సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1884వ సంవత్సరము నాటికే యాతని యన్వర్థనామము కలకలత్తా నగరమందందంటను వ్యాపింప, నాతనియునికి జన సమూహముల నాకర్షింపసాగెను. ప్రాణాపాయకరమగు స్థితిలోనున్నను, వైద్యులును శిష్యులు నెంత వలదనినను, అఖండ విశ్వమానవ ప్రేమచే నాతడు తన యంత్యదిన పర్యంతము జన సమూహములకు బోధించుచునే యుండెను. ‘‘ఈ శరీర మేమైననేమి? ఒక్క జీవికి సాయమొనర్పగలిగినచో, వేయి పర్యాయములు కుక్కనై పుట్టుటకైన సంసిద్ధుడను’’ అని యాతడు ప్రకటించెను. స్వార్థరాహిత్యమునకు-ప్రేమానురాగములకు ఇంతకంటె పరమవాధి యెద్ది?
శ్రద్ధ్భాక్తులతో ప్రియిశిష్యులు శ్రీరామకృష్ణుని సేవించుచు, ఆతని మహోపదేశములను బడయుచు, ఆత్మ వికాసము నొందసాగిరి. ఈ సమయమున వారల హృదయములందు పాదుకొనిన సోదరభావమే కాలక్రమమున శాఖోపశాఖలతో జగద్వ్యాప్తమై మించిన శ్రీరామకృష్ణ మఠ సేవా సంఘ సంస్థయను మహావృక్షమునకు బీజమై యొప్పెను. సాక్షాత్కరము నొందవలయునను తీవ్ర వాంఛతో గురు సంసేవనమే భగవదారాధనమను విశ్వాసముతో బాలశిష్యులు నరేంద్రనాథు (వివేకానందు)ని నాయకత్వమున శ్రీరామకృష్ణుని సేవించుచుండ, చికిత్సకు వ్యయమును ఇంటియద్దెను గృహస్థ శిష్యులు భరింపసాగిరి. గురుదేవుని వ్యాధి శిష్యులనందరను ఇట్లైక్యసూత్రబద్ధుల నొనర్చెను. వ్యాధి యెంత తీవ్రముగానున్నను, ఆధ్యాత్మ శక్తి శ్రీరామకృష్ణునియందీ సమయమున మూర్త్భీరించెను. దివ్యానుభూతుల నాతడనేకుల కనుగ్రహింపసాగెను. 1886 సంవత్సరము జనవరి యొకటవ తేదీ నాతడు తన యాశ్వీరచనము గోరినభక్తులలందెల్ల తన దివ్య సంకల్పముచే బ్రహ్మశక్తిని మేల్కొల్పెను. లోకకల్యాణార్థము నరేంద్రునకాతడు గొంత కాలమునకు బిమ్మట తన దివ్యశక్తులను బ్రసాదించెను. గుర్వనుగ్రహమున నరేంద్రుడింతకు ముందుగనే నిర్వికల్ప సమాధ్యనుభవమును బొందిన ధన్యాత్ముడు.
శ్రీరామకృష్ణుడించుమించుగా నొక సంవత్సరము వ్యాధిగ్రస్తుడై యుండెను. అంత్యదినము పర్వెత్తుకొనివచ్చినది. శ్రావణకృష్ణ ప్రతిపత్ భానువారము రాత్రి ఇంచుమించుగా ఒంటిగంటకు (1886వ సంవత్సరము ఆగస్టు 16వ తేదిని) శ్రీరామకృష్ణుడఖండ సచ్చిదానందమయ పరబ్రహ్మైక్యము నొందెను.
శ్రీరామకృష్ణుడు తన భౌతిక శరీరమును జాలించెను. ఐననేమి? అతని దివ్య భావములు సజీవములై, శ్రీరామకృష్ణ మఠ సేవా సంఘములై దేశ సేవనే కాక ప్రపంచ సేవను సల్పుచుండుట లేదా?
ఉపదేశ సారము శ్రీరామకృష్ణుడు బోధించినదేమి? ‘మాటలమూలమునకంటె చేతల మూలమున’ నాతడెక్కువ బోధించెననుట ముమ్మాటికి నిజము. అతని దివ్యోపదేశము లాతని జీవితమున రూపుదాల్చినవి. ఆతడెన్నడును వ్రాసి యెరుగడు, ఉపన్యసించి ఎరుగడు, కాని తన బోధనలనన్నింటిని సంభాషణ రూపమున జిజ్ఞాసువుల కొసగెను. ఈ సంభాషణములను గొన్నిటిని శిష్యులతి జాగరూకతతో వ్రాసి భద్రపరిచి యున్నారు. కాని రుూ మూలములైనను అతని బోధనలను సమగ్రముగా దెలుపునని చెప్పజాలము. వాగ్రూపమున - సంభాషణ రూపమున ఆతడొనరించిన బోధనలలో శిష్యులు స్వయముగా వ్రాసియుంచినవన్నియు -విస్తారమగు వాఙ్మయమున బహు గ్రంథములలో గాన నగు నాతని యమూలోప్యదేశములన్నియు థారూపమున ‘శ్రీరామకృష్ణ బోధామృతము’న క్రోడీరింపబడియున్నవి.

- ఇంకా ఉంది
*
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి