సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు మంచి పాయసము లభింపగలదు; సొగసుకత్తెల కౌగిండ్ల ననుభవింపవచ్చును, రండు, రండు!’’ అని బోధించుచు వారికి ఎరజూపిరి. వీనికాశపడి అనేకులు వారితో భగవన్నామసంకీర్తన మొనర్చుటకై గుమికూడెడివారు. క్రమముగా నామామృతముయొక్క రుచి మరగినంతనే వారికి నిత్యానందుని బోధలోని రహస్యార్థము బోధపడినది. భగవద్భక్తిచే బాష్పధారలు వెల్లివిరియు దమకు గలుగు నానందపారవశ్యమే పాయసానందమనియు, భూమియే రుూ సొగసు కత్తెయనియు, భగవత్ప్రేమ పరవశులై నేలపైబడి దొరలుటే ఆమె యాలింగనమనియు వారు గ్రహించిరి!
**
సాధకులలో వేర్వేఱు తరగతులు
227. లక్షలకొలదియు గాలిలో ఎగురుచుండు గాలిపటములలో ఏ యొకటి రెండు మాత్రమో దారము తెంపుకొని స్వేచ్ఛనుబొందును. అటులనే వేలకొలది సాధకులలో ఏయొకరిద్దఱో సంసారబంధమునుండి విముక్తులు కాగలరు.
228. హోమపక్షులనునొక జాతిపక్షులు కలవని చెప్పుదురు. ఆకసమున అత్యున్నత ప్రదేశమున నివసించును. ఆ తావున తమకుగల అమితప్రీతిచే అవి యెన్నడును భూమిపైకి రావు. అవి తమ గ్రుడ్లను గూడ ఆకసముననే పెట్టును. భూమ్యాకర్షణచేత అవి క్రిందబడునప్పుడు మార్గమధ్యమున గాలి ఒత్తిడిచే పిల్లలై తాము క్రిందపడుచున్నామని గుర్తించినంతనే నిజస్వభావముచే ప్రేరితములై పైనున్న తమ నివాసమువైపునకు ఎగిరిపోవునట. శుకదేవుడు, నారదుడు, ఏసుక్రీస్తు, శంకరాచార్యులు మున్నడు మహనీయులీ హోమ పక్షులవంటివారు. పసితనముననే ఇట్టివారు ప్రాపంచిక విషయములయెడ పరమవిరక్తులై బ్రహ్మజ్ఞానధామమున కెగసిపోవుదురు.
229. గుప్తయోగులనియు ప్రకటయోగులనియు యోగులు రెండు విధములుగానుందురు. గుప్తయోగులు రహస్యముగా తమ సాధనలను సాగించుచు జనులదృష్టికి గాన్పింపకుందురు. ప్రకటయోగులో, దండ కమండల్వాది బాహ్యచిహ్నములనన్నిటిని ధరించి పారమార్థక విషయములనుగూర్చి జనులతో స్వేచ్ఛగా ప్రసంగించుచుందురు.
230. మొదట పూవును తరువాత పిందెయు పుట్టుక ప్రకృతియొక్క సర్వసాధారణ ధర్మము. కాని కొన్ని జాతుల చెట్లందును పాదులందును మొదట పిందెలును తరువాత పూవులును గాన్పించును. అటులనే బ్రహ్మసాక్షాత్కారము పొందుటకు ముందు సామాన్య మానవులనేక సాధనలను జేయవలసియుండ, మొదట సాక్షాత్కారమును బడసి తరువాత సాధనలను జేయువారు కలరు.
231. పేలాలు వేగించు మూకుడునుండి యెగిరి విచ్చుకొని బయటపడు గింజలు శ్రేష్ఠమైనవి. వానికెట్టి మచ్చయునుండదు. బాగుగా వేగి మూకుడులో నిలుచు పేలాలలో ప్రతిదానికిని కాలిన మచ్చ ఏ కొంచెమో ఉండకపోదు. ఆలాగుననే సద్భక్తులలో సంసారమును పూర్తిగా త్యజించి సంచరించువారు ఏ కళంకమును లేక పరిశుద్ధులైయుందురు. ఇక సంసారముననేయుండు భక్తులలో ఉత్తమోత్తములు సహితము తమ ప్రవర్తనలో ఏదో రవంతమచ్చను గలిగియే యుందురు.
232. సూర్యోదయము కాకముందే చిలికిన వెన్న మేలైనది. సూర్యుడు ఉదయించిన పిమ్మట చిలికిన వెన్న అంత శ్రేష్ఠమైనదికాదు. కాలాంతరమున సన్న్యాసులైన తన బాలశిష్యులతో శ్రీగురుదేవుడిట్లనుచుండెడివాడు: ‘‘మీరు ప్రాతఃకాలమున చిలికిన వెన్నవంటివారు. నాగృహస్థ శిష్యులో, ప్రొద్దుఎక్కిన వెనుక చిలికిన వెన్నవంటివారు.’’
233. లేత వెదురును సులభంగా వంచవచ్చును, ముదిరిన వెదురును (బలాత్కారముగా) వంచబోయిన అది పళుక్కున విరుగును గాని వంగదు. పిల్లల హృదయమును భగవంతునివైపు సులభముగా మఱల్పవచ్చును. కాని వయసు చెల్లినవారి కట్టుబాట్లులేని మనస్సును భగవంతునివైపు ద్రిప్పబ్రయత్నించినచో, అది పట్టుతప్పిపోవుచుండును.
234. చిలుక పెద్దదై కంఠమందలి స్వరనాడులు గిడసబాఱిన తరువాత దానికి సంగీతము నేర్పజాలము. చిన్నతనమున, కంఠమాల కాన్పింపక మునుపే, దానికి గీతములు నేర్పవలసియుండును. అటులనే ముసలితనమున భగవంతునిపై మనసు నిలుపనేర్చుట కష్టసాధ్యము. కాని చిన్నతనముననో, అది సుసాధ్యమగును.
235. మామిడిపండు దేవునికి అర్పణచేయవచ్చును, లేదా మఱి యెందులకైనను వినియోగింపవచ్చును; కాని కాకి దానిని ఒక్కసారి పొడిచిన జాలును, అది యెందులకును కొఱగానిదగును. అపుడది దేవతార్పణకా, పనికిరాదు; బ్రాహ్మణునకు దానముచేయుటకా, తగదు; మఱియు ఉత్తములెవరైనను తినుటకును అక్కఱకురాదు. కావున బాలబాలి కల హృదయము నిర్మలముగా నున్నప్పుడే, అనగా భోగవాంఛలచే కళంకితముగాకమునుపే భగవంతుని సేవయందు వారిని నియమింపవలయును.
ఒక్కసారి భోగవాంఛలు వారి మనసున బ్రవేశించెనా, లేదా విషయ సుఖములను దయ్యము వారిపై తన వినాశకరచ్ఛాయల నొక్కసారి ప్రసరింపజేసెనా, వారినిక ధర్మమార్గమున నడిపించుట దుర్ఘటము.
ఇంకావుంది...