సబ్ ఫీచర్

నిర్భయునికే సత్యదృష్టి( ఓషో నవజీవన మార్గదర్శకాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్రవర్తి ఆజ్ఞానుసారం అనే్వషిస్తున్న సైనికులకు నదీ తీరంలో దిగంబరంగా కనిపించాడు. ‘డేండమిస్’. వెంటనే సైనికులు ఆయనతో ‘‘మాతోపాటు మా దేశానికి రమ్మని మిమ్మల్ని అలెగ్జాండర్ మహాచక్రవర్తి ఆహ్వానిస్తున్నారు. మీకు కావలసిన సదుపాయాలన్నీ మేము ఏర్పాటుచేస్తాము. మీరు మా రాజ అతిధి’’ అన్నారు.
‘‘మహా చక్రవర్తిని తనకుతాను గర్వంగా చెప్పుకుంటూ విర్రవీగుతున్న మీ చక్రవర్తి ఏమాత్రం గొప్పవాడు కాదు. నన్ను ఎవరూ ఎక్కడికీ తీసుకెళ్ళలేరు. నేను ఎవరికీ బానిసను కాను. మేఘాలలా పూర్తి స్వేచ్ఛతో ఉండేవాడే అసలైన సన్యాసి. నేను రానని మీ చక్రవర్తికి చెప్పండి’’ అన్నాడు ‘‘డేండమిస్.’’
‘‘మీరు అలెగ్జాండర్ చక్రవర్తి గురించి వినే ఉంటారు. ఆయన చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఆయన తన మాట కాదన్నవారి తలను నరికేస్తాడు’’అన్నారు సైనికులు. ‘‘ఫరవాలేదు నేను అన్న మాటలను ఆయనతో చెప్పండి’’అన్నాడు ‘‘డేండమిస్’’. విధిలేక ఆ సైనికులు ‘‘డేండమిస్’’ అన్న మాటలను అలెగ్జాండర్‌కు విన్నవిస్తూ ‘‘ఆయన దిగంబరంగా ఉన్నా, ఆయన సమక్షంలో మీరు అన్నీ మరచిపోతారు. ఆయన చుట్టూ పరమ నిశ్శబ్దంతో కూడుకున్న ఏదో తెలియని ఆకర్షణతో కూడిన దివ్య తేజస్సు ఉంది. మీరు ఆయనను తప్పక చూడాలి’’అన్నారు. వారి మాటలు విన్న అలెగ్జాండర్ చేత ఖడ్గాన్ని ధరించి ఆయన దగ్గరకు వెళ్ళాడు. అతనిని చూసిన ‘‘డేండమిస్’’నవ్వుతూ ‘‘ఆ ఖడ్గంతో నీకు ఇక్కడ పనిలేదు. ఎందుకంటే, దానితో నువ్వు నా శరీరాన్ని మాత్రమే ఖండించగలవు కానీ, నన్ను ఖండించలేవు. ఎందుకంటే, నేను నా శరీరాన్ని ఎప్పుడో వదిలేశాను. నువ్వు నా తలను ఖండిస్తే అది నేలపైపడడం నీకు కనిపించినట్లుగానే నాకూ కనిపిస్తుంది. ఎందుకంటే, నేను శరీరాన్ని కాదు, సాక్షిని. కాబట్టి, పసివాడిలా ప్రవర్తించక ఆ ఖడ్గాన్ని దాని ఒరలో పెట్టు’’ అన్నాడు.
వెంటనే అలెగ్జాండర్ అప్రయత్నంగా తన ఖడ్గాన్ని ఒరలో పెట్టాడు. అలా ఇతరుల ఆజ్ఞను పాటించడం అలెగ్జాండర్‌కు అదే తొలిసారి. ఎందుకంటే, అతని సమక్షంలో అలెగ్జాండర్ తానెవరో మరచిపోయాడు. అలా ‘‘డేండమిస్’’ను వదిలి శిబిరానికి చేరుగున్న అలెగ్జాండర్ ‘‘అలాంటి మహానుభావుడిని నేను ఇంతవరకు చూడలేదు. పోరాడే వ్యక్తిని చంపగలం. అలా చంపడంలో అర్థముంటుంది. కానీ, మరణించేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తిని చంపడమెలా? అది అర్థంలేని పని’’అన్నాడు అందరితో.అలా తిరుగుప్రయాణాన్ని ముగించుకుని స్వదేశానికి చేరుకున్న అలెగ్జాండర్ తన స్నేహితులతో ‘‘నేను తీసుకురాగల సన్యాసులు చాలామంది ఉన్నారు. కానీ, వారు నిజమైన సన్యాసులు కారు. అయితే, నేను నిజంగా మృత్యువుకు కూడా భయపడని ఒక అరుదైన సన్యాసిని చూశాను. అలాంటి వ్యక్తిచేత బలవంతంగా ఎవరుమాత్రం ఏమి చేయించగలరు?’’ అన్నారు. మీ భయమే మిమ్మల్ని బానిసగా చేస్తుంది. మీరు నిజంగా నిర్భయులైతే ఎవరికీ మీరు ఏమాత్రం బానిస కాలేరు. నిజానికి, మీలోని భయమే ఇతరులు మిమ్మల్ని బానిసగా చేసుకోవడానికి ముందే మిమ్మల్ని వారికి బానిసగా చేస్తుంది. నిర్భయుడైన వ్యక్తి దేనికీ భయపడడు.

ఇంకావుంది...

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.