సబ్ ఫీచర్

మహాదేవ శంభోశంకర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలంకార ప్రియుడు విష్ణువు, అభిషేక ప్రియుడు శివుడు, నమస్కారం ప్రియుడు సూర్యుడు, తర్పణ ప్రియుడు గణేశుడు అని ఓ శ్లోకం చెబుతుంది. నిజమే శివకేశవులిద్దరూ ఒకరే అయినా మహావిష్ణువు పూజించాలంటే జాజులు మల్లెలు పొన్నలు తెచ్చి మంచి గంధంతో అలంకరించి వాసుదేవ నమోస్తుతే అని పూజించాలి.
అదే భోళాశంకరుడు, పార్వతీ ప్రియుడు, గజచర్మధరుడు, పినాకపాణి, నీలకంఠుడు అయిన పరమేశ్వరునికి కేవలం ఒక చెంబు నీళ్లు పోసి ఓమ్ నమశ్శివాయ అంటే చాలు శివుడు మురిసిపోతాడు. ఒక్కమారేడు దళం సమర్పించినా, విబూధిని ధరించినా శివుడు అపారమైన సంపదలను అనుగ్రహిస్తాడు. శివుడే మంగళప్రదుడు కనుక కోరిన కోర్కెలను చిటెకలో తీరుస్తాడు. ప్రతినెలలో కృష్ణపక్షంలో చతుర్దవి తిథి మాస శివరాత్రిగా భావించి శివపూజలు చేస్తుంటారు. మాఘ మాసంలోని కృష్ణ చతుర్దశి మాత్రం మహాశివరాత్రి, కాళరాత్రిగా అహంకార నాశనం చేసే శుభదినంగా భావించి లింగాకారంలో శివుణ్ణి అర్చించి పూజిస్తుంటారు. శివాభిషేకానికి భస్మం, చందనం, పాలు, తేనె, నెయ్యి, పంచామృతాలు కూడా శ్రేష్ఠమైనవే. ఒక్కొక్క పదార్థానికి ఒక్కో విశేషం ఉంది. మారేడు దళాలతో స్వామివారిని పూజిస్తే నూరు అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. మారాడు దళంలోని ఉండే మూడు ఆకులను సత్వరజస్తమోగుణాలకు ప్రతీకగా చెప్తారు. ముక్కంటి ప్రతిరూపంగా మారేడు దళాన్ని భావిస్తారు. ఆ బిల్వదళం ముందుభాగంలో అమృతం, వెనుక భాగంలో యక్షులు ఉంటారట. అందుకే శివపూజలో వినియోగించే బిల్వదళానికి ముందు భాగాన్ని మాత్రమే శివుడికి సమర్పిస్తుంటారు.
కార్తీకపున్నమి, శివరాత్రి పర్వదినాల్లో శివుడిని విశేషంగా అర్చించిన వారికి కైలాసప్రాప్తి కలుగుతుంది.
ఇంతటి ప్రాముఖ్యం ప్రసిద్ధిపొందిన శివుడిని తెలుసుకోలేని వారు మూర్ఖులుగా పరిగణించబడుతారు. ఓసారి హిమవంతుని పుత్రికగా పుట్టింది. అపుడు మేనకాహిమవంతులు ఆమెను అత్యంత గారాబంగా పెంచుకున్నారు. యుక్తవయస్సు రాగానే తల్లిని వివాహం చేయాలనుకొంటే ఆ తల్లి పరమేశ్వరుని తప్ప మరొకరిని పెండ్లాడనని ఆ పరేశ్వరుని మెప్పించడానికి అపర్ణయై తపస్సు చేసింది. ఆ కాలంలో ఆమె మనసును మరింత శోధించాలని పరమశివుడే వటు రూపంలో వచ్చాడు. శివుడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకొంటున్నారు. శివుడు శ్మశాన వాసి, పులిచర్మం ధరిస్తాడు, నాగులను ఆభరణాలుగావేసుకొంటాడు. చేతిలో భిక్షాపాత్రను పట్టుకొని భిక్షమెత్తే శివుడిని ఎందుకు చేసుకొంటారు అతడిని చేసుకోవడం వల్ల ఆ అమంగళాలన్నీ మీరు అనుభవించాల్సి వస్తుంది కదా అని వటురూపంలో శివుడు అంటుండగానే హిమవంతుని కుమార్తె ఉమాదేవి ఆగ్రహం పట్టలేక వెంటనే అక్కడ్నుంచి వటువును వెళ్లిపొమ్మంది. ఇంకొంక మాట శివదూషణ జరిగితే నిన్ను లేకుండా చేస్తానని ఆదిపరాశక్తి అవతారంగా ఉగ్రరూపంతో కనిపించింది. అంతే ఆ వటువు మటుమాయం అయ్యాడు. ఆ తరువాత సర్వదేవతలు వచ్చిమేనకా హిమవంతులను అడిగి పార్వతీపరమేశ్వర కల్యాణానికి శ్రీకారం చుట్టారు.
అట్లా శివకల్యాణం జరిగింది. ఆ శివాజ్ఞలేనిదే చీమనై కుట్టదు. శివుడే మంగళకరుడు ఆద్యుడు లయకారుడు ప్రళయకారుడు సాంబశివా హర హర మహాదేవా శంభోశంకరా అన్న పిలుపు వినిపించినంతనే పిలిచిన వారు ఎవరై ఉంటారన్న ధ్యాస కూడా లేకుండా వచ్చి వారి చెంత నిలిచి వారి కోరికలను తీర్చే అపార కరుణావత్సలుడు భోళాశంకరుడు.
ఆశివుడే ఓసారి బ్రహ్మ విష్ణువులకు అహంకార నాశనం చేయడానికి మహాజ్యోతిరూపంలో లింగాకారాన్ని ధరించాడు. ఆ లింగోద్భవం అయినరోజునే శివరాత్రిగా పరిగణిస్తున్నారు. త్రిమూర్తులనే వదలిపెట్టని మహామాయ మానవులను వదులుతుందా? ఆ మహామాయ నుంచి తప్పించుకునేందుకు శివునిపాదాలను ఆశ్రయించడానికి ఈ లింగోద్భవవేళ ఎంతో శుభదినం. ఈ శివరాత్రినాడు నమశ్శివాయ అనే నామస్మరణ చేస్తూ మారేడు దళాలతోను, జిల్లేడు పూవులతోను శివుడిని అభిషేకించి పూజిస్తారు. రోజంతా నిరాహారంగా ఉంటూ శివాలయంలోనే గడుపుతుంటారు. రాత్రంతా కూడా శివనామస్మరణతోను, శివకథలను వింటూ జాగారం చేస్తారు. అట్లాచేసిన వారికి శివానుగ్రహం కలుగుతుంది. వారికి అంత్యంలో శివలోక ప్రాప్తి కూడా కలుగుతుంది. కనుకనే శివరాత్రిని మహాపండుగగా శైవులేకాదు మానవులందరూ జరుపుతారు. విశేషపూజలతోను, అర్చనలతో, అభిషేకాలతో శివాలయాలను కిటకిట లాడుతుంటాయి.

- శ్రీనివాస్ పర్వతాల