సబ్ ఫీచర్

మహాజ్ఞాని మదాలస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలర్కుడు ధర్మం తప్పకుండా రాజ్యపాలన ప్రారంభించాడు. ప్రజలను కన్నబిడ్డలవలె భావించాడు. దుష్టులను యధావిధిగా దండించాడు. యజ్ఞయాగాదులు నిర్వహించాడు. ఎన్ని రాజభోగాలు అనుభవించినా అతనికి తృప్తి కలుగలేదు. సంసార సుఖాలపై విరక్తి కలుగలేదు. ఈ విధంగా అలర్కుడు విషయాసక్తుడైపోవడం వనవాసంలో వున్న అన్న సుబాహనికి తెలిసింది. ఏవిధంగానైనా అలర్కుని విషయ వాసనలనుండి విరక్తునిగా చేసి ఆత్మజ్ఞానం కలిగించాలని నిశ్చయించుకున్నాడు. అందుకొక ఉపాయం ఆలోచించాడు. బలవంతుడైన కాశీరాజువద్దకు వెళ్లి తన తమ్ముడు తన రాజ్యభాగం అపహరించాడని, కనుక తన భాగం తనకిప్పించమని కోరాడు. కాశీరాజు అలర్కనిపై దండయాత్రకు సిద్ధమైనాడు. ముందుగా ఒక దూతను పంపి సుబాహుని భాగం ఈయమని వర్తమానం చేశాడు. అన్నగారు తనను వచ్చి అడుగుతే భాగం ఇస్తానని, భయపెట్టి ఈ విధంగా అడిగితే ఇవ్వనని సమాధానం చెప్పాడు. యాచించడం రాజధర్మం కాదని సుబాహుడు కాశీరాజు సహాయంతో అలర్కుని కోట ముట్టడించాడు. గొప్ప మంత్రాంగంతో కాశీరాజు అలర్కుని రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అలర్కుడు దుర్బలుడైనాడు. ధనాగారం ఖాళీ అయింది. నలువైపుల శత్రువులు మోహరించారు. అలర్కునికి అప్పుడేమి చేయాలో తోచలేదు. తల్లి తన మెడలో వేసిన తాయెత్తు గుర్తుకు వచ్చింది. దానిని వెలుపలకి తీసి సూక్షాక్షరాలలో వున్న విషయాలు చదివాడు. అందులో ఇలా ఉంది.
‘‘అన్నివిధాలా సంగం త్యజించడం మేలు. అలా వీలు కాకపోతే సజ్జనుతోనే సంగం పెట్టుకోవాలి. సత్సాంగత్యమే సకల బాధలను నివారించగల దివ్యమైన ఔషధం. అన్నివిధాలా కోరికలను వదలుకోవాలి. అలా వీలుకాకపోతే మోక్షంపైన మాత్రమే కోరిక పెట్టుకోవాలి. మోక్షాసక్తియే కామ వ్యాధికి మందు’’- ఈ వాక్యలు చదివిన అలర్కునికి జ్ఞానోదయం అయింది. మాటిమాటికి వాటిని చదివి సంతసించాడు. శత్రువుల కంట పడకుండా తప్పించుకుని దత్తాత్రేయుని ఆశ్రమానికి వెళ్లి తన దుస్థుతి వివరించాడు. అప్పుడా మహర్షి ‘‘రాజా నీ దుఃఖాన్ని క్షణంలో నివారిస్తాను. ముందు దుఃఖం నీకెందుకు కలిగిందో చెప్పు. నీవు ఎవరికి సంబంధించినవాడవు? దుఃఖం దేనికి సంబంధించింది? నీకు దుఃఖానికి సంబంధం ఏమిటి? ఈ విషయాలు ఆలోచించు అన్నాడు. ఆ మాటలు విని అలర్కుడు తీవ్రంగా ఆలోచించాడు. ఆత్మకు రాజ్యకాంక్ష లేదు. దేహం పంచభూతాత్మకమైనది. కాబట్టి అది జడం. దానికి రాజ్యంతో పనిలేదు. త్రిగుణాత్మకమైన దేహంకంటే నేను భిన్నుణ్ణి. ఆత్మస్వరూపుడనైన నాకు ఈ కర చరణాలతోను రక్తమాంసాదులతోను సంబంధం లేదు. ఇక మిగిలిన వస్తూ వాహనాలతో మాత్రం ఏం సంబంధం ఉంటుంది? నాకు శత్రువులు లేరు, సైన్యం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు. ఇది అంతా మిథ్య. సుబాహువు కాశీరాజు నేను వేరు వేరుగా ఉన్నా వాస్తవిక దశలో మాకు భేదం లేదు. ఉన్నది ఒకే సద్వస్తువు. అదియే అంతటా నిండి ఉంది. ఇలా భావించి దత్తాత్రేయునికి నమస్కరించి మహాత్మా చక్కగా వివరించి చూశాను. నా దుఃఖం అంతా పటాపంచలయింది. సత్యాన్ని గమనించని వారే దుఃఖసాగరంలో మునిగిపోతారు. బాహ్య పదార్థాలపై మమకారం పెంచుకున్నవారే దుఃఖానికి లోనవుతారు. నేను ప్రకృతి కంటె పరుణ్ణి కాబట్టి నాకు సుఖ దుఃఖాలు లేవు అని చెప్పగా దత్తాత్రేయుడు సంతసించి రాజా నీవు చెప్పినది వాస్తవం. మమత్వమే దుఃఖ హేతువు. నేను నిన్ను అడిగిన ప్రశ్నకి నీ మమకారం గాలిలో బూరుగు దూదివలె ఎగిరిపోయింది. తరువాత అలర్కుడు మునీంద్రునితో ఇలా అన్నాడు. మహాత్మా మీ అనుగ్రహంవలన నాకు ప్రకృతి పురుషులను వేరుపరచే జ్ఞానం సిద్ధించింది. కాని విషయ సుఖాలపై పరుగెత్తే మనస్సుకు నిలకడ కుదరడంలేదు. అందుకు తగిన యోగం సెలవివ్వండి అన్నాడు. వెంటనే మునీంద్రుడు ప్రాకృత గుణాలతో సంబంధం వదలి బ్రహ్మలో ఐక్యం పొందడమే ముక్తి. దానికి తగిన సాధనం యోగం. కనుక ముముక్షువు సంగం వదలాలి. మమత్వ భావన తొలగిపోగానే సుఖం లభిస్తుంది. జ్ఞానం వలన వైరాగ్యం సిద్ధిస్తుంది. వైరాగ్యం వలన జ్ఞానం కల్గుతుంది. ఇవి రెండు అన్యోన్యాశ్రయాలు. యోగి తాను ఎక్కడ నివసిస్తాడో అదే అతని గృహం. దేనితో శరీరం నిలుపుకుంటాడో అదే భోజనం. నిష్కామంగా కర్మలు ఆచరిస్తాడు. పుణ్య పాపానుభావంతో కర్మలు అనుభవిస్తాడు. కొత్తగా కర్మఫలాలు ఆర్జించడు. అప్పుడే మోక్షం లభిస్తుంది. దుష్కర్మలవలన అధోగతి తప్పదు. తపన ఆకలి అలసట మనోవ్యాకులత లేని సమయాలలో యోగాన్ని పరిశీలించాలి. చలి వేడిమి గాలి ఎక్కువగా ఉన్న చోట యోగానుష్టానం కుదరదు. వ్ఢ్యౌంతో శాస్త్ర విధి దాటి యోగానికి పూనుకుంటే వివిధ రోగాలు వస్తాయి. ప్రమాదవశాత్తు ఏదైనా వ్యాధి కలిగితే తగిన చికిత్స యోగ పద్ధతిలోనే చేయాలి. ధర్మార్థ కామమోక్షాలకు శరీరమే సాధనం. దానిని రోగాల బారినపడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యోగికి కొన్ని మహిమలు సిద్ధిస్తాయి. వాటిని ప్రకటించకుండా గుప్తంగా ఉంచాలి. లేకపోతే విజ్ఞానం నశిస్తుంది. అచాపల్యం మృదుత్వం ఆరోగ్యం ప్రసన్నత, సౌమ్యత వంటి వియోగుల చిహ్నాలు. ఉత్తమ యోగ సిద్ధుని పట్ల ప్రజలు అనురక్తితో ఉంటారు. పరోక్షంలో అతనిని కీర్తిస్తారు. యోగమార్గంలో పయనించేవారికి విఘ్నాలు ఎదురవుతాయి. వాటిని తట్టుకునేందుకు దృఢమైన మనోనిగ్రహం కావాలి. మనస్సును బ్రహ్మమునందే నిలిపినవారికి విఘ్నాలు దూరమవుతాయి. విఘ్న పరంపర ఎదుర్కోలేనివారు సంసారంలో పడిపోతారు. యోగికి అణిమాద్యష్ట సిద్ధులు కలుగుతాయి కాని వాటివలన నిర్వాణ స్థితి లభించదు. యోగాగ్నితో సమస్త దోషాలు కాల్చివేయాలి. అపుడు యోగి బ్రహ్మలో ఐక్యమవుతాడు. నీళ్లు నీళ్లలో కలిసిపోయినట్లు యోగి బ్రహ్మంలో లీనవుతాడు. తరువాత యోగుల నడవడి ఎలా ఉంటుందో తెలుపవలసినదిగా అలర్కుడు దత్తాత్రేయుని ప్రార్థించాడు. అపుడు ఇలా ఉద్బోధించాడు.
‘‘రాజు సామాన్యులు అవమానాన్ని విషంగాను, సన్మానాన్ని అమృతంగాను భావిస్తారు. కాని యోగి అవమానాన్ని అమృతంగాను, సన్మానాన్ని విషంగాను భావిస్తాడు. జనసమ్మర్థం ఎక్కువగా ఉండే చోటుకుపోడు. ఏకాంతంలో ధ్యాననిష్ఠుడై ఉంటాడు. ఇతరులు తనను తిరస్కరించినా సాధుమార్గం వదలడు. సాత్వికాహారం మితంగా తీసుకుంటాడు. అహింస బ్రహ్మచర్యం త్యాగం మొదలైన వ్రతాలు పాటిస్తాడు. సమస్తము అతనికి ఆత్మమయంగానే కనిపిస్తుంది. అందువలన ఇది ప్రియము అది అప్రియము అన్న భావన యోగికి ఉండదు. సమస్త ప్రాణుల యెడల సమత్వబుద్ధి కలిగి వుంటాడు. శ్రేష్టాతి శ్రేష్టమైన జ్ఞానమార్గం అవలంభించి పునరావృత్తి లేని శాశ్వత స్థానం చేరుకుంటాడు.
(ఇంకా ఉంది)

-వేదుల సత్యనారాయణ 96183 96071