సబ్ ఫీచర్

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాని నుండి దాని వరకూ వృద్ధి క్షయాలుంటాయి. అమ్మవారి స్వరూపమూ అట్టిదే. సాధకుడు అసాధ్య సిద్ధి అయ్యే వరకు అట్టి శ్రద్ధను పొంది ఉండాలి. ఇక్కడ ‘ధ్రువం హి సీతా’ అనే మాటకు ‘ధ్రువా హి సీతా’ అనే అర్థం. కాని ఇంతలో-
దృష్టమంతఃపురం సర్వం దృష్టా రావణ యోషితః
న సీతా దృశ్యతే సాధ్వీ వృధాజాతో మమశ్రమః
రావణాంతఃపురం అంతా వెదికేను. రావణ స్ర్తిలనందరిని చూసేను. ఆ మహాపతివ్రత సీత కనబడలేదు. నా శ్రమంతా వృధా అయింది అని అనుకొంటాడు.
కాలాన్ని అతిక్రమించి పౌరుషాన్ని విడిచిపెట్టి సీత కనబడలేదని సుగ్రీవుని దగ్గరకు వెడితే ఇంకేమైనా ఉందా! ఆయన మహాబలవంతుడు. తీవ్ర దండన విధి వున్నవాడు. అంతేకాదు-సముద్రం దాటి వెళ్లి ఏం చేసేవని మా వానరులడుగుతారు. అంగద, జాంబవంతాది పెద్దలకు ఏమని సమాధానం చెప్పను.
ఇదీ స్వామి బాధ.
సాధనలో వున్నవానికి కొంతకాలం గడుస్తుంది. కానీ లక్ష్య నిర్దేశం కాదు. పైగా చెరువు మరుపులు వస్తాయి. కానిది అయినట్లనిపిస్తుంది. కాదనీ తెలుస్తుంది. అసలు సాధ్యమైనదేది ఉన్నదో అది దొరకదని అనిపిస్తుంది. అలసట వస్తుంది. అలసటవలన చాలా శ్రమ పడ్డానన్న భావం పుడుతుంది. ఫలితం దక్కనప్పుడీ శ్రమ ఎందుకనే నిర్వేదం కలుగుతుంది.
నిర్వేదంవలన దుఃఖం పుడుతుంది.
దుఃఖంవలన నిరాశ కలుగుతుంది.
నిరాశ కార్యవిఘ్నతకు కారణమవుతుంది. అందువలన
అనిర్వేదశ్రీ్శయోమూల మనిర్వేదః వరం సుఖం
అనిర్వేదోహి సతతం సర్వార్దేషు ప్రవర్తకః
నిర్వేదములు లేని స్థితి ఉన్నదే-అదే సర్వ సంపదలకు మూలం, సర్వ సుఖములకు మూలం. నిర్వేదము లేనివాడే సర్వకార్యాలలోనూ ప్రవర్తించే ఉత్సాహాన్ని పొందుతాడు.
బుద్ధిమంతుడే ధైర్యవంతుడు.
మనం సుందరకాండ పారాయణ వలన పొందవలసిన మానసిక పరిపుష్టి ఇది.
చతురంగుళ మాత్రో పి నావకాశస్స విద్యతే
రావణాంతః పురే తస్మిన్ యం కపిర్నజగామ సః
నాలుగు అంగుళాల చోటు కూడా విడువలేదు. రావణాంతపురమందు ఆ స్వామి చూడవలసినదీ లేదు.
వివిధాకారాలలో వున్న రాక్షస స్ర్తిలను చూసేడు. అక్కడెక్కడ ఆ జానకి కనపడలేదు. లోకమందు సాటిలేని రూపవతులయిన విద్యాధర స్ర్తిలను చూసేడు. అక్కడా ఆ రాఘవ నందిని కనబడలేదు.
శ్రేష్ఠలైన నాగకన్యలలో వెదికేడు. అక్కడ సీత కనబడలేదు. బలాత్కారంగా అపహరింపబడి తీసికొని వచ్చిన నాగకన్యలున్నారట. అక్కడ జనక నందినీ దర్శనం కలుగలేదు. ఇలా ఎంతోమంది స్ర్తిలను చూసేడు, కాని సీత చూడలేకపోయిన స్వామికి విషాదం అలముకొన్నది. వానర ప్రభువుల ప్రయత్నం ఈ సముద్ర తరణం అన్నీ వ్యర్థమయ్యేయి అని స్వామి బాధపడుతూ ఆ విమానాన్ని దిగి-
చింతాముపజగామాథ శోకోపహత చేతసః
అయితే ఏమై ఉంటుంది? ఆవిడ కనబడకపోవడానికి ఆమెయే కారణం. అంతేకాని నా ప్రయత్నం కాదు అనుకొంటాడు. సాధకునికి ఇదొక దశ.
దైవికమైన విషయంలో ఆలోచిద్దాం.
జపం చేస్తూ ఉంటాడు. లేదా ఏదో నియమాన్ని అనుసరిస్తూ ఉంటాడు. కొంతకాలం అవుతుంది. అది ఫలించదు. వెంటనే దైవంపై అవిశ్వాసం కలుగుతుంది. ఇంత జపం చేసేను. ఇన్ని వ్రతాలు చేసేను. దైవం అంటూ ఉంటే ఫలితాన్ని ఈయవద్దా! అనుకొంటాడు. ఎప్పటికి ఫలితం వస్తుందో అప్పటి వరకూ ఆ పనిని చేస్తూనే ఉండాలి అనే ధృతిని కోల్పోతాడు.
ఇంకావుంది...