సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల
శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము - సంగ్రహ జీవిత సహితము -
అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి
*
ఎంతవఱకు అట్టియుత్తరముయొక్క అవసరము? దానిలోని సంగతులను తెలిసికొనువఱకేగదా! సంగతులు తెలిసినతోడనే కావలసిన వస్తువులను గొనుటకై ప్రయత్నించుటయే అతడు చేయవలసిన పని. అదే తీరున భగవత్ప్రాప్తిని బొందు మార్గమును, అనగా సాక్షాత్కారమునకు వలయు సాధనలను శాస్తమ్రులు మనకు దెలుపును. అంతే వాని పని. మార్గము తెలిసిన పిమ్మట మనము చేయవలసిన పని గమ్యమును జేరుటకు వలయు సాధనయే. సాక్షాత్కారమే మన గమ్యము.
160. దేనిసాయమున మనము భగవంతుని దెలిసి కొందుమో అదియే బ్రహ్మవిద్య. కేవల శాస్తమ్రులు, వేదాంతము, తర్కము, వ్యాకరణము మొదలగునవన్నియు మనస్సును కలవరపఱుచునట్టివి. గ్రంథములు ప్రాయికముగా గ్రంథులు (ముడులు). బ్రహ్మజ్ఞానమునకు సాధనభూతమైనంతవఱకే వానియొక్క ప్రయోజనము.
161. పుస్తకములు చదివిననేకాని బ్రహ్మజ్ఞానము కలుగదని భావింపరాదు. చదువుటకంటె వినుట మేలు, వినుటకంటె విశేషము సాక్షాత్కారము. గ్రంథములను ఊరక చదువుటకంటె గురుముఖమున తత్త్వమును వినుటచే మనస్సున బాగుగా నాటుకొనుచు; సాక్షాత్కారము చేతనో, తత్త్వజ్ఞానము స్థిరపడును. కాశీనగరమును గుఱించి పుస్తకములలో జదువుటకంటె దానిని స్వయముగా జూచిన వానినోట వినుట మేలు, కాని తనయంత తానే చూచుట సర్వోత్తమముగదా!
162. ఆత్మజ్ఞానము ఇరు తెఱగులవారికి అలవడును- ఎవరి మనస్సు పాండిత్యపు గందరగోళములోనికి దిగకుండునో లేక ఎరవు తెచ్చుకొనిన భావములతో పూడిపోకుండునో వారికిని, సమస్త వేద వేదాంగములను జదివినను ఎవ్వరు తమకేమియు తెలియలేదను సంగతిని తెలిసికొనియుందురో వారికిని (ఈ యిరు తెఱగులవారికి మాత్రమే) జ్ఞానలాభము గలుగును.
163. ఏవో దోషములనియు మూఢాచారములనియు బలుకుచు గొందఱు తమ పాండిత్యమును గుఱించి గర్వపడుచుందురు. కాని నిజమైన భక్తుడు తన కెప్పుడును దయామయుడగు భగవానుడే చేయూత నొసగ సిద్ధముగానున్నాడని తెలిసికొనును. కొంత కాలము ఆతడు తప్పుత్రోవను బోవుచుండినను బోవుగాక, మఱేమియు బాధలేదు. వానికేది ఆవశ్యకమో భగవానుడెఱుగును. భగవానుడే భక్తుని యభీష్టమును సిద్ధింపజేయును.
164. ఇరువురు మిత్రులొక తోటలోనికి బోయిరి. వారిలో లౌకిక జ్ఞానదక్షుడగునాతడు వెంటనే తోటలోని మామిడి చెట్లను లెక్కింప నారంభించెను. మఱియు చెట్టుచెట్టునకు ఎన్ని కాయలు గలవో, మొత్తముమీద తోటయెంత కిమ్మతుచేయునో అంచనావేయసాగెను. వాని మిత్రుడు తోడ యజమానుని దగ్గఱకుబోయి వానితో మెల్లగా స్నేహము చేసికొని యొక చెట్టును సమీపించినాడు; యజమానుని సమ్మతిని బొంది పండ్లు కోసికొని తిననారంభించినాడు. వీరిరువురిలో బుద్ధిశాలి యెవడు? మామిడి పండ్లను తినిన నీయాకలి తీరును. అంతేకాని చెట్లను ఆకులను లెక్కించి అంచనావేయుటవలన నేమిలాభము? శుష్క పండితుడు సృష్టి యొక్క ఉత్పత్తి క్రమములను కనుగొనుయత్నమున వ్యర్థముగా కాలయాపన చేయును. కాని వినమ్రుడును విజ్ఞానియునగు నాతడు సృష్టికర్తతో చెలిమి సంపాదించి వాని ప్రసాదమున లభించు బ్రహ్మానందము ననుభవించును.
165. ప్రజ్ఞాన స్వరూపిణియగు నాజగజ్జననియొక్క కటాక్షమొక్కటి ప్రసరించిన జాలును, మహాపండితాగ్రేసరుని సైతము పడగొట్టి నేలపై బ్రాకు నీచక్రిమితుల్యునిగా గాన్పింపజేయగలదు.
166. ‘గీతా’యను పదమును వేగముగా ‘గీ-తా-గీ-తా-గీ-తాగీ’యని పదిసార్లు ఉచ్చరింపుము. చూడగా అది‘తాగీ, తాగీ’అని యుచ్చరింపబడును గదా? తాగి లేక త్యాగియనగా భగవంతుని బొందుటకై సర్వము త్యాగముచేసిన వాడని యర్థము. ఇటులొక్కమాటలో గీత యిట్లు బోధించుచున్నది. ‘‘ఓ సంసారులారా! త్యాగముచేయుడు! అన్నిటిని త్యజించి భగవానునిపైకి బుద్ధి మఱల్పుడు.’’
ఇంకావుంది...