అందిస్తున్నారు. పదిరూపాయలకే కడుపునిండా భోజనం పెడుతున్నారు.
పబ్లికేషన్స్ డివిజన్
శ్రీసత్యసాయి సాధనా ట్రస్ట్ పేరుతో పబ్లికేషన్స్ డివిజన్ ప్రత్యేకంగా ఉంది. ఈ ట్రస్ట్ నేతృత్వంలో పుస్తకాల విక్రయం కోసం ప్రశాంతి నిలయంలో వేర్వేరు స్థలాల్లో కేంద్రాలు ఉన్నాయి. సత్యసాయి జీవిత చరిత్రతోపాటు అనేకరకాల పుస్తకాలు, ఫోటోలు, ఆడియోలు, వీడియోలు విక్రయిస్తారు. ‘సనాతన సారథి’ పేరుతో మాసపత్రిక వెలువడుతోంది. సనాతన సారథి తెలుగు, ఇంగ్లీష్, అస్సామీస్, బెంగాలీ, గుజరాతి, హిందీ, కన్నడం, మళయాళం, మరాఠీ, ఒరియా, నేపాలీ, సింధీ, తమిళం తదితర భాషల్లో ప్రింట్ అవుతోంది.

ప్రశాంతి నిలయానికి సంబంధించి మూడు వెబ్‌సైట్లు పనిచేస్తున్నాయి. అవి

(1) www.sssbpt.org,
(2) www.srisathyasai.org.in
(3) www.radiosai.org.
భక్తులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయం ఉంది. వికలాంగుల కోసం వీల్‌చైర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రశాంతి డిజిటల్ స్టూడియోను ఏర్పాటు చేశారు. సాయి ప్రసంగాలను ఆడియో, వీడియోల్లో భద్రపరచి, అంతర్జాతీయంగా కూడా అందించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. ఒక లైబ్రరీ, రీడింగ్ రూంలను కూడా ఏర్పాటు చేశారు.
రోజువారీ కార్యక్రమాలు
సాయి కుల్వంత్ హాల్‌లో రోజువారీ కార్యక్రమాలను సత్యసాయి నిర్ణయించారు. నేటికీ ఈ కార్యక్రమాలు యథాతథంగా సాగుతున్నాయి. ఉదయం 5.10 గంటలకు ఓంకారం, మెడిటేషన్, సుప్రభాతం ఉంటాయి. 5.40 గంటలకు వేదపఠనం, నగర సంకీర్తన ఉంటుంది. 6.30 గంటల నుండి 7.30 గంటల వరకు భజన హాలు అంతరమందిరంలో పూజ జరుగుతుంది. కుశ్వంత్ హాల్‌లోకి భక్తులను అనుమతిస్తారు. ఈ హాల్‌లో ఒకవైపు మహిళలు, మరోవైపు పురుషులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. 8 గంటల నుండి 9 గంటల వరకు వేద పఠనం జరుగుతుంది. 9 గంటల నుండి 9.30 వరకు భజనలు ఉంటాయి. 9.30 నుండి 10.30 వరకు భగవాన్ మహాసమాధి దర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4.30 నుండి 5.15 గంటల వరకు వేద పఠనం జరుగుతుంది. 5.15 నుండి 6 గంటల వరకు భజనలు జరుగుతాయి. ఉదయం, సాయంత్రం భజనల తర్వాత హారతి ఇస్తారు. 6 గంటల నుండి 7 గంటల వరకు సత్యసాయి మహాసమాధి దర్శనం ఉంటుంది. సాయంత్రం 6 గంటల తర్వాత విదేశీ భక్తులకు ప్రేయర్ హాలులో మెడిటేషన్ ఉంటుంది.
క్యాంటీన్ సమయాలు
సౌత్ ఇండియన్ క్యాంటీన్‌లో ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు టీ, కాఫీ, టిఫిన్లు లభిస్తాయి. మధ్యాహ్న భోజనం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటవరకు లభిస్తుంది. సాయంత్రం 3.30 నుండి 4.15 వరకు టీ, స్నాక్స్ లభిస్తాయి. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 వరకు రాత్రి భోజనం ఉంటుంది. నార్త్ ఇండియన్ క్యాంటీన్‌లో ఉదయం 11.30 నుండి 1 గంట వరకు లంచ్, సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 వరకు డిన్నర్ ఉంటుంది. వెస్టర్న్ క్యాంటీన్‌లో ఉదయం 8 గంటల నుండి 10.30 వరకు బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. మధ్యాహ్నం 12.45 గంటల నుండి 1.30 వరకు లంచ్, సాయంత్రం 7 గంటల నుండి 8.30 వరకు డిన్నర్ లభిస్తుంది.