సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

187. మేడ కప్పుపై బడు వాన నీరు అందు విచిత్రముగా పులితల తీరున అమర్పబడు గొట్టములనుండి నేలపై బడుచుండును. దానిని జూచిన, పులి నోటినుండి నీరు వచ్చుచున్నటుల తోచును. కాని నిజముగా ఆ నీరు ఆకాశమునుండి పడుచున్నది. అదే తీరున భాగవతోత్తముల నోటినుండి వెలువడు దివ్యబోధలు వారి పలుకులవలె గాన్పించినను నిజమున కవి భగవంతుని నుండియే వెల్వడుచున్నవి.
లౌకికులు: వారి ధోరణులు
లౌకికుల లక్షణములు- ప్రాపంచిక జనుల పురాణ వైరాగ్యాదులు, వారి భక్తిరీతులు- లౌకికులు: పారమార్థిక సాధనలు
లౌకికుల లక్షణములు
188. మనుష్య మాత్రులు, మనీషావంతులునని మనుష్యులు ఇరు తెఱగులుగా నుందురు. భగవంతునికోసము పరితపించువారు మనీషావంతులు. కామినీ కాంచనములకోసము ఆరాటపడువారు మనుష్యమాత్రులు.
189. ఒకే వేషమును అనేకులు ధరింపవచ్చును. మేకవనె్న పులివలె అనేకులు నరరూపమును దాల్చిన జంతువులు. వీరిలో కొందఱు చీల్చి చెండాడు తోడేళ్లు, కొందఱు భయంకరమగు భల్లూకములు, మఱికొందఱు జిత్తులమారి నక్కలు, ఇంకను గొందఱు విష సర్పములు.
190. సన్నని ధాన్యపు గింజలను బోవిడిచి, ముదుక గింజలను, పొల్లుకాయలను నిలుపుకొనుట జల్లెడయొక్క స్వభావము, అట్లే దుర్జనులు సద్విషయములను విడిచిపెట్టి దుర్విషయములను తమలో నిలుపుకొందురు. చేటయొక్కయు సజ్జనుల యొక్కయు స్వభావము సరిగా నిందులకు వ్యతిరేకము.
191. సహజముగా లోకమున గొందఱికి ఆకర్షణ లేవియు లేకున్నను, వారేదియో మమకారమును గల్పించుకొని దానికి దాసులై యుందురు. స్వేచ్ఛగా, ఏ తాపత్రయము లేకుండ నుండుట వారికి గిట్టదు, అటు లుండవలయుననియు వారు తలపరు. తాను సంరక్షింపవలసిన కుటుంబము కాని, బంధువులు కాని లేనివాడు ఏ పిల్లినో, కుక్కనో, కోతినో లేదా ఏ పక్షినో చేరదీసి దానినిక మక్కువతో జూడనారంభించును. ‘తా వలచినది రంభ, తా మునిగినది గంగ’యనునట్లు ఇక వానికి దానితోడిదే లోకము! ఆహా! లోకులను మాయ ఎన్నివిధములుగా మోహితులను జేయుచున్నదో!
192. లేగ దూడ ఎంతయో చుఱుకుగను ఉల్లాసముగను గాన్పించును. తల్లియొద్ద కమ్మని పాలు కుడుచుటకు మాత్రము అపుడపుడు ఆగుచు, దినమంతయు చెంగుచెంగున గంతులు వేయుచుండును. కాని మెడకు పలుపుగట్టగనే ఆ ఉత్సాహము అంతయు పోవ బిక్క మొగము వేయును. క్రమముగా చిక్కిపోవ నారంభించును. ఇదే విధముగా సంసారముతో జోక్యము లేకున్నంతవఱకు బాలుడు కేళీవిలాసముల దేలుచుండును. వివాహపాశముచే సంసారబద్ధుడై కుటుంబ బాధ్యతలు తనమీద బడినంతనే ఆ ఉల్లాసమంతయు అణగిపోవును. మోమున నిరుత్సాహము, విచారమును మూర్త్భీవించును. చెక్కిళ్లనుండి బాల్య వికాసము పలాయనముకాగ్రమముగా నుదుట విచార సూచకమగు ముడుతలు కాన్పింప నారంభించును. ప్రాతఃకాలమారుతమువలె స్వేచ్ఛామయమై, నవకుసుమములీల సుకోమలమై, మంచు బిందువు చందనము స్వచ్ఛమై తనరారు బాల్యము ఆజన్మాంతము ఎవ్వనియందు శోభిల్లునో వాడే ధన్యాత్ముడు!
193. పసి బాలునకుగాని, బాలికకు గాని సంభోగానందమన నెట్టిదో అవగాహన కాదు. అటులనే లౌకికులకు ఆత్మ సంయోగానంద మననెట్టిదో అర్థముకాదు.
194. సంసార యాతనలను నిరంతరము అనుభవించుచున్నను సంసార పరాయణులు కామినీ కాంచన మోహమును నిగ్రహించి కామారిపైకి మనసు మఱలింప నొల్లరుకదా!
195. పరమార్థమున వానికి గల వెగటు చేతనే ప్రాపంచికుని సులభముగ దెలిసికోవచ్చును. మంత్రముగాని, స్తోత్రమునుగాని, తుదకు నామసంకీర్తనమును గాని యాతడు విననొల్లడు, సరికదా, ఇతరులను విననీయక నిరుత్సాహపఱచును. ప్రార్థనలను భజన సంఘములను నిరసించి హేళన చేయువాడెవ్వడో వాడే పరమలౌకికుడు, సంసారబద్ధుడు.
ఇంకావుంది...
శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము - సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి