సబ్ ఫీచర్

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వామి చూస్తున్నాడు.
ఆ మంచంపై- కారుమేఘం వంటి శరీరం
అతి ప్రకాశ కల కర్ణ కుండలాలు
ఎఱ్ఱని కళ్ళు రజిత వస్త్రం.
శరీరానికంతకు రక్తచందనపు మైపూత- వీటితో సంధ్యాకాలాన మెరుపుతో కూడిన మేఘంలా ఉందా శరీరం. ఇదీ- నిద్రారావణ స్వరూపం. ఇటువంటి స్వరూపాన్ని స్వామి చూస్తున్నాడు.
నిశ్వసంతం యధానాగం రావణం వానరర్షభః
ఆసాద్య పరమోద్విగ్నః సో‚పాసర్పత్సు భీతవత్.
బుసలు కొడుతూన్న మహాసర్పంలా నిద్రపోతూన్న ఆ రావణ స్వరూపాన్ని చూసిన స్వామి భయపడుతూన్న వానిలా ప్రక్కకు తప్పుకొని మరొక వేదిక మీదకువచ్చి ప్రక్కనుండి చూస్తున్నాడట.
ఇదొక చిత్రం-
నిద్రలో ఉన్న రావణుని స్వామి చూసి జంకినట్లయితే తెలివిగా ఉన్నప్పుడు రావణుడు స్వామిని చూసి భయపడ్డాడు.
ఎందుకని- సాధకుడు తపస్సంపన్నుడు అయిన దుష్టుని తేజస్సు నిద్రాసమయంలో ప్రస్ఫుటమవుతుంది. తెలివివస్తే వాడి చెడు నడతవలన అది పొరకమ్మి ఉంటుంది. సమాన స్థితికలవాళ్ళు ఆ తేజ స్వరూపాన్ని చూడగలరు. పరమ శివభక్తుడు వేదవేత్త తపస్సంపన్నుడు అయిన రావణ తేజం స్వామి కంటబడింది. అలాగే-
సత్పురుష తేజం జాగ్రదవస్థలో విశిష్టమవుతుంది. కనుకనే హనుమ తేజాన్ని రావణుడు చూసి భయపడ్డాడు.
అలా చూస్తున్న స్వామికి రావణుడు.
మాషరాశి ప్రతీకాశం నిశ్శ్వ సంతం భుజంగవత్
గాంగే మహతితో యాంతే ప్రస్తుష్తమివ కుంజరమ్
మినుములు రాశిపోసినట్లు బుసలుకొడుతూన్న పాములాగ గంగా జలాల మధ్యలో నిద్రపోతూన్న ఏనుగు లాగ-కనిపించేడు. అంటే- తమో గుణ రజోగుణాల విజృంభణలో నిద్రపోతూన్న సత్వగుణంలా ఉన్నాడు. ఆ సత్వగుణం పైకి వస్తే విష్ణుసాన్నిధ్యమే. సరే-
అంతసేపు రాజభోగంలో భాగంగా వాద్య సంగీతాలతో రమించి అలసి ఆ వాద్యాలమీదే వాలిపోయిన రమణీజన సదోహం.
కాచి ద్వీణాం పరిష్వజ్వ ప్రసుప్తా సంప్రకాశతే
మహానదీ ప్రకీర్ణేవ నళినీ పోత మాశ్రీతా.
ఒకామె- వీణను వాయించి వాయించి అలసి దానిమీదే తలపెట్టుకొని నిద్రపోతున్నది. ఎలా! మహానదీ వేగంలో కొట్టుకొనిపోతూన్న పద్మం ఒక తెప్ప నాశ్రయించినట్లుట.
ఇక్కడ మహర్షి ఔచిత్యాన్ని మరచిపోరు.
స్వామి సదాచారాన్ని మరచిపోరు. హనుమ స్ర్తిముఖాల్నే చూస్తున్నాడు.
ఇప్పుడు కూడా వీణమీద వాలిన ఆమె ముఖానే్న చూస్తున్నాడు. దానే్న మహర్షి పద్మమంటున్నారు. ఒకామె-
డిండిమ వాదనం చేసింది. చేస్తూచేస్తూ అలసి ఆడిండిమానే్న ఒక చేత్తో కౌగిలించుకొని నిద్రపోతూన్నది. అలా నిద్రపోతూ మరొక చేతిని ప్రక్కనే ఉన్న మరొక డిండిమంపై వేసి అక్కున చేర్చించిదట.
ఇప్పుడెలా ఉందామో-
ఒక చేత్తో భర్తను మరొక చేత్తో పుత్రుణ్ణి కౌగలించుకొని దాంపత్య ప్రయోజన సుఖాన్ని అనుభవిస్తూన్నట్లుందిట.
స్వామి కంటిలో సీతమెదిలింది.
ఇలా స్వామి ఒకరిమీద నుండి దృష్టిని మరొకరి మీదకు మళ్ళీస్తూ ఒకచోట ఆగిపోయేడు.
గౌరీం కనక వర్ణ్భాం ఇష్టామంతః పురేశ్వరీం
కపిర్మందోదరీం తత్ర శయానాం చారురూపిణీం
సతాం దృష్ట్యా-
తర్కయామాస సీతేతి రూపవన సంపదా.
ఇదొక చిత్రం. అజ్ఞానానికి హద్దలేదు.
రావణాంతఃపుర పట్టమహిషి మండోదరి. ఆవిడ పుటంపెట్టని బంగారు రంగు కలది. ఆ పసుపులో కొంత తెలుపుంటుంది. అదే గౌరవర్ణం.
ఆవిడ కూడా సీతవంటి వన సంపద కలదట. కలది కాద. నిద్రాస్థితిలో చూడటం వలన కలదిగా కనబడుతున్నది. ఆమెను స్వామి చూసి సీతే అనుకొన్నాడు.
ఇది సాధకునకు సాధ్యము సిద్ధించేటప్పుడు జరిగే ప్రళయం. అన్నివిధాల తన ఉపాస్యదైవమువలె ఉంటుంది. అట్లనే బ్రమింపచేస్తుంది.
శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి
ఇంకావుంది...