సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుడు తన భావములకును ఆశయములకును అనుగుణమగు ఫలమును బొందుచుండును. భగవంతుడు కల్పతరువు వంటివాడు, ప్రతివాడును తాను కోరునది భగవంతుని వలన బొందగలడు. పేదవాని కుమారుడు కష్టపడి చదువుకొని యెట్లో ఉన్నత న్యాయస్థానమున న్యాయాధిపతియై యిట్లు భావింపవచ్చును.
‘‘నేనిప్పుడు హాయిగా నున్నాను. చాల పెద్ద ఉద్యోగము సంపాదించినాను. నాకేమియు లోటులేదు.’’ కాని యతడు తన యుద్యోగమును జాలించి ‘పెన్సిలు’ పుచ్చుకొనుచు, తన పూర్వజీవితమును స్మరించునపుడిట్లు పశ్చాత్తాపపడును; ‘‘అయ్యో! ఈ జీవితమున నిజముగా నేజేసిన ఘనకార్యమేమి?’’ అంతరాత్మయగు భగవంతుడును అతనికిట్లు తెల్పును; ‘‘అయ్యో! నిజమే! నీవుచేసిన ఘనకార్యమేమియు లేదే!’
4. రెండు విధములగు సంస్కారములతో మానవుడీలోకమున బుట్టుచున్నాడు. అందొకటి ముముక్షుత్వమునకు హేతువగు విద్య, రెండవది సంసార బంధహేతువగు అవిద్య. మానవుని జన్మకాలమున నివిరెండును త్రామనందలి సిబ్బులవలె సరిసమానముగానుండునని చెప్పవచ్చును. వెంటనే సంసారము ఒక సిబ్బిలో లౌకిక సుఖములను, దైవము రెండవ సిబ్బిలో దైవజిజ్ఞాసనుబెట్టును. మనస్సు సంసారమును గోరుకొనెనా, అవిద్యయను సిబ్బి బరువై మానవుడు లోకమువైపునకు మ్రొగ్గును; అటులగాక దేవుని గోరుకొనెనా, విద్యయను సిబ్బి బరువై వానిని దేవుని వైపుకు మఱల్చును.
5. ఒకటి తెలిసికొంటినా, నీకన్నియు దెలియును. ఒకటియను అంకెతరువాత సున్నలను జేర్చినప్పుడు వానికి పదులు, వందలు, వేలు మొదలుగాగలిగిన విలువ యేర్పడుచున్నది, కాని యా ఒకటియను సంఖ్యను చెఱిపివేసితివా, సున్నలకు విలువ సున్నయే. ఏకమువలననే అనేకమునకు విలువ గలుగుచున్నది. మొదటిది ఏకత్వము, తరువాతిది నానాత్వము, మొదట భగవంతుడు, అటుపిమ్మట గణింపదగినవి జీవుడు, జగత్తును.
6. మొదట ఆత్మలాభమును బొందుము, తరువాత ధనము సంపాదింపుము- ఈ వరుసను తలక్రిందు చేయయత్నింపకుము, పరమార్థమును బొందిన వెనుక సంసారమున మెలగినను నీ మనశ్శాంతికి భంగము కలుగబోదు.
7. మీరేదియో సంఘసంస్కరణమనుచున్నారే! మంచిది, మొదట భగవంతుని సాక్షాత్కారము పొందిన తరువాత మీరటులచేయవచ్చును. భగవంతునిబొందుటకై ఋషులు సంసారమును త్యజించిరని మది నుంచుకొనుడు. అదియొక్కటియే మనకు ముఖ్యము. అటువెనుక వలసిన యెడల మిగిలినవన్నియు మీకు సమకూరును. మొదట భగవద్దర్శనము పొంది, పిమ్మట ఉపన్యాసములను గూర్చియు సంఘసంస్కరణమును గూర్చియు మాటలాడుడు.
8. క్రొత్తగా పట్టణమునకు వచ్చువాడు, రాత్రి పరుండుటకు తగిన గదిని జూచుకొని అచట తన సామానులను జేర్చుకొనవలయును. అనంతరము స్వేచ్ఛగా నగర విచిత్రములను జూడబోవచ్చును. అటుల చేయని పక్షమున రాత్రి చీకటిలో నిలువ తావులేక చాల బాధపడవలసి వచ్చును. అటులనే నిత్య శాంతి నిలయమగు భగవంతుని ప్రావు ముందుగా సంపాదించెనేని, ఈ లోకములోనికి వచ్చిన నూతన పురుషుడు తన నిత్యకృత్యములను చక్కబెట్టుకొనుచు సంసారమున నిర్భయముగా వర్తింపగల్గును.
ఇంకా ఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి